ఉద్యోగ పర్వము1
ఈ విభాగములో మహాభారతంలోని అష్టాదశ పర్వాల ప్రస్తావన, ఉద్యోగపర్వ ప్రాధాన్యత, ఉద్యోగపర్వం నాటికి పాండవుల వయో విషయ చర్చ, ఉద్యోగపర్వంలో కౌరవ పాండవ కృష్ణాదులు చేసిన ప్రయత్నం, కృష్ణ తత్త్వం, శ్రీకృష్ణ జననము మొదలైన అంశాలు ప్రస్తావించబడ్డాయి
ఈ భాగములో దేవకీ వసుదేవుల పూర్వజన్మ ప్రస్తావన, శ్రీకృష్ణ జననము, బలరామకృష్ణుల నామకరణం, చిన్ని కృష్ణుని అల్లరి పనులు, లీలలు మొదలైన అంశాలు నిక్షేపించబడ్డాయి.
ఈ భాగంలో ముఖ్యమైన అంశాలు: భీష్మ, విదుర, ద్రోణ, ద్రుపద, బలరాముల మనఃప్రవృత్తులు, ఉత్తరాభిమన్యుల వివాహానంతరం పాండవులు, వారి కుమారులు, బంధువులు, మిత్రులతో కలిసి సభ తీర్చుట, తిక్కనగారి ఉద్యోగపర్వ రచనా విశేషం, వ్యాసుల వారి శైలీ విన్యాసం.
ఈ భాగంలో ముఖ్యాంశాలు: కృష్ణుడు ఉత్తరాభిమన్యుల వివాహానికి విచ్చేసిన బంధుమిత్రులకు ధర్మరాజు ధర్మవర్తనను, సుయోధనుని కుటిలత్వాన్ని నిరూపించి, పాండవులు అరణ్యవాస, అజ్ఞాతవాస కాలాల్లో అనుభవించిన కష్టాలను గుర్తుచేసి, వారిని ధర్మరాజుకు కర్తవ్య నిర్దేశం చేయమని కోరుట.
ఈ భాగంలో ముఖ్యాంశాలు: ద్రౌపదీ స్వయంవరం తరువాత దుర్యోధనుడు ధృతరాష్ట్రునితో పాండవులను అంతమొందించుటకు కుటిలమైన యుక్తులు చర్చించుట, ఆ పై ధృతరాష్ట్రుడు పాండవులతో యుద్ధము చేయుట కొఱకు భీష్మాదులతో చర్చించుట, వారు పాండవులకు అర్థరాజ్యమిమ్మని సూచించుట, ఆ విధముగా సంప్రాప్తించిన రాజ్యమును కపట ద్యూతములో పరిగ్రహించిన సుయోధనుని జయించుటకు తగిన బలాలు సమీకరించుట కొఱకు ఆహూతులైన రాజులతో కృష్ణుడు చర్చించుట.
ఈ భాగంలో ముఖ్యమైన అంశాలు: దూతలకు ఉండవలసిన లక్షణాలు, పాండవాదులు దూతగా ఎవరిని పంపించాలా అని జరిపిన సమాలోచన, పాండవులతో దుర్యోధనాదులు ఆడిన కపట ద్యూతాన్ని వివరించడంలో వ్యాసుని రచనాశైలి, పాండవులను సమర్ధిస్తూ బలరామ, సాత్యకులు పలికిన మాటలు.
ఈ భాగంలో ముఖ్యమైన అంశాలు: శ్రీకృష్ణునికి, పాండవులకు ఉన్నటువంటి అనుబంధం, పాండవాదులు రాజ్యపంపకం గురించి దుర్యోధనుని అభిప్రాయం తెలుసుకొనగోరుట, పాండవులు కొలువుదీరిన సభా వర్ణన. విరాటపర్వానికి గల నాలుగు విశేషణాలు, ఉద్యోగపర్వంలోని రాజనీతి నైపుణ్య అనుభవసారం, సభలో సాత్యకి, బలరాముల సంవాదం, కౌరవ, పాండవుల మధ్య వైరాన్ని ప్రజ్జ్వరిల్లచేస్తూ శకుని పలికిన మాటలు
ఈ భాగంలో ముఖ్యమైన అంశాలు: యుద్ధంపై బలరాముడు, సాత్యకి, విరాటరాజు, ద్రుపదుల మనోభావాలు, బాల్యంలో ద్రుపదుడు మరియు ద్రోణుల మైత్రి, ఆ తరువాత ద్రోణుడి శిష్యుడైన అర్జునుడిచే ద్రుపదుడికి జరిగిన పరాభవము, రాయబారం ఏవిధంగా నడపాలనే విషయం మీద ద్రుపదుని ప్రసంగం.
ఈ భాగంలో ముఖ్యమైన అంశాలు: ద్రుపదుని యొక్క పురోహితుని దుర్యోధనుని వద్దకు రాయబారానికి పంపడం, కౌరవ, యాదవ కుటుంబాలకు గల సంబంధ బాంధవ్యాలు, జాంబవతీ పుత్రుడు దుర్యోధనుని పుత్రికను రాక్షసవివాహం చేసుకోవడం, ద్రుపదుడు తన సైన్యాలను సమాయత్తపరచడం, ద్రుపదుడు రాయబారానికి తన పురోహితుని ఒప్పించి కర్తవ్యబోధ చేయడం, నూటపదహారు రూపాయల సంప్రదాయం, అందరి అభిప్రాయలు తెల్సుకుని అందరికీ వీడ్కోలు చెప్పి ద్రుపదపురోహితుడు రాయబారానికి బయలుదేరడం.
ఈ భాగంలో ముఖ్యమైన అంశాలు: రాజకీయప్రక్రియ ఏవిధంగా ఉండాలనే విషయంపై సభలో జరిగిన వాదోపవాదాలు, శ్రీకృష్ణుడు యుద్ధంపై అందరి అభిప్రాయాలు సేకరించడం, రాయబార విషయంపై ద్రుపద, విరాటమహారాజులు జరిపిన చర్చ, యుద్ధంలో శ్రీకృష్ణుని సహాయం కోరడానికి అర్జునుడు, దుర్యోధనుడు ద్వారకకు రావడం, సంస్కృత కవి భాసుని పరిచయం.