Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 209]
Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 210]
Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 210]
Warning (2): Cannot modify header information - headers already sent by (output started at /var/www/html/lib/Cake/Utility/Debugger.php:797) [CORE/Cake/Network/CakeResponse.php, line 458]
Mahabharatam | Mahabharata | Mahabharat | Mahabharata Pravachanam | Kavitraya Bharatam | Nannaya, Tikkana, Errana | Vyasa Bharatam | Telugu Bharatam | Telugu | Download Bharatam | Bharatam | Pandavas | Avadhanam | Samprathi Surendranath | Telugu Books | P V Ramana । మహాభారతం । భారతం । మహాభారత ప్రవచనం । కవిత్రయ భారతం । వ్యాస భారతం । నన్నయ, తిక్కన, ఎఱ్ఱన । తెలుగు భారతం । తెలుగు సాహిత్యం । పాండవులు । అవధానం । సాంప్రతి సురేంద్రనాథ్ | పి.వి.రమణ

10

శ్లో.  యతో హస్త స్తతో దృష్టిః యతో దృష్టిస్తతో మనః            

      యతో మనస్తతో భావః యతో భావ స్తతో రసః           (నందికేశ్వరుడు-అభినయదర్పణం)

   దీనికి సరియైన అనువాదమిది.

   క.   విశ్రుత వాద్యంబులు మం 
         జుశ్రుతి భావ్యగీత సుగతులు సద్భా   
         వాశ్రయములు తజ్జన్యర    
         సాశ్రయములు నైన యభినయంబు లెఱుఁగుదున్     (విరాట.  1-241)

          అభినయానికి చెప్పిన నాలుగు లక్షణాల్లో నటించే నటుడు గాని, నర్తించే నర్తకుడు, లేదా నర్తకి గాని ‘వయోఽనురూపః ప్రథమస్తు వేషో’ (భరతముని-నాట్య శాస్త్రం) వయసు అంటే ఎవరి వయసుకు తగినట్లు? నర్తించే నర్తకునిదా? లేక ఆ నర్తకుడు అభినయించే పాత్ర వయసా? పెద్దచిక్కే వచ్చింది. అయితే శరీరానుకూలమై వయసుకు తగిన ఆహార్యం ఉండాలి అన్నది ఉచితం.  ‘వేషానురూపేణ గతి ప్రచారః’ - ఆ పాత్ర ఏ విధంగా సంచరించాలో దాన్ని అనుసరించినట్టుగానే గతిప్రచారం, పాదాభినయం, హస్తాభినయం ఉండాలి. ‘గతిప్రచారానుగతం చ పాఠ్యం’ - ఆ సంచారానికి తగిన భాష, గీతం, సంభాషణా చాతుర్యం చూపాలి. ‘పాఠ్యాను రూపః అభినయః చకార’ - ఆ భాషనూ, గీతాన్నీ, సంభాషణనూ సంపూర్ణంగా తెలుసుకుని, విశ్లేషించి, విమర్శించి ఆ భావాన్ని అభినయించాలి. ఇంతగా అభినయించాలంటే ఒక్కో ప్రదర్శన వెనుక ఎంతో పరిశ్రమ ఉండాలి? మనం చూస్తూ ఉంటాం. పదిహేను నిమిషాల్లో ఒక నాట్యం అయిపోతుంది. కేలూచరణ్ మహాపాత్రలాంటి వారైతే, - డెబ్భై ఏళ్ళ వయసు, బట్టతల, పంచె కట్టుకుని ‘సంచరదధర  సుధామధురధ్వని’(జయదేవుడు–అష్టపది) అని అభినయం చేస్తుంటే మనకు ఆయన కనిపించడు. రసదృష్టి కలిగిన ప్రేక్షకుడికి ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంటుంది.

          అందుకనే ప్రేక్షకులకి ఒక విధమైన అర్హత, సహృదయత్వం ఉండాలి అంటారు.  ఇక్కడ సహృదయత అంటే కేవలం మంచివాడు అని మాత్రమే కాదు. కవి ఏ భావంతో రచించాడో ఆ భావంతో అతని హృదయానికి దగ్గరగా వెళ్ళి అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాడు. రసాస్వాదన చేయగలగటం సహృదయత. ఇలా అభినయాన్నిగురించి చెప్పిన తరువాత నాట్యశాస్త్రక్రమ ప్రకారంగా విస్తరిల్లిన శాస్త్రంలో, ఒక్కొక్క కావ్యం ఒక్కొక్క మాధుర్యవంతమైన దీపకళికలాగా వెలిగింది ఆ సాహిత్య వినీలాకాశంలో.

          ‘అమరుకావ్యం’ అనే గ్రంథం శంకరాచార్యులు వ్రాసినట్టిదిగా ప్రతీతి. అందులో ‘జ్యాకృష్టి బద్ధ కటకాముఖ పాణి పృష్ఠ ప్రేంఖన్నఖాంశుచయ సంవళితో మృఢాన్యాః’ - అమ్మవారు యుద్ధం చేస్తూ అసురుడిని సంహరించడానికి విల్లు తీసుకున్నది. వింటికి బాణం సంధించింది. ఆ బాణం పట్టుకున్న హస్తముద్రను ‘కటకాముఖం’ అంటారు. నాట్యవిలాసంతో కూడిన ఆ హస్తముద్రతో ‘జ్యా’ - ఆ వింటి నారిని పట్టుకుని లాగుతూ, చెవివరకూ చేతిని సాచింది. ‘జాకృష్టి బద్ధ కటకాముఖ పాణి పృష్ఠ ప్రేంఖ న్నఖాంశుచయ’ - చెవివరకు సాగిన కటకాముద్రతో ఉన్న ఆ హస్తం. ఆ ఎర్రని గోళ్ళ కాంతులతో, కను కొలకులకాంతులు ‘సంవళితో’ - కలిసిపోయినాయి. ‘మృడాన్యాః’ – ఆమె, మృడాని - ప్రళయ భయంకర రూపం. కానీ స్త్రీ సహజమైన సౌందర్యరేఖ ఆమె ముఖంలో ఉంది కనుక ‘మృడాన్యాః’. కళ్లలో ఉండే  కడకంటికాంతులు ఆ గోటి ఎర్రని కాంతులతో కూడి ప్రతిఫలిస్తున్నాయి. ‘జ్యా కృష్టి బద్ధ కటకాముఖ పాణి పృష్ఠ ప్రేంఖ న్నఖాంశుచయ’ ఆ కనుచూపులు నర్తిస్తున్నాయి. ఆ కడకంటి చూపులేం చేయాలి. ‘మాం పాతు మంజరితకర్ణపూరలోభ భ్రమద్భ్రమరవిభ్రమభృత్కటాక్షాః’ ఆమె కటాక్షములు, ఆ కొనగంటి చూపులు తుమ్మెదలేమో అన్నట్లుగా కర్ణాభరణాలుగా ధరించిన కలువపూలను అందగిస్తున్నాయి. ఆ చూపులు - కటాక్షాలు మమ్మల్ని రక్షించు గాక! అని అర్థం. దీనిని ప్రార్ధనాశ్లోకంగా ‘అమరుకావ్యం’ రచించారు. అమరుకావ్యం పరిమాణంలో చిన్నదైనా ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రసగుళికగా ఆలంకారికులందరూ భావించారు. ఆరితేరిన చిత్రకారుడు ఒక్కొక్క శ్లోకానికి ఒక్క రమణీయ చిత్రం వేయగలిగేలా రచన సాగుతుంది. 

Player
>>