విరాట పర్వము1
ఈ శ్రవణ భాగంలోని ముఖ్యాంశాలు: తిక్కన కవితా వైశిష్ట్యం, విరాట పర్వం ప్రాముఖ్యత, కావ్య సంప్రదాయాలు, తిక్కన కాలం నాటి శైవ వైష్ణవ వైషమ్యాలు, తిక్కనలో నిర్వచనోత్తర రామాయణ రచనా కాలం నుంచి భారత రచనా కాలానికి కలిగిన మానసిక పరిపక్వత, తిక్కన వ్యక్తిత్వం, విరాటపర్వంలో తిక్కన చూపిన నాటకీయత, పూర్వ కవి స్తుతి, హరిహరనాథ తత్త్వం, తిక్కన స్వప్న వృత్తాంతం, షష్ట్యంతములు
ఈ శ్రవణ భాగంలోని ముఖ్యాంశాలు: తిక్కన ప్రబంధ రచనా ధోరణి, భారత కథా ప్రారంభం, ధర్మరాజు తమ కష్టాలు తలచుకొని నిర్వేదం పొందుట, ధౌమ్యుడు ధర్మజుని ఓదార్చుట, భీముని సాంత్వన వాక్యములు, సాహిత్య వివేచన-వసు చరిత్ర, అజ్ఞాతవాస మెచట సలపవలెనో యని ధర్మరాజు అర్జునునితో చర్చించుట , అర్జునుడు అనుకూల ప్రదేశములు తెలిపి ధర్మజుని గురించి చింతించుట, ధర్మరాజు వ్యక్తిత్వం, కాల మహిమ
ఈ శ్రవణ భాగంలోని ముఖ్యాంశాలు: పాండవులు తాము విరాటనగరంలో అజ్ఞాతవాసం చేయాలని నిశ్చయించుకొనుట, విరాటరాజ్యంలో తాము మెలిగే విధానం చర్చించుకొనుట, శమీ వృక్షమునందు పాండవులు తమ ఆయుధములు నిక్షేపించుకొనుట, విరాట నగర ప్రవేశం.
ఈ శ్రవణ భాగంలోని ముఖ్యాంశాలు: రాజు ఆంతరంగికుడిగా, బ్రహ్మజ్ఞానిగా కంకభట్టు వేషంలో ధర్మజుడు, వంటలవాడి రూపంలో వలలునిగా భీముడు, మాలినిగా సైరంధ్రి వేషధారణతో ద్రౌపది, అశ్వపాలకుడు దామగ్రంథిగా నకులుడు, గోపాలకుడు తంత్రీపాలునిగా సహదేవుడు, నాట్యాచార్యునిగా బృహన్నల నామధేయంతో అర్జునుడు విరాటనగరంలో ప్రవేశించుట.
ఈ శ్రవణ భాగంలోని ముఖ్యాంశాలు: విరాటుని పుత్రికావాత్సల్యం, ఉత్తరను నాట్యశిక్షణ కోసం అర్జునునికి అప్పగించడం, ఆలంకారికవివేచన, జీమూత మల్లునితో భీముని మల్ల యుద్ధం, మల్లయుద్ధ విశేషాలు, పాండవులు విరాటనగరంలో స్థిరపడిన విధం
ఈ శ్రవణ భాగంలోని ముఖ్యాంశాలు: విరాటనగరానికి కీచకుని రాక, ద్రౌపదిని కనుగొని కీచకుడు మన్మథ వికారము పొందుట, కవిబ్రహ్మ కవితా వైశిష్ట్యం, తిరుపతి వేంకట కవులవారి అవధాన విశేషాలు, భుజంగత్వం-ఒక చమత్కారం, ద్రౌపది పొందుకై కీచకుని ఆరాటం, ద్రౌపది కీచకుని హెచ్చరించుట, సుదేష్ణ తమ్ముని బుద్ధి మరల్చుటకై ప్రయత్నించుట, సైరంధ్రిని తమ్ముని వద్దకు పంపెదనని సుదేష్ణ చెప్పుట.
ఈ శ్రవణ భాగంలోని ముఖ్యాంశాలు: మదిరకై సుదేష్ణ ద్రౌపదిని కీచకుని ఇంటికి పంపుట, ద్రౌపది కలవరపాటు, ద్రౌపది కీచకుని మందిరానికి చనుట, కీచకుని ప్రేలాపనలు, కీచకుడు ద్రౌపదిని పట్టుకొనుటకు వెంటపడుట, ద్రౌపదీ పరాభవం- భీమసేనుని ఆవేశం, ధర్మరాజు విచక్షణ, నన్నయభట్టు పద్యవిద్య, ద్రౌపది నర్మభాషణం.
ఈ శ్రవణ భాగంలోని ముఖ్యాంశాలు: సుదేష్ణ ద్రౌపదిని ఓదార్చుట, కీచకుని వృత్తాంతం, ద్రౌపది భీమసేనుని వద్ద తన ఆవేదనను వ్యక్తం చేయుట, యుధిష్టిరుని ఔన్నత్యం, ద్రౌపది ప్రతీకార వాంఛ- భీమసేనుని ఊరడింపు, కీచకవధకు ప్రణాళిక, ద్రౌపది కీచకుని నర్తనశాలకు రమ్మని చెప్పుట.
ఈ శ్రవణ భాగంలోని ముఖ్యాంశాలు: కీచకవధ, ద్రౌపది మనోభావాలు, ఉపకీచకుల శోకం- ప్రతీకారయత్నం, ఉపకీచకుల దురాగతం, ద్రౌపది ఆక్రందన, ఉపకీచకుల సంహారం.
ఈ శ్రవణ భాగంలోని ముఖ్యాంశాలు: స్నాన విధులు- వివరణ, ద్రౌపది రాచనగరప్రవేశం, ద్రౌపది మనోల్లాసం- ఆలంకారిక వివేచన, కీచక-ఉపకీచక మరణంతో విరాటుని ఆందోళన, ద్రౌపదీ అర్జునుల సల్లాపం, సుదేష్ణ నిర్వేదం, ద్రౌపది సమాశ్వాసన.