Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 209]
Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 210]
Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 210]
Warning (2): Cannot modify header information - headers already sent by (output started at /var/www/html/lib/Cake/Utility/Debugger.php:797) [CORE/Cake/Network/CakeResponse.php, line 458]
Mahabharatam | Mahabharata | Mahabharat | Mahabharata Pravachanam | Kavitraya Bharatam | Nannaya, Tikkana, Errana | Vyasa Bharatam | Telugu Bharatam | Telugu | Download Bharatam | Bharatam | Pandavas | Avadhanam | Samprathi Surendranath | Telugu Books | P V Ramana । మహాభారతం । భారతం । మహాభారత ప్రవచనం । కవిత్రయ భారతం । వ్యాస భారతం । నన్నయ, తిక్కన, ఎఱ్ఱన । తెలుగు భారతం । తెలుగు సాహిత్యం । పాండవులు । అవధానం । సాంప్రతి సురేంద్రనాథ్ | పి.వి.రమణ

14

            మరి ఉత్తర సామాన్యురాలు కాదు కదా, ఆమె అర్జునుడంతటి వాని వద్దకు వచ్చి నాట్యం నేర్చుకోవాలి అంటే నాట్యకారిణి ఏ విధంగా ఉండాలో అటువంటి అవయవ ధర్మాలను కలిగినది. నాట్యకారుడు, నాట్య కారిణులకు ఉండవలసిన శరీరధర్మాలు, లక్షణాలను నందికేశ్వరుడు అభినయదర్పణంలో చెప్పాడు. ‘తన్వీ రూపవతీ శ్యామా పీనోన్నత పయోధరా ప్రగల్భా సరసా కాంతా కుశలా గ్రహమోక్షయోః’(నందికేశుడు - అభినయదర్పణము)– ఆమెకు వుండ వలసిన లక్షణాలు. ‘విశాలలోచనా’ - విశాలములైన నేత్రాలు ‘గీత వాద్యతాళానువర్తినీ’ – గీత, వాద్య, తాళాలకు అనుగుణంగా నర్తించగలిగి ఉండాలి. ‘నాతి స్థూలా’ - మరీ లావు ఉండకూడదు. ‘నాతి కృశా నాత్యుచ్చా’ - మరీ పొడుగు ఉండకూడదు, ‘నాతి వామనా’ – మరీ పొట్టి కాకూడదు, ‘ఏవం విధగుణోపేతా నర్తకీ సముదీపితా’ - అని ఆయన ఉపదేశించిన లక్షణాలకు చిత్రం గీస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది ఉత్తర. ‘చరణములును నడుము చన్నులు కన్నులు జవ్వనంబు చెన్ను నివ్వటిల్లు చునికి తెలుపుచుండ’ - ప్రాయం వచ్చింది ‘ఉత్తర చనుదెంచె నలరువిరుతు పువ్వు టమ్మువోలె’ - ఈ విధంగా ఒక స్త్రీని వర్ణించడం సముచితమా? తిక్కనగారు ముందే చెప్పారు కదా! విరాటపర్వం ‘హృదయాహ్లాది చతుర్ధ మూర్జిత కథోపేతంబు నానారసాభ్యుదయోల్లాసి’.

వర్ణన ఔచిత్యం - సాహిత్య వివేచన...

            మహాభారతం యావత్తూ వెదికినా కూడా భారతానికి సంబంధించిన ప్రధానకథలో వచ్చిన ఉపాఖ్యానాలలో శృంగారానికి అక్కడక్కడ సందర్భం ఉంటుంది కాని, శృంగార రసమే ప్రధానంగా గలిగిన పర్వం విరాటపర్వం తప్ప వేరొకటి లేదు. రసాలన్నిటిలోకి మకుటాయమానమైనది శృంగార రసం. అందుకే ఆ రసానికి అంత ప్రాధాన్యం. నవరసాలనూ పోషించలేక అపహాస్యం పాలయ్యేది, ఏవగింపు కలిగించేది, అతి కష్టతరమైనది శృంగారం ఒకటి, హాస్యం ఒకటి. ఒక మోతాదు ఎక్కువైతే వెకిలిచేష్ట అవుతుంది. ఒక మోతాదు తక్కువైతే రసావిష్కరణ జరగదు. కాబట్టి సరిగ్గా ఆ సందర్భానికి తగిన విధంగా సమపాళ్ళలో పద ప్రయోగం చేయాలి.

          ఈ వర్ణన ఇలా చేసుకోవడం ఎందుకు? ఉచితానుచితాలు ఏమిటి? అని విచారిస్తే, ఈయనెవరు? ఒక కవి, రాస్తున్నది కావ్యం, వర్ణనాపూర్వకమైనదే కావ్యం. ఒక విషయాన్ని చెప్పటంలో నైపుణ్యమే కవికి ఉండే ధర్మం. మరి ఒక స్త్రీని వర్ణించే సమయంలో స్త్రీ భౌతిక స్వరూప విశేష స్వభావాలను వర్ణించాల్సి వస్తుంది. అలాగే ఒక మల్లెపూల చెట్టు లక్షణాలను వర్ణించ వలసి వచ్చినప్పుడు దానినే వర్ణించాలి కాని కాకరకాయని తీసుకుని వర్ణించరాదు కదా! ఒక వస్తువును వర్ణిస్తున్నప్పుడు వస్తువుకున్న భౌతికస్వరూపాన్ని యదాతథంగా వర్ణించాలి కానీ వేరేలా కాదు. మనం భౌతికంగా బయటకి చెప్పము కానీ ఆంతరంగికంగా ఒక అంతర్దృష్టితో అంతర్ముఖుల మైనామన్నమాట. మనోవైకల్యం లేకుండా ఆ మహాకవులు నిస్సందేహంగా చెప్పదలచుకున్నది చెప్పదగినట్లు చెప్పటమే ఒక కళ.

          ఒక్కొక్కకవి ఒక్కొక్క విధంగా చెప్పారు. ఒక కార్తీకపౌర్ణమి నాటి రాత్రి భోజరాజు నిండు పున్నమి చంద్రుణ్ణి చూశాడు. ఆ చంద్రబింబం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది, ఆ పూర్ణ చంద్రుడిని చూస్తుంటే అందులో ఆయనకు నల్లని మచ్చ కనిపించింది. ఆ మచ్చతో కూడిన చంద్రబింబాన్ని కవులు అనేక రకాలుగా వర్ణించారు. భోజుడు దాన్నే చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో కాళిదాసు వచ్చాడు. ‘ఏమయ్యా! సృష్టి ఇంత రమణీయంగా ఉంటుంది కదా! అప్పుడప్పుడు నీ కవిత్వం కన్నా ఇదే బాగుందేమో అనిపిస్తుంది. కానీ ఈ విషయం చూడు. ఈ చంద్రుడిలో ఉన్న మచ్చను ‘అంకం కేఽపి శశంకిరే’ – కొంత మంది ఏదో మచ్చ అని అనుకుంటున్నారు. ‘జలనిధేః పంకం పరం మేనిరే’ - చంద్రుడు క్షీర సముద్రంలో నుంచి పుట్టాడు కదా! సముద్రంలో ఉన్న బురద - పంకం కొంచెం మిగిలిపోయి ఈయన మీద పడింది అని కొంతమంది ఊహిస్తున్నారు. ‘సారంగం కతిచి చ్చ’ ఆ చంద్రుడిలోని మచ్చ జింక ఆకారంలో ఉంటుంది కనుక అది జింక అని మరికొంతమంది ఊహిస్తున్నారు. ‘భూఛ్చాయమైచ్ఛన్ పరే’ - ఆహా! దీనిలో జ్యోతిష్యశాస్త్రం వచ్చింది కదా. ఇంకా కొంతమంది భూమి నీడ ఆ చంద్రునిలో పడింది అని  ఊహిస్తున్నారు. నువ్వు గమనించావా? దీనికి నీవేమంటావో చెప్ప’ మని అడిగాడు. అప్పుడు 

    శా.          అంకం కేఽపి శశంకిరే జలనిధేః పంకం పరం మేనిరే
                  సారంగం కతిచిచ్చ సంజగదిరే భూఛ్చాయమైచ్ఛం పరేఇన్దౌ
                  యద్దళితేంద్ర నీలశకల శ్యామం దరీదృశ్యతే       
                  తత్సాంద్రం నిశిపీతమంధతమసం కుక్షిస్థ మాచక్ష్మహే.     

              ‘కాళిదాసు’ – ‘అవన్నీ బానే ఉన్నాయి కానీ నాకలా అనిపించడం లేదు’ . ‘ఇన్దౌ యద్దళితేంద్ర నీలశకల శ్యామం’ – ఆ చంద్రబింబంలో ఇంద్రనీలమణి ముక్కను కత్తిరించి పెట్టినట్టు ఆ నలుపు ఎంత రమణీయంగా ఉంటుందో! మరి కాళిదాసు కదా! అందుకే కాళిదాసుని ‘ఉపమా కాళిదాసస్య’ అన్నారు. కనుక ‘ఇందౌ యద్దళితేంద్ర నీలశకల శ్యామం దరీదృశ్యతే’ ఏదైతే కనబడుతుందో అది ‘తత్సాంద్రం’- నేను అనుకుంటున్నాను.  ‘ఆచక్ష్మహే’ - ఆ చెప్పటంలోని గాంభీర్యగౌరవం చూడండి. మేం అలా అను కోవటం లేదు. మేం భావించిన విధానం వేరు. ఆ మచ్చ ‘తత్సాంద్రం నిశిపీతం అంధతమసం కుక్షిస్థం ఆచక్ష్మహే’ - ఆ చంద్రుడు ఉదయిస్తుంటే రాత్రి కనబడిందట! అరే! ఈ రాత్రి నాకెందుకు కనపడిందని రాత్రినంతా తాగేసాడట! రాత్రి నల్లగా ఉంటుంది కదా! అది ఆయన శరీరంలో కలసిపోయి కనబడింది. ‘అదీ నేను భావించిన తీరు.’ చంద్రుడు వస్తే రాత్రి ఎక్కడుంటుంది? ఉండదు. మరి చంద్రుడిలో ఆ నలుపు ఎలా వచ్చిందంటే, ‘ఇందౌ యద్దళితేంద్ర నీలశకల శ్యామం దరీదృశ్యతే తత్సాంద్రం నిశి పీతం’ - రాత్రినంతా తాగడంతో వచ్చిన ఆ నలుపుదనము ఆ రాత్రిలో ఉన్న ‘అంధతమసం’ - చీకట్లు కమ్మే నలుపుదనం ‘కుక్షిస్థం’ – ఆయన పొట్టలో ఉండిపోయింది. అదయ్యా ఆ నలుపు! అదీ కాళిదాసు.

Player
>>