Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 209]
Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 210]
Notice (8): Undefined index: Menu [APP/Controller/ListController.php, line 210]
Warning (2): Cannot modify header information - headers already sent by (output started at /var/www/html/lib/Cake/Utility/Debugger.php:797) [CORE/Cake/Network/CakeResponse.php, line 458]
Mahabharatam | Mahabharata | Mahabharat | Mahabharata Pravachanam | Kavitraya Bharatam | Nannaya, Tikkana, Errana | Vyasa Bharatam | Telugu Bharatam | Telugu | Download Bharatam | Bharatam | Pandavas | Avadhanam | Samprathi Surendranath | Telugu Books | P V Ramana । మహాభారతం । భారతం । మహాభారత ప్రవచనం । కవిత్రయ భారతం । వ్యాస భారతం । నన్నయ, తిక్కన, ఎఱ్ఱన । తెలుగు భారతం । తెలుగు సాహిత్యం । పాండవులు । అవధానం । సాంప్రతి సురేంద్రనాథ్ | పి.వి.రమణ

9

ఉ.         ఆఁడుఁదనంబు నిక్కమున కారసి చూచిన లేదు, పుంస్త్వముం

            బోఁడిమి దప్పియున్నది, నపుంసకజన్మ మవశ్య భోగ్య మై 

            వాఁడిమి గల్గు శాపమున వచ్చెఁ బురాకృత కర్మ భావ్య మె  

            వ్వాఁడును నేర్చునే తొలఁగ వైవగ, నోర్వక పోవవచ్చునే     (విరాట.   1-238)

   ‘ఏదో కర్మవశంతో ఈ ఆడతనం వచ్చింది కాబట్టి ఇలాగే జీవితం గడిచిపోవాలి. పురుషాకారం, స్త్రీ ప్రవర్తనతో ఉన్నాను కనుక

తే          ఒండు పనులకు సెలవు లేకునికిఁ జేసి
             యభ్యసించితి శైశవమాదిగాఁగ
             దండలాసక విధమును గుండలియును
             బ్రెక్కణంబు తెఱంగును బేరణంబు                      (విరాట.  1-240)

‘ఒండు పనులకు సెలవు లేకునికిఁ జేసి’ - వేరే ఏ పని చెయ్యడానికి నాకు వీలులేనందువల్ల’ ‘అభ్యసించితి శైశవమాదిగాఁగ, దండలాసక విధమును’ – ‘చిన్నతనం నుంచీ నృత్య కళా విశేషాలను అభ్యసించాను’.

నాట్య సంప్రదాయం -  కొన్ని విశేషాలు...

           నాట్యవిశేషాలలో వ్యాసులవారు చెప్పినవి వేరు. కాలపరిణామంలో విస్తరించుకున్న నాట్యకళా విశేషాలు దేశీయములు, ప్రాంతీయములుగా ఒక్కొక్కచోట ఒక్కొక్కవిధంగా రూపు సంతరించు కున్నాయి. తిక్కన వర్ణించిన, ప్రస్తావించిన నాట్యవిశేషాలు, దండలాసకము, కుండలి, ప్రెక్కణంబు, పేరణి -  భరతముని నాట్యశాస్త్ర సంప్రదాయానుసారంగా భారతదేశంలో వివిధ ప్రాంతాలలో విస్తరిల్లిన నాట్యవిశేషాలన్నీ, - అప్పటికాలంలో తెలుగుదేశంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నవి.

శ్లో.          కుండలీ భోగవత్యాంతు కల్పితా మాందకర్ణినా
              అయోధ్యాయాం కృతాపూర్వం పేరణి ర్వాయుసూనునా
              ఘూర్జరీ ద్వారవాత్యాం తు కల్పితా బాణకన్యయా
              కాళికాయాః కృతే జాతా మతంగేనైవ జక్కిణీ                                          

              ఈ విషయాన్ని మనం చారిత్రాత్మకంగా ఆలోచించి చూస్తే కేవలం ఆంధ్రదేశంలోనే వెయ్యి సంవత్సరాల క్రిందట ఇన్నివిధాలైన నాట్యభేదాలు ఏర్పడినాయి కాని ఇతర ప్రాంతాలలో ఇన్ని భేదాలు ఉన్నట్టు కనిపించదు. అందుకే నాట్యశాస్త్రానికి గాని, నృత్యానికి గాని ఆంధ్రదేశమే ప్రధానం. భరత మని పేరు పెట్టుకున్నా అదంతా ఈ సంప్రదాయంతోనే వచ్చిందని చెప్పవచ్చు. తిక్కన చెప్పిన దండలాసక విధములు - తాళం, కుండలియును, ప్రెక్కణంబు. ప్రెక్కణంబు అంటే ప్రేంఖణము. అదే పేరిణి. వరంగల్‍లోని రామప్పఆలయంలో వేయిస్తంభాలమండపంలో చెక్కబడిన ప్రసిద్ధమైన నాట్యకళావిశేషాలను గ్రహించి నటరాజ రామకృష్ణగారు ఆ వేయి సంవత్సరాల నాటి కళను వెలికితీసుకుని వచ్చి కావలసినంత ప్రాచుర్యం కల్పించి, తన జీవితాన్ని అంతా ఆ నాట్యప్రచారానికే వెచ్చించారు. ఉద్ధతమైన నృత్యం ఆ ‘పేరిణి’. ఒక నాట్యశాస్త్రగ్రంధం ఆ ప్రాంతంలో ఉండేది. కుండలి అంటే మహారాష్ట్ర ప్రాంతం నుంచీ వచ్చిన ‘గోండ్లీ’ అనే నృత్య విశేషం. అలాగే ఇంకొక నృత్య విశేషం తెలుగులోని ఒక అచ్చమైన పదాన్ని తీసుకుని వచ్చింది. ‘పిశాచ వానరాదీనాం’ కొన్ని పిశాచాలు భూతాలు ‘వేష చేష్టానుకారకం’ - పిశాచాలు వానరాలు ఇవన్నీ పిచ్చి పిచ్చి చేష్టలను అనుకరిస్తూ మొహం ఇకిలించి వికారంగా చేయడం ‘వికృతైః ఆనన ఓష్ఠ అక్షి కుక్షి వాక్చరణాదిభిః’ - కళ్ళల్లో, ముఖంలో, శరీరం కదలికలలో అన్నీ వికారాలే గాని, సంస్కారవంతమైన శరీరావయవప్రదర్శనావిక్షేపం ఎక్కడా కనపడదు. ‘వితాళం’- దానికొక తాళం ఉండదు, ‘వికృతం, నృత్తం’ - ఆ గంతులేయడంలో ఒక క్రమము, లయ ఉండవు. ‘హాస్యకృత్ వికటం విదుః’ – దాని కోసం ఎలా అయినా హాస్యం పుట్టించాలి అపహాస్యమైనా ఫరవాలేదు, ‘కైశ్చిత్’ - విద్వాంసులు తెలిసినవాళ్ళు ఏమన్నారంటే ‘వాగడం ఇత్యుక్తం’ – ఈ లక్షణాలన్నీ ఉండేదే వాగడం. ఇది తెలుగు పదం అయిపోయింది. ‘ఇత్యుక్తం హాసకానాం ప్రతిద్ధితః’ - దాన్ని చూస్తే రసావిష్కారం కాదు కాని, నవ్వుకుని ఏదో కాలక్షేపం చేయవచ్చు.

              నృత్యవిశేషాల్లోని సంగతులన్నీ చెప్పాడు, అలాగే తన సంగీతకళాపరిజ్ఞానాన్నిగురించి చెప్తున్నాడు. ‘విశ్రుత వాద్యంబులు, మంజుశ్రుతి సంభావ్య గీతసుగతులు’ వాద్యాల్లోని వైవిధ్యమును నాట్యశాస్త్రంలో విస్తృతంగా చెప్పారు. సుషిరవాద్యములు - మోగేవి, చర్మవాద్యములు - నోటితో వాయించేవి,  తంత్రీ వాద్యములు – తీగలతో మీటేవి. ఇవన్నీ వాయించటంలో తనకు నేర్పు ఉన్నదని చెప్పాడు. ‘మంజుశ్రుతి సంభావ్య గీతసుగతులు’ – ఒక గీతంలోని ప్రధానమైన భావము, దాని వెనుక ఉన్న సంచారిభావములు. అంటే ఒక భావము ఉంటుంది, దానిని అనుసరించుకుని కలిగే భావములు అనేకం ఉంటాయి. నాట్యంలో మంచిపాండిత్యంకల నర్తకి కానీ, నర్తకుడు కానీ కూచిపూడినృత్యం చేస్తుంటే అందులో ఒకే పదం లేదా ఒకటే వాక్యం పదే పదే ఆవృత్తమవుతూ ఉంటుంది. పది పదిహేను మార్లు దానినే పాడుతూ ఉంటారు. అది మామూలుగా వింటే ఇన్నిమార్లు ఎందుకు ఆవృత్తమౌతోంది అనిపిస్తుంది. కానీ ‘ముద్దుగారె యశోద ముంగిట ముత్యము వీడు’ అని పదిసార్లు ఆవృత్తమైనపుడు పది భావాలు అభినయిస్తారు. బాలకృష్ణుని చేష్టలన్నీ ఈ పదిమార్లు ఆవృత్తమైనపుడు అభినయిస్తూ చూపే ఈ భావాలన్నీ సంచారిభావాలు. ఒక భావోద్రేకంలో ఉండే ‘శ్రుతి సంభావ్య గీత సుగతులు’. ఆ గీతంలో ఉన్న సుగతులు ఎన్ని విధాలుగా నర్తించడానికి అవకాశముంటుందో అన్ని విధాలైన నృత్యవిశేషాలను ప్రదర్శింపచేయగలిగిన నృత్యకారుడు అర్జునుడు. ‘సద్భావాశ్రయములు’ - భావాలను ఆశ్రయించుకున్నవి, ‘తజ్జన్య రసాశ్రయములు’- ఆ భావాన్ని ఆశ్రయించుకున్న రసావిష్కారం. ఈ రసమనే మాట ఎక్కడ నుంచి పుట్టింది? 

Player
>>