Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 209]
Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 210]
Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 210]
Warning (2): Cannot modify header information - headers already sent by (output started at /var/www/html/lib/Cake/Utility/Debugger.php:797) [CORE/Cake/Network/CakeResponse.php, line 458]
Mahabharatam | Mahabharata | Mahabharat | Mahabharata Pravachanam | Kavitraya Bharatam | Nannaya, Tikkana, Errana | Vyasa Bharatam | Telugu Bharatam | Telugu | Download Bharatam | Bharatam | Pandavas | Avadhanam | Samprathi Surendranath | Telugu Books | P V Ramana । మహాభారతం । భారతం । మహాభారత ప్రవచనం । కవిత్రయ భారతం । వ్యాస భారతం । నన్నయ, తిక్కన, ఎఱ్ఱన । తెలుగు భారతం । తెలుగు సాహిత్యం । పాండవులు । అవధానం । సాంప్రతి సురేంద్రనాథ్ | పి.వి.రమణ

3

తనకుతాను పరిచయం చేసుకున్నాడు. అయ్యా!నేనుఒక మహానసాగ్రేసర చక్రవర్తిని. నాతోసరిగా వంటచేయగలిగిన పాకశాస్త్రనైపుణ్యం కలిగినవాడు లేడు. పూర్వము ఎప్పుడో నలుడు అని ఉండేవాడు. నలచక్రవర్తి తరువాత భీముడే. కాబట్టే నలభీమపాకమయ్యింది. నేను ‘నాలవజాతివాడ’ ఇక్కడ మనకు మళ్ళీసందేహము. నాలవజాతివాడ. నేను నాల్గవజాతి అనిఅంటే, బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రుల్లో నేనుశూద్రజాతివాడిని అనిసుక్షత్రియవంశ సంజాతుడైన భీముడు, తనను తాను శూద్రునిగా వర్ణించుకోవడము ఎట్లా? కాని తిక్కనగారి చమత్కారమైన వాణిఎట్లాంటిది అంటే, ‘దేవా!నాలవజాతివాడ’నాలవజాతివాడు. నాల్గవజాతి ఎవరు?

అంతకు ముందు ధర్మరాజు చేసిన వేదాంతస్ఫోరకమైనమాటల్లో అర్థం చాలాఉంది. ధర్మరాజు వస్తూనే, ఎవరి నిజస్వరూపము ఇటువంటిది అనిపలకడానికి ఎవరయ్యా! ఇదిపాంచభౌతికము, పంచభూతాత్మకమైనదేహముకదా!కాబట్టి ఈపాంచభౌతికమైన దేహము మళ్ళీ పంచభూతాలలో కలసిపోయినప్పుడు మిగిలేస్వరూపము ఏమి ఉంటుంది?ఆ పాంచభౌతిక తత్వాన్ని అనుసరించుకొని భీముడు సమాధానము చెప్తున్నాడు. ‘నాలవజాతివాడ’- పాంచభౌతికతత్వాలను తీసుకుంటే పృథివి, ఆపస్, తేజస్సు, వాయువు, ఆకాశము.ఇవి పంచభూతాలు. ఈపంచభూతాలక్రమముఇట్లాఉంటే,ఈ క్రమంలో వాయువు నాలుగవది. ఆవాయువుజాతివాడను. ఆవాయుపుత్రుడినిఅనిపరిచయంచేసుకున్నాడు. భీముడుమహావేదాంతి. ఉద్ధతమైన స్వభావము కలిగినవ్యక్తే కాని ఆంతరంగికంగా అత్యద్భుతమైన ఆధ్యాత్మిక భావన కలిగిన మహోన్నతతత్వ జ్ఞానపరుడు. ఆ విషయము మనము అరణ్య పర్వములో ధర్మరాజుతో జరిగిన సంవాదములో తెలుస్తుంది. అప్పుడప్పుడు తళుక్కుమని మెరిసేరేఖ లాగా భీముడి వేదాంతవిజ్ఞానధోరణి ప్రస్ఫుటమవుతుంది. ఆఅర్థాన్ని ఉద్దేశించుకొని ‘దేవా! నాలవజాతివాడ’నేనువాయుపుత్రుడినయ్యా! ‘పేరువలలుండు గూడుం జీరయు నిడిసాకతంబు సేసినఁ జాలు’- అయ్యా!నేను జీవనభృతి కోసమై నీదగ్గరికి వచ్చాను.నేనువంటలవాణ్ణి, నన్ను నువ్వు నియోగించుకుంటే నాకు విశేషంగా ధనాన్ని ఇవ్వవలసిన అవసరములేదు. ‘కూడుంచీరయు’ ఏదోకూడు గుడ్డ ఇచ్చి ‘సాకతంబు చేసిన చాలు’నన్నుసాకితే చాలు అంతే. ‘కోరిన వంటకములు నానేరిమిఁదగనెఱపి కొలుతు నిశ్చల భక్తిన్’రకరకాలైన పాకములు వండుతాను, నాపాకశాస్త్ర ప్రావీణ్యము చూపించి, రకరకములైన భోజనములతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను. ‘అనవుడు మత్స్య భూ రమణుఁడు’ ‘ఎట్లు శూద్రుఁగా నినుఁదలఁపంగవచ్చు’- అయ్యా! నీఆకారము, తేజస్సు చూస్తే, ‘ధరణీ భరణ క్షమమూర్తి వీవు’- ఏదో చక్రవర్తి లక్షణాలు నీలో స్పష్టముగా కనపడుతుంటే శూద్రునిగా ఎలా అనుకుంటాను? సరే నీవు వచ్చావు కాబట్టి చాలా సంతోషం, నీలాంటివాడు మాకు చాలా అవసరము. మా వంటశాలలోమహానసాధ్యక్షుడిగా ఉండు అన్నాడు.

సైరంధ్రిగా ద్రౌపది ప్రవేశం...

తరువాతద్రౌపదిప్రవేశించింది. సంస్కృత భారత మర్యాదను అనుసరించుకొని ఈస్పర్శ చేస్తున్నాము కాబట్టి, అర్జునుడి విషయము విరాటపర్వములో తిక్కనగారు రచించిన దాన్నికొంచెంవిస్మరించి ద్రౌపదివచ్చిన విశేషాన్ని గమనిస్తే, భీముడు కొలువులోనికి వచ్చిచేరిన తరువాత, మధ్యాహ్నసమయము అయ్యింది. ద్రౌపదివస్తోంది. ఎలా?

క.         గారవముననిజదేశా
            చారముమై నల్లియున్నజడయగుకబరీ
            భారంబువిచ్చి తిరముగ
            సైరంధ్రీజాతివేషసముచితభంగిన్                                (విరాట. 1-290)

Player
>>