Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 209]
Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 210]
Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 210]
Warning (2): Cannot modify header information - headers already sent by (output started at /var/www/html/lib/Cake/Utility/Debugger.php:797) [CORE/Cake/Network/CakeResponse.php, line 458]
Mahabharatam | Mahabharata | Mahabharat | Mahabharata Pravachanam | Kavitraya Bharatam | Nannaya, Tikkana, Errana | Vyasa Bharatam | Telugu Bharatam | Telugu | Download Bharatam | Bharatam | Pandavas | Avadhanam | Samprathi Surendranath | Telugu Books | P V Ramana । మహాభారతం । భారతం । మహాభారత ప్రవచనం । కవిత్రయ భారతం । వ్యాస భారతం । నన్నయ, తిక్కన, ఎఱ్ఱన । తెలుగు భారతం । తెలుగు సాహిత్యం । పాండవులు । అవధానం । సాంప్రతి సురేంద్రనాథ్ | పి.వి.రమణ

11

అభినయానికి సంబంధించి ఒక అద్భుతమైన శ్లోకం ఉంది ఈ కావ్యంలో. అసలు ఇది చెప్పుకోవడం ఎందుకంటే, భారతం మనకు విశిష్టమైన ప్రాతిపదికను ఏర్పరచింది. సాధారణంగా పాండవులు అరణ్యవాసం చేశారు తరువాత విరాటనగరం వెళ్ళారు, అజ్ఞాతవాసం చేశారు ఇలా మనం భారతంలో చదువుకుంటాం. కానీ ‘ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, అధ్యాత్మవిదులు, వేదాంత మనియు, కవివృషభులు మహాకావ్య మనియు’ అని సూచించారు. కాబట్టి ఆ సంప్రదాయం మేరకు అవకాశమున్నంత, అందినంత మేరకు విషయాన్ని అంతటినీ సందర్భ ప్రకారం సమన్వయ పరచుకుని ఒక శాస్త్రదృష్టితో చూసుకుంటున్నాం కనుక అభినయం అంటే కేవలం మనం అనుకునేది బయటికి కనపడే బాహ్యార్థం మాత్రమే కాదు. రససృష్టి సంబంధి అయిన గంభీరమైన అంశం.

   ఒకమ్మాయి ఉంది. ఆమెకో ప్రియుడు ఉన్నాడు. అతను ఈమె మీద అలిగాడా? లేక ఆమే ఇతని మీద అలిగిందా? వీళ్ళ అలుకకు కారణం ఏమిటో తెలీదు కానీ వెళ్ళినవాడు రాలేదు. ఈమె మనసు అతని మీద కోపంతో బాగా రగిలిపోతోంది. ఆరాటం! సమాచారం లేదు. సమాచారసాధనాలుకూడా అందు బాటులో లేవు. వస్తాడా? రాడా? నిన్న, మొన్న, ఈరోజు, రేపు, ఎల్లుండి అనుకుంటూ అని ఎదురు చూస్తోంది.

అవధానంలో సమస్య....

              ‘గణచతుర్థి నాడు ఫణిచతుర్థి’ అని తిరుపతి వెంకటకవులకు ఒక సమస్య ఇచ్చారు. ఇవి రెండూ ఎలా కుదురుతాయి? వినాయక చవితి, నాగుల చవితి  రెండూ ఒకేసారి రావు. దీనికి పూరణ ఎలా చేశారంటే, చాలాకాలం వరకు దేశాంతరగతుడై వచ్చిన భర్త, తన భార్యకు నచ్చచెబుతూ,

ఆ            ఎన్ని దినములాయె నిట నన్ను డించి నీ
               వరిగి యనినఁ బత్ని కనియె భర్త
               నేటి కెన్నఁగఁ బదినెల లాయెగా! నేఁడు
               గణ చతుర్థి; నాఁడు ఫణిచతుర్థి   (తిరుపతి వెంకట కవులు -  శతావధానసారము)

         ఈ రోజు వచ్చాను కదా ‘నేడు గణచతుర్థి’. నేను ఊరికెళ్ళి ఎంత కాలం గడిచింది? ‘నాడు ఫణిచతుర్థి’.  సరే. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి వాకిట్లో ఎదురు చూస్తూ కూర్చున్నది. కొంచెం కోపంతో, అసహనంతో. ఇంతలో దూరంగా ఎవరో వస్తున్నారు. ‘దూరాత్ ఉత్సుకం’ దూరంగా ఒక రేఖ కనపడింది, ఎవరో వస్తున్నారని ఉత్సుకతతో చూసింది. దీన్ని నిక్షేపించిన విధానం, ఈ అత్యద్భుతమైన కావ్యకళా కుశలత్వం మనలను సమ్మోహపరుస్తుంది. ‘ఆగతే వివళితం’ దగ్గరగా వచ్చేసరికి వీడా? అని ముందు ఉత్సుకత. తరువాత దగ్గరకు వచ్చేటప్పటికి వీడేనా? అనే చులకన. ‘సంభాషణి స్ఫారితం’ అతను దగ్గరకి వచ్చి బాగున్నావా? అంటూ పలకరింపు మొదలుపెట్టగానే, కళ్ళని మరింత విశాలం చేసింది. ‘సంశ్లిష్ట్యత్యరుణం’ ‘అయ్యో! ఇలా ఉన్నావే!’ అంటూ భుజం మీద చేయి వేసి దగ్గరకి తీసుకున్నాడు. ఆమె ముఖం ఎర్రగా అయిపోయింది ‘సంశ్లిష్ట్యత్యరుణం’ - కోపం కదా! ముఖంతో పాటు కనులు, కళ్ళల్లోని అభినయం. సర్వేంద్రియాణాం నయనం ప్రధానమంటారు కదా అలా ఆ కళ్ళలో ఆ అభినయ విశేషాన్ని ఎలా చూపిస్తుందో!

 శా.          దూరాదుత్సుక మాగతే వివళితం సంభాషణి స్ఫారితం
     
               సంశ్లిష్యత్యరుణం గృహీతవసనే సంకోచిత భ్రూలతం
      
              మాలిన్యాశ్చరణౌ నతివ్యతికరే బాష్పాంబుపూర్ణం క్షణాత్
  
              చక్షుర్జాత మహో ప్రపంచచతురం జాతాగసి శ్రేయసి       (అమరు కావ్యం)

ఒక్కసారిగా వెనుతిరిగిపోతుంటే వెళ్ళిపోతున్నావేమని కొంగు పట్టుకున్నాడు. తిరిగి చూసింది. ‘సంకోచిత భ్రూలతం’ - ఆ కనుబొమలు ముడిపడ్డాయి. ఇంక ఇలా కాదనుకుని చిట్టచివరి అస్త్రం ప్రయోగించాడు, శ్రీకృష్ణుల వారు ఉపయోగించి, ఉపదేశించారు కదా! ఆ ఉపదేశసారాన్ని జీర్ణింపజేసుకున్నాడు కనుక ‘మాలిన్యాశ్చరణౌ నతి వ్యతికరే’ - ఇంక వేరే దారి లేదని ఒక్కసారి పాదాలపై పడేసరికి ఇంత బెట్టు చూపించినది కాస్తా ఒక్కసారి కరిగిపోయి ‘బాష్పాంబుపూర్ణం క్షణాత్’ - కళ్లలోంచి జలజలా నీళ్ళు రాలాయి. కళ్ళల్లో ఎన్ని భావాలు పలికించవచ్చు. ‘చక్షుర్జాత మహో!’ - ఇవన్నీ కళ్ళల్లో జరిగాయి. అభినయవిశేషాలు భావించి ప్రదర్శించగల వాళ్ళు ఒక గంటసేపు అభినయించవచ్చు. ‘చక్షుర్జాత మహో ప్రపంచచతురం జాతాగసి శ్రేయసి’ - ఈ ప్రపంచంలో ఉన్న చాతుర్య, అభినయవిశేష భావాలన్నీ ఆ కళ్లలో ఉన్నాయి. 

Player
>>