Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 209]
Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 210]
Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 210]
Warning (2): Cannot modify header information - headers already sent by (output started at /var/www/html/lib/Cake/Utility/Debugger.php:797) [CORE/Cake/Network/CakeResponse.php, line 458]
Mahabharatam | Mahabharata | Mahabharat | Mahabharata Pravachanam | Kavitraya Bharatam | Nannaya, Tikkana, Errana | Vyasa Bharatam | Telugu Bharatam | Telugu | Download Bharatam | Bharatam | Pandavas | Avadhanam | Samprathi Surendranath | Telugu Books | P V Ramana । మహాభారతం । భారతం । మహాభారత ప్రవచనం । కవిత్రయ భారతం । వ్యాస భారతం । నన్నయ, తిక్కన, ఎఱ్ఱన । తెలుగు భారతం । తెలుగు సాహిత్యం । పాండవులు । అవధానం । సాంప్రతి సురేంద్రనాథ్ | పి.వి.రమణ

6

‘వినునీరూపము చూసి మానృపతి యువ్విళ్ళూరు’. అమ్మా!నాకోభయం అంది. ప్రతి స్త్రీకి ఉన్నభయమే యథాలాపంగా సుదేష్ణ కూడా చెప్పుకుంది. నువ్వేమో ఇంత చక్కటిదానివి, నీరూపం చూసి మారాజు, నాభర్త, ఉవ్విళ్ళూరుతాడు. ‘నేనెమ్మెయింబనిగొందు?’ నిన్ను నేనెక్కడ పెట్టుకుంటానమ్మా? నువ్వేదో గౌరవంగా కనపడితే  వచ్చి తాంబూలమో, వస్త్రాలో ఇచ్చి పంపిద్దామనుకున్నాను కాని నువ్వు ఇక్కడ నాదగ్గర సేవచేస్తానంటే నిన్ను అంతఃపురంలో నేనెలా పెట్టుకుంటాను. మాప్రభువు మనసు చెదిరితే నేనేం చెయ్యగలను? అంది. నీరూపము స్త్రీలనే సమ్మోహనపరిచేవిధంగా ఉంటే మరి మానృపతి ఎలా ఉంటాడు? ‘తల్లీ ఇంతటి రూపవతి అయిన నిన్నునా అంతఃపురంలో పెట్టుకోవాలి అంటే ‘దుర్భరయగు నిను’, భరించడం చాలా కష్టం తల్లీ, దాచిపెట్టలేము. ‘దుర్భరయగునినుఁ గర్కటిగర్భముధరియించినట్లుగైకొని’ ఎండ్రకాయ గర్భం. ఎండ్రకాయగర్భంలోఉంటే ప్రసవసమయంలో దాని కడుపుచిట్లిపోతుంది. కాబట్టి నిన్ను కర్కటిగర్భంలాగ నేను ఎలా దాచిపెడతాను? చాలాకష్టం. మొదటికే మోసంవస్తుంది అన్నది. అంటే ద్రౌపది ‘నీతలంచినట్లకాదు’ ఆ అభిప్రాయం వద్దు. నువ్వు అన్నట్లు కాదు. ‘వినుము! ‘నాదుపతులు వెరవులావునలఘువిక్రమంబుఁ గలుగు గంధర్వులు’ నాభర్తలు గంధర్వులు. అంటేఆ కాలంలో నానాజాతివిశేషాలు ఉన్నాయి. కాబట్టి అంత ఆశ్చర్యకరమైన విషయం కాదు. నిజానికి ఆమె భర్తలందరూ దేవాంశసంభూతులే కదా!ఆవిషయంచెప్పింది. గంధర్వులు అయిదుమంది ఉన్నారు. ‘ఏమఱరునన్నునొక్కమాత్రయైన’ ఒక్కక్షణంకూడా నన్నువిస్మరించి ఉండరు. నాయోగక్షేమాలను వాళ్ళెక్కడ ఉన్నా, వాళ్ళకున్న శక్తిసామర్థ్యాలచేత గమనిస్తూనే ఉంటారు. ‘నీచమతి నన్నునెవ్వఁడు సూచిన’ ఎవడైనా నావైపు నీచమైనదృష్టితో చూస్తే, ‘ఆరాత్రిలోనఁజూతురుదెగన్’, వాళ్ళుఏంచేస్తారంటే, ‘తారు’ వాళ్ళు గంధర్వులైన నాభర్తలు ఎవడైనా నన్ను నీచస్వభావంతో చూశాడా, వాడిని ‘ఆచపలున్’ ఆచపలచిత్తుడ్ని  ‘ఆరాత్రిలోనతెగచూతురు’ పైలోకానికి పంపిస్తారు. ‘హరిహరాదులు గాచిన బలవిక్రమముల ఖర్వములైనన్’ వాడుఎంత బలవంతుడైనాసరే, ఎంత శక్తిమంతుడైనాసరే, అటువంటి వాడికి సాక్షాత్తు హరిహరాదులు  ఎదురైనా, విష్ణువు, శంకరుడాదిగా కలిగినదేవతలు వాడికిరక్షణగా ఉన్నప్పటికీ కూడా వాడిపని  కడతేరుస్తారు. నీకాభయంవద్దు.

క.            ‘బంధుశతంబులుశౌర్యమ
             
  దాంధములైశక్తిసంపదాభీలములై
             
  సింధురసదృశతనున్నను
             
  సంధులసంధులెడలించిచంపుదురతనిన్                        (విరాట. 1-325)

అమ్మా! నువ్వింకా ఏమనుకుంటున్నావో! నాజోలికి ఎవడైనా వచ్చాడా, అమితమైన విక్రమంతో భయంకరమైన పద్ధతిలో ‘సంధులసంధులు ఎడలించి’ ఏకీలుకాకీలు విడదీసి వాళ్ళు వాడిని చంపేస్తారు. నీకా అనుమానం వద్దు. ‘కావునఁ బురుషులునాకడందేఱిచూడనువెఱతురు’, కాబట్టి నావైపు ఎవ్వరూ చూడరు, భయపడతారు అంది. అని,

క.         నాచిత్తముతాదృశులకు
            గోచరమే? యస్మదీయకులజనసంశి
             క్షాచారమహిమయట్టిది
            యే? చెప్పకుతద్విధాతిహీనవచనముల్                (విరాట. 1-327)

నాసమాచారం కూడా నీకు తెలియదు. నేనటువంటి స్త్రీని కాదు. అటువంటి చాంచల్యమైన చిత్తవిభ్రమం నాలోఉండదు. కాబట్టి నాకు నిశ్చింతగా నీవు ఆశ్రయం ఇవ్వవచ్చు’ అన్నది.

Player
>>