Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 209]
Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 210]
Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 210]
Warning (2): Cannot modify header information - headers already sent by (output started at /var/www/html/lib/Cake/Utility/Debugger.php:797) [CORE/Cake/Network/CakeResponse.php, line 458]
Mahabharatam | Mahabharata | Mahabharat | Mahabharata Pravachanam | Kavitraya Bharatam | Nannaya, Tikkana, Errana | Vyasa Bharatam | Telugu Bharatam | Telugu | Download Bharatam | Bharatam | Pandavas | Avadhanam | Samprathi Surendranath | Telugu Books | P V Ramana । మహాభారతం । భారతం । మహాభారత ప్రవచనం । కవిత్రయ భారతం । వ్యాస భారతం । నన్నయ, తిక్కన, ఎఱ్ఱన । తెలుగు భారతం । తెలుగు సాహిత్యం । పాండవులు । అవధానం । సాంప్రతి సురేంద్రనాథ్ | పి.వి.రమణ

4

నేను సైరంధ్రీవృత్తిని ఆశ్రయించుకొని,మాలిని అనేపేరుతో సుదేష్ణదగ్గర ఉంటాను అని  ద్రౌపది ధర్మరాజుతో అన్నది. ఆ సుదేష్ణ దగ్గర ‘సైరంధ్రీ పరవేశ్మస్థా స్వవశా శిల్పకారికా, పరగృహస్థా స్వతంత్రా ప్రసాధన దర్పణాది శిల్పకర్త్రీ’ - సైరంధ్రి స్వతంత్రప్రవృత్తి కలిగి సేవాధర్మాన్ని అనుసరించేది. మామూలు సేవలు చేసే స్త్రీ కాదు. ఆమె రాజమాత లకు, రాజపుత్రికలకు, రాజకాంతలకు మాత్రమే కేశపాశాద్యలంకరణ వస్తువిశేషాలను కూర్చే స్త్రీ కాబట్టి ద్రౌపది కూడా తన వేషాన్ని తనసైరంధ్రీవృత్తికి అనుగుణమైన రూపముగా మలచుకుని వచ్చింది. ఎలా? ‘గారవముననిజదేశాచారముమై నల్లియున్నజడయగు కబరీభారంబు విచ్చి’- ఈమె ఈ ప్రదేశం నుంచి వచ్చింది అనే భావము ఎవరికి కలుగకూడదు. విరాట దేశములోఉండే వాళ్ళందరు సహజంగా ఆప్రాంతానికి అనుగుణమైన ‘కబరీభారము’కేశములకట్టుతో ఉన్నారు. ఈమె నిజదేశాచారాన్ని వదిలి, సైరంధ్రీవృత్తికి కావలసిన కేశపాశము, ‘కబరినివిచ్చి’ ఆవిధంగా కట్టుకొనివచ్చింది. ఆకొప్పు ఎలా కట్టుకున్నది? కొంచెంకుడివైపు భారంగా ఉండేలా అమర్చుకుని అటువైపుకు ఒరిగేటట్లు కట్టుకున్నది.

క.         ‘వలపలదిక్కునకించుక
            మలఁగంగాదుఱుమిడి కుఱుమాపుడుఁబుట్టం
            బలవడఁగట్టిజరఠ వ
            ల్కలముననెవ్వీఁగుఁజన్నుఁగవగప్పితగన్’                          (విరాట. 1-291)

కేశపాశములేమో అలా కట్టుకున్నది, ఆమె ధరించిన వస్త్రం కొంచెం మాసి ఉన్నది. నిజమే! అక్కడ నుంచి దప్పికతో దూరం నడిచివచ్చారు కదా! ఆమార్గాయాసంలో దుమ్మువలన వస్త్రములు మాసిపోయి ఉన్నాయి. ఆమలిన వస్త్రంతోతన ఊర్ధ్వభాగాన్ని కప్పుకున్నది.

క.         పరిచారికాత్వరేఖా
            పరిణతిదనమేననచ్చువడభావనకుం
            దిరమైతలకొనునంతః
            కరణముతోఁబురముద్రుపదకన్యకసొచ్చెన్’.          (విరాట. 1-292)

ఆమెఈవిధమైనవేషాలంకరణతోఅత్యద్భుతమైనతేజస్విని, సౌందర్యవతియైనద్రౌపది, దేహకాంతి, గమనప్రకార విశేషాలతో  ప్రస్ఫుట మౌతున్న ఆభిజాత్యసహజమైన ఠీవితో విరాటరాజు రాచవీధిలో వస్తుంటే అందరూచూశారు. ‘పఱమొయిల్గప్పినఁబాడఱి నునుఁగాంతి, గదలినయమృతాంశుకళయుఁ బోలెఁ’అమృతాంశునికళ, చంద్రుడికళా విశేషంలా తళుక్కుమని మెరుస్తోంది. ‘బెను మంచు మీఁదఁబర్వినవికాసముదప్పిచెలువుగుందిన సరోజినివిధమున’ కమలాకరంలోబాగావికసించినపద్మము మంచుపడి ముడుచుకుని పోయివాడి పోయినట్లుగా ఉన్నది. ‘ధూమంబువొదివినదుఱఁగలి మెఱుఁగులునలఁగిమాసిన దీపకళిక పగిది’ పొగకప్పుకున్ననిప్పులాగ ఉన్నది. ఇది మనం గమనించవలసిన విశేషం. దీపకళికలో జ్వలనం ఆరిపోలేదు. ఆమె అంతరంగంలో సమయం ఆసన్నమై తీరబోతున్న ప్రతీకార వాంఛ, రోషాగ్నిజ్వాల ఉన్నాయి. అభిమానం కల స్త్రీ కనుక మనసులో ఉన్నది కనబడనీయకూడదు కాబట్టి ఈవేషంతో ఇలాపొగతో నివురుకప్పిననిప్పులాగ వచ్చింది. ‘ధూళిపైఁబొరసినఁ దొంగలించుట మాని, లావణ్యమెడలి నలతి క భంగి’  దుమ్ము కప్పుకుని ఉంటే లావణ్యంతో ఉన్న ఆకోమలత్వము కొంచెం తగ్గినట్లుగా కనపడుతూ ఉన్నది. ఆమె ‘గంధకారికావేషంబుకతన మూర్తియుజ్జ్వలత్వంబు’ సేవావృత్తిలో  సైరంధ్రి కాబట్టి ఆలంకారిక విషయాలన్నీ తీసుకుని సుదేష్ణాదేవి దగ్గరకు వచ్చింది. ఏమిటీ! అంతఃపుర వీధులలోవస్తున్నఈ స్త్రీ ఎవరు? అని వాళ్ళూ ఆశ్చర్యపోయారు. ‘నీవెవ్వ రేమి పనికై’ పోవుచున్నావు? ఎవరమ్మా! నీవుఅన్నారు. ‘నావుడు  నద్దేవియు’ఆద్రౌపది ఏమన్నది అంటే ‘ఏనుగట్టు వాలుదాన’ నేను అలంకారాలు చేసే సైరంధ్రీజాతి స్త్రీని.  ‘నాకెవ్వరు గడుపుకూడు వెట్టికట్టఁ జీరయిచ్చి సాకతమున నేలుదురు’ అమ్మా! నాజీవన విధానానికి కావలసిన వస్త్రవిశేషము, తిండి ఇచ్చి పోషించగలిగినవారు ఎవరైనా ఉంటే అక్కడ ఉంటాను. దాన్ని వెతుక్కుంటూ వస్తున్నాను. 

Player
>>