Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 209]
Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 210]
Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 210]
Warning (2): Cannot modify header information - headers already sent by (output started at /var/www/html/lib/Cake/Utility/Debugger.php:797) [CORE/Cake/Network/CakeResponse.php, line 458]
Mahabharatam | Mahabharata | Mahabharat | Mahabharata Pravachanam | Kavitraya Bharatam | Nannaya, Tikkana, Errana | Vyasa Bharatam | Telugu Bharatam | Telugu | Download Bharatam | Bharatam | Pandavas | Avadhanam | Samprathi Surendranath | Telugu Books | P V Ramana । మహాభారతం । భారతం । మహాభారత ప్రవచనం । కవిత్రయ భారతం । వ్యాస భారతం । నన్నయ, తిక్కన, ఎఱ్ఱన । తెలుగు భారతం । తెలుగు సాహిత్యం । పాండవులు । అవధానం । సాంప్రతి సురేంద్రనాథ్ | పి.వి.రమణ

18

క.         శ్రీమ దపాంగాలోకన,
           ధామసకృత్సంగ రూఢతాదృశ విభవో
           ర్దామాశ్రితలోకాలో,
            కామయ నిర్వరణ నిపుణ హరిహరనాథా!                      (విరాట.  2-1)

            తిక్కనగారి సంస్కృతభాషాభినివేశం, పాండిత్యం చూడాలంటే ఆశ్వాసాది, ఆశ్వాసాంత పద్యాలలో చూడాలి, తెలుగులో ఎన్ని చిక్కులు పెడతాడో అక్కడ అలాగే వ్రాస్తాడు.

             పాండవులు విరాటుని కొలువులో వర్తిల్లిన విధానమెటువంటిదని జనమేజయుడు అడుగగా ‘వైశంపాయనుడు జనమేజయునితో ఇట్లనియె’. ‘అట్టియెడ ధర్మసూనుండు సభాజనంబులఉల్లంబులు రంజిల్ల రాజునకు వినోదంబులు వివిధోదాత్తప్రకారంబులు సలుపుచు’ - ధర్మరాజు రాజుకు తగినట్లు’ ‘ఒక్కొక్కమాటు మధుర ప్రసంగంబులాడుచున్ నెత్తంబున గెలిచిన విత్తంబులు తమ్ముల కొసంగుచుండు’-ఏదో క్రీడగా ఆడుతున్న జూదంలో ఆరాజు ఏదైనా ఇస్తే దాన్ని వద్దనకుండా తీసుకుని తమ్ముళ్ళకి ఇస్తుంటాడు. ఈ రోజు వచ్చిన కానుకలు ఇవి అని పంచుకుంటున్నారు.

           వాయునందనుండు వంటకు మిగిలిన ‘మాంసంబు లమ్ము నెపమ్మున నిచ్చలు సహోదరులకు నిచ్చుచుండు’ - ఇక్కడ ఒక ఇబ్బంది కలుగుతుంది. భీముడిలాంటి వాడు మాంసమ్ము లమ్ము నెపంబున’ - నెపము అంటే కారణం. ఏదో కారణం పెట్టుకుని వంటలను పంచి ఇవ్వవలసినది, ఇక్కడ ‘నెపము’ అంటే ఈ నాటిఅర్థంలో ‘సాకు’ అని అర్థం చేసుకోకూడదు. వంటశాలకు అధ్యక్షుడు ఇతడే కాబట్టి ప్రభువులకు ఉపయోగించబడిన తరువాత ఉన్న ఆహారపదార్థాలను ఎవరికి ఏది ఇవ్వాలి నిర్ణయించేది ఆయనే కనుక, ఆ ఆధికారికస్థితిలో ఉన్న కారణంగా మిగిలిన రుచికరమైన పదార్ధాలను తమ్ముళ్లకి ఇస్తున్నాడు.

             ‘వివ్వచ్చుండు సంగీత ప్రసంగంబున మెచ్చువడసిన కనకాంబరాదులు సోదరులకుం జేర్చుచుండు’ - తన నాట్యశిక్షణాసమయం లో బహూకరించిన కానుకలను సోదరులకు ఇస్తున్నాడు. ‘సహదేవుండు గోవులన్ జూచి సంతసిల్లిన సమయంబున సముపార్జితంబులగు పదార్ధంబులు’– ఇలా ఒకరికొకరు ఆశ్వాసనం చేసుకుంటున్నారు, ‘నాకెక్కడా ప్రమాదం లేదు, అందరికీ సంతోషంగానే ఉన్నది. నేను పెట్టగలిగే అధికారంలో ఉన్నాను. నా వాళ్ళందరూ నా చుట్టుప్రక్కల సంతోషంగానే ఉన్నారు’ అనే తృప్తితో ఉన్నారు.

తే.         ఇట్లు దమతమ వర్తిల్లు నెడల సకల       
             జనములకు హృదయానురంజన మొనర్చి         
             తాల్మి , పుయిలోట, యడఁకువ, తగవు మెలపు, 
 
              నెఱి తెఱంగు వాటింపంగ నేర్పు గలిగి’                   (విరాట.  2-3)

           ‘తాల్మి పుయిలు ఓట’- ఓర్పు పడిపోకుండా, చెడిపోకుండా అని అర్థం. ‘ధైర్యము పుయిలోడకుండా’, ఓడిపోవటము అనేది ఒక స్థాయి. తెలుగు పదాలలో ఉండే చిక్కు ఇది.   సంస్కృతం ధాతుజన్యమైన భాష, ఆ ధాతువుకు అనేకమైన అర్థాలు ఉంటాయి. ఒక్క ధాతువును తీసుకుంటే దాని మీద ఏర్పడే రూపవిశేషాలు చాలా ఉంటాయి. ‘భూ సత్తాయామ్’ అని ఒక ధాతువు. దానికి ‘సత్తాయామ్’ ‘ఉన్నది’ అని అర్థం.  సంస్కృత వ్యాకరణంలో మొట్టమొదట నేను, మనమిద్దరము, అందరు. ఏకవచనం, ద్వివచనం, బహువచనంగా చెప్పుకుంటాము. వీటిల్లో ‘భవతి’ - అతడు ఉన్నాడు, ‘భవతః’– వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ‘భవన్తి’- అందరూ ఉన్నారు. ఒక్క ‘భూ’ అనే ధాతువుమీద ఏకవచనం, ద్వివచనం, బహువచనం మూడు రూపాలు ఏర్పడినాయి. దీనిని మనం ఇంకా విస్తరిస్తూపోతే, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, భూత కాలం. భూతకాలమంటే వెంటనే జరిగిన భూతకాలం, చాలాకాలంక్రితం జరిగినది ఇలా ఒక్కొక్క దానికి క్రియా పదాలని కూడా చెప్తే నిష్పన్నమయ్యే ధాతురూపాలు అసంఖ్యాకం ఉంటాయి. తెలుగులో ఆ చిక్కులేదు, అలాంటి పద్ధతి తెలుగులో కనిపించదు. కొన్ని పదాలు ఎలా వచ్చాయో తెలియదు, లోటా అని ఉంది. చెంబు అని ఉంది. అవి ఎక్కడ్నుంచి వచ్చాయో తెలియదు. ఈ పదాలమీద బూదరాజు రాధాకృష్ణగారు, అంతకుముందే తిరుమల రామచంద్రగారు చాలా పరిశోధన చేశారు. ‘నుడి- నానుడి’ అనే గ్రంథంలో ఈ పదాలు, అర్ధాలు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ ‘పుయిలోట’ అనేది కూడా అలా వచ్చిన పదమే కాని, దానికి అర్ధము ఇదీ అని విశ్లేషించి చెప్పడానికి లేదు. తిక్కన వాడిన పదాలు మళ్ళీ చాలామంది కవులు కూడా వాడలేకపోయారు.ఆ నేర్పరితనం వాళ్లలో లేకపోయింది. పాండవాదులు ఈ విధంగా విరాటమహారాజు కొలువులో కాలం గడుపుతూ ఉన్నారు. 

 

Player
>>