విరాట పర్వము2
ఈ శ్రవణ భాగంలోని ముఖ్యాంశాలు: పాండవులను వెదకి కాన రాక వేగులు సుయోధనునికి నివేదించుట, రారాజు రాజ్య వైభవం, దుర్యోధనుని మంత్రాంగం, దక్షిణ గోగ్రహణం, విరాటుని యుద్ధ సన్నాహాలు.
ఈ శ్రవణ భాగంలోని ముఖ్యాంశాలు: విరాటునికి పాండవుల సహాయం, యుద్ధారంభం, నారద వృత్తాంతం, సుశర్మ విరాటుని బందీగా పట్టుకొనుట, భీముని వీర విహారం, భీమసేనుడు సుశర్మను బందీగా పట్టుకొనుట, రణ పరిణామం - రసచర్చ, ఉత్తమ పాఠకుని లక్షణం, రసదేవతాదికం, యుద్ధానంతర రణభూమి వర్ణన.
ఈ శ్రవణ భాగంలోని ముఖ్యాంశాలు: ఉత్తర గోగ్రహణము, ఉత్తరుని ప్రగల్భాలు, అర్జునుడు ఉత్తరునికి సారథిగా ఇయ్యకొనుట, కౌరవసేనను చూసిన ఉత్తరుని బెదురుపాటు , అర్జునుని గుర్తించిన ద్రోణుని శిష్యవాత్సల్యం, కర్ణుని అధిక్షేపణ, అర్జునుడు గాండీవాన్ని గ్రహించుట, ఉత్తరునకు తమను ఎఱింగించుట
ఈ శ్రవణ భాగంలోని ముఖ్యాంశాలు: అర్జునుని దశనామాల వివరణ, తిరుపతి వేంకట కవుల అవధాన చమత్కారాలు, అర్జునుని విజయాలు, శబ్ద సౌందర్యం, కావ్య గుణాల ప్రస్తావన, ఊర్వశి శాప వృత్తాంతం, కౌరవులకు దుశ్శకునాలు పొడసూపుట.
ఈ శ్రవణ భాగంలోని ముఖ్యాంశాలు: దుర్యోధనుని అహంకారం, దుర్యోధనుడు ద్రోణుని అధిక్షేపించుట, అశ్వత్థామ ప్రతిస్పందన, కర్ణుని బీరాలు, కృపుని సమయోచిత భాషణం, కర్ణుని వాచాలత, భీష్ముని సాంత్వనం
ఈ శ్రవణ భాగంలోని ముఖ్యాంశాలు: ద్రోణుని వ్యూహ రచన, అర్జునుడు ఉత్తరునికి కురువీరులను చూపుట, పార్థుని భక్తి ప్రపత్తులు, అర్జునుడు పశువులను మరల్చుట.
ఈ భాగంలోని ముఖ్యాంశాలు: వేగులు తమకు పాండవులు ఎక్కడా కానరాలేదని సుయోధనునకు విన్నవించుట, రారాజు కొలువు తీరిన విధం, దుర్యోధనుడు కీచకుని మరణవార్తను గూర్చి విని పాండవులు మత్స్యరాజ్యంలో ఉండవచ్చునని ఊహించి ద్విముఖ వ్యూహం పన్నుట, సుశర్మ దక్షిణగోగ్రహణం చేయుట, విరాటుని యుద్ధ సన్నాహం
ఈ భాగంలోని ముఖ్యాంశాలు: అర్జునుడు తప్పించి తక్కిన పాండవులు విరాటునికి సహాయముగా యుద్ధమునకు తరలుట, విరాటుడు-సుశర్మల యుద్ధం, విరాటుడు సుశర్మకు బందీగా చిక్కుట, భీముని విజృంభణ, సుశర్మ ఓటమి, యుద్ధభూమి వర్ణన
ఈ భాగంలోని ముఖ్యాంశాలు: సుయోధనుడు కౌరవ ప్రముఖులను తోడ్కొని ఉత్తరగోగ్రహణము చేయుట, ఉత్తర కుమారుడు బృహన్నల రూపములోనున్న అర్జునుని సారథిగా చేసికొని యుద్ధమునకు తరలుట, అశేష కౌరవ సేనా వాహినిని చూచి ఉత్తరుడు భీతి చెందుట, అర్జునుడు ఉత్తరుని సారథ్యం చేయమని తాను గాండీవ గ్రహణం చేయుట, తమ నిజస్వరూపాలు ఉత్తరునకు వెల్లడించుట.
ఈ భాగంలోని ముఖ్యాంశాలు: అర్జునుని దశనామాల వివరణ, పార్థుని రాకపై, అజ్ఞాతవాసకాలసమాప్తిపై కౌరవసేనలో వాదోపవాదాలు, కావ్యగుణప్రస్తావన.