మా ప్రయత్నం
ముంబైలో తెలుగు సాహిత్యసమితి వారి ఆధ్వర్యవంలో పూజ్య గురువులు శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ గారు 2009లో ప్రారంభించిన శ్రీ మన్మహాభారత ధారావాహిక వ్యాఖ్యాన ప్రసంగాలు ITM విద్యాసంస్థలకు వ్యవస్థాపకులైన శ్రీ పుచ్చా రమణగారింట్లోనిరాఘాటంగా 250 ఆదివారాల నుండి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం శాంతిపర్వం జరుగుతోంది. ఈ వ్యాఖ్యానామృతాన్ని జనులందరూ ఆస్వాదించాలనే సదుద్దేశంతో వీటిని రికార్డింగ్ చేయించాము. ఈ వ్యాఖ్యాన ఖండికలను ముంబయిలో క్రమబద్ధీకరించి వెబ్ సైట్లో ఎక్కిస్తున్నాము. ఈ ప్రయత్నంలో మాకు సహకరిస్తున్న వారు ముంబయిలో సౌండ్ ఎడిటర్ శ్రీ సమీర్ ఖోలే గారు, హైదరాబాద్లో వెబ్ కన్సల్టెన్ట్ శ్రీ రమణ రంజన్ గారు......
వ్యాస వాణి
Discontentment, inappropriate actions, arrogance, deep attachment, unpleasant attitude, power, illusion, high sense of ego,
-
వినుము
వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అన్నారు పెద్దలు. మరింకెందుకు ఆలస్యం? రండి భారతామృతాన్ని ఆస్వాదిద్దాం.....
-
చదువుము
"భారతంలో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" అన్నది ఆర్యోక్తి. చదివి చెడినవాడు లేడు. ఇంకెందుకాలస్యం? మొదలుపెట్టండి.....
-
దిగుమతులు
ఇచ్చట నిధి నిక్షేపాలు ఉచితంగా పంచబడును. తోడుకున్నవారికి తోడుకున్నంత.....
మా లక్ష్యం
ఈ వెబ్సైట్ను మహాభారత విజ్ఞాన సర్వస్వంగా రూపొందించడమే మా లక్ష్యం. మహాభారతానికి సంబంధించిన ఏ అంశానికైనా మా ఈ వెబ్ సైట్ గమ్యస్థానం కావాలన్నదే మా అభిలాష.