ఉపక్రమణిక9

‘ఇది ఒక పెద్ద గట్టి మొన’- ఇది ఒక పెద్ద గట్టి సేన చాలా పకడ్బందీగా చేసిన సేన, చూశావా? గట్టి మొన, ‘ఈ మొన ముందట గో గణంబుతో అదియొక అల్పసైన్యము’ మనకు సైన్యము కనబడుతోంది అక్కడ. విస్తారమైన కురు సైన్యము కనబడుతున్నప్పుడు ఇది ఒక పెద్ద గట్టి మొన కానీ ఈ సైన్యాన్ని చూడనక్కరలేదు. అక్కడ అటు చూడు ఏముంది? గోగణంబుతో అది ఒక అల్పసైన్యము. అక్కడేమో ఆవులకు రక్షణగా చిన్న సైన్యాన్ని మాత్రమే పెట్టారు. ఎక్కువ మంది లేరు. ‘అట ఆతల వేరొక కొంత సేన అల్లదె’- అక్కడ చూశావా, దీనికి భిన్నంగా ఇదొక మూక, అదొక మూక అరె ఒక్కసారి ఒక్క సైన్యాన్ని అంతటినీ సమీకరించుకుని రాకుండా కొంత సైన్యాన్ని అక్కడ గోగణాన్ని రక్షిస్తున్న సేన కొంత, చూశావా ఉత్తరా! మనము ఎటువైపు పోవాలి? అంతటిలో ‘వేరొక కొంత సేన అల్లదే ఇటు పంచిపెట్ట చను’- ఈ సేనను ఇలా పంచిపెట్టారు ఇక్కడ ఇక్కడ ఇక్కడ అన్నట్లుగా. ‘వృథాభిమాన దుర్మద బహుభాషి’- రావాలి కదా ఆవేశం? వస్తోందక్కడకి, ‘వృథాభిమాన దుర్మద బహుభాషి యైన కురురాజు, ఎచటన్ చనుచున్నవాడొకొ’- ఎక్కడున్నాడు దుర్యోధనుడు? ఇక్కడున్నాడా? అక్కడున్నాడా? ఈ సందర్భంలో తిక్కనగారు కనపడరు. భారతం రెండు విధాలు. శ్రవ్యం - చదువుతున్నాం, వింటున్నాం. కానీ కళ్ళు మూసుకుని అంతర్నేత్రంతో దర్శిస్తే ఒక మహావిస్తారం అయిన భూమిలో కురు సైన్యాన్ని సాధించడానికి వచ్చిన అర్జునుడు పక్కనున్న ఉత్తరునితో సేనను నిర్జించి తన కార్యాన్ని సాధించుకోవాలి అని ఆలోచిస్తున్న దృశ్యం.

క.            అరయుదముగాని యిమ్మో
 
               హరమునకు డాపలించి యరదముఁ బోని
      
               మ్మురవడి నతనిక యుఱికెద
          
               నరుదుగ నెబ్భంగి నెవ్వ రడ్డం బైనన్                             (విరాట 4-246)

               డాపల, వలపట. వలపల అంటే కుడివైపు, దాపట అంటే ఎడమవైపు. ఈ సేనకు ఈ మోహరమునకు కొంచెం ఎడమవైపు తీసుకెళ్ళు నేను ఆ దుర్యోధనునికోసం ఉరికి, పట్టుకుంటాను. ఇదే నాకు గొప్ప అవకాశం. దుర్యోధనుడిని నేను పట్టుకుని పరిమారిస్తే భవిష్యత్తులో ఇంక వేరే గొడవ ఏమీ లేదు. కాబట్టి ‘అతనిని పట్టుకుని ఉరికెద, అరుదుగ ఎబ్భంగి ఎవ్వరడ్డంబైనన్’-

ఉ.           ఆతఁడు సిక్కెనేని బలమంతయు విచ్చు మరల్చవచ్చు గో
 
               వ్రాతము నట్లయైన సుకరంబుగ నంతట నెల్లఁ దీఱు నీ
   
               యాతత సేనయం దతని నారసి కానకయున్న వీరి ని
    
               ట్లీతల డించి యా కదుపు నెయ్దఁగఁ బోదము గాక వ్రేల్మిడిన్.                                   (విరాట. 4-247)

                        అతనిని పట్టుకున్నామా, ఈ సేనంతా ఒక్కసారి నిలిచి పోతుంది. ‘మరల్పవచ్చు గోవ్రాతమున్’- అతనిని పట్టుకున్నామంటే రెండు పనులౌతాయి. స్వామి కార్యం, స్వకార్యం రెండూ జరిగినట్లే. గోవులను తీసుకుపోవచ్చు, అంతా తీరిపోతుంది. మనం దీన్ని వదలి ఆయన వెంట వెళుతూ ఉంటే అతను ఎక్కడో ఉండి ఉంటే కనపడకపోతే ‘అతని నారసి కానకయున్న వీరి నిట్లీతల డించి యా కదుపు నెయ్దఁగఁ బోదము గాక వ్రేల్మిడిన్’- అతనికోసం వెతుకుతుంటే వెదుకుతూనే ఉండాలి కదా సరియైన పనేనా? మనం వచ్చిన పనేమిటి? సంభాషణలోనే ఆలోచిస్తున్నాడు అర్జునుడు. తాము వచ్చిన పని దుర్యోధనుణ్ణి పట్టుకోవడం కాదు ఆవులను రక్షించి తీసుకు రావడం. ‘విచ్చి చనకుండ పసులన్ తెచ్చుట మునుమున్న వలయు తెఱగు’- గుర్తొచ్చింది ఒకసారి. ఓహ్! దుర్యోధనుడు కాదు మన లక్ష్యం. వాళ్ళు అపహరించిన గోవులను తీసుకుని రావాలి. ‘ఆ పనికిన్ చొచ్చి అది చక్కఁ బెట్టగ అచ్చోట దాయ మనకగుపడెడు’- కాబట్టి ఆ పనిని మనం నిర్వర్తిస్తున్నాం అంటే దుర్యోధనుడు కూడా రావడం దేనికి? ఆవులను తీసుకుపోవడానికి, మనం ఎప్పుడైతే ఆ గోవులను రక్షించి తీసుకుని వస్తున్నామో అప్పుడు ఆ దాయ - ఆ శత్రువు మనకు అగపడెడు. భలే! ఇది తిక్కన సృష్టి, సంభాషణలలో సన్నివేశాన్ని మనకు ప్రత్యక్షం చేసే 

Player
>>