ప్రవచన పఠనము

కథలను ఇంపుగా చెబితే వినడానికి ఇష్టపడని వారెవరైనా ఉంటారా? పిల్లలు, పెద్దలన్న తేడా లేకుండా మంచి కథకు అందరూ ఊ కొట్టి తీరాల్సిందే! మరి మహాభారతాన్ని మించిన గొప్ప కథ ఈ సృష్టిలో లేదన్నది నిర్వివాదాంశం. ప్రమాణంలో కాని, కథా విశేషంలో కాని, పట్టు సడలకుండా చివరి దాక కథను నడిపించటంలో కాని, పాత్రచిత్రణలో కాని మహాభారత కథకు సాటిరాగల కథ వేరొకటి లేదు. “ఏయది హృద్యంబు, అపూర్వంబేయది, ఎద్దాని వినిన ఎఱుక సమగ్రంబైయుండు, అఘనిబర్హణమేయది” అన్న ప్రశ్నకు సమాధానమే భారతం. అయితే అంత గొప్ప కథను అంతే గొప్పగా చెప్పగలిగే వక్త ఉన్నట్లైతే అది శ్రోతల అదృష్టమేనని చెప్పుకోవాలి! శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ గారు వ్యాస, కవిత్రయ హృదయాలను అర్థం చేసుకుని, కథాసమయ సందర్భోచితంగా ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ, సాహితీ చర్చ చేస్తూ, ఎక్కడా విసుగు పుట్టని విధంగా మహాభారత కథను వ్యాఖ్యాన ప్రసంగాలలో చెప్పుకొస్తున్నారు.

మరి ఈ భారత ప్రవచనాన్నివిన్న తర్వాత, “యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్” - “ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు” అన్న మాట ప్రత్యక్షర సత్యమని మీరూ ఒప్పుకుంటారు.

కొత్త నిక్షేపాలు

Player
>>