కృతినిర్మాణ ప్రస్తావన1

కృతి నిర్మాణ ప్రస్తావన

ఆ కావ్య సాక్షాత్కారంలో మొట్టమొదటిది మంగళాచరణ పద్యంగా ఆయన చెప్పినది.

ఉ.         శ్రీయన గౌరినాఁబరగు చెల్వకుఁ జిత్తము పల్లవింప భ         
ద్రాయితమూర్తి యై హరిహరంబగు రూపము దాల్చి ‘విష్ణు రూ
పాయ నమశ్శివాయ’ యని పల్కెడు భక్తజనంబు వైదిక       
ధ్యాయిత కిచ్చ మెచ్చు పరతత్త్వముఁ గొల్చెద నిష్టసిద్ధికిన్       (విరాట. 1-1)

   ‘శ్రీయన’- లక్ష్మీదేవి, ‘గౌరినాబరగు’ - గౌరి అని పిలువబడేది, ఒకటే స్త్రీ, ఆమెకే రెండు పేర్లు శ్రీ, గౌరి. ‘చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తియై’, భద్రాయితము అనే పదాన్ని తిక్కనగారు వాడిన విధానం చాలా విశిష్టమైనది. వీరి ప్రయోగాలన్నీ అటువంటివే. ఆయతము అంటే విశాలము అని అర్థం, మనకు తెలుసు. మరి 'భద్రాయితము' అంటే శ్రేయస్సుకు ఏకీకరణమైన స్ధానము. రెండు వస్తువులను కూర్చితే వేరువేరుగా తెలియని స్థితి. భద్రాయితమూర్తియై, లోకానికి భద్రాన్ని కూర్చాలి అంటే దానికి సంపూర్ణమైన స్ధానమేదో అది భద్రాయితమైనది. భద్రాయితమూర్తియై శుభాన్ని కలిగించే పరమస్థానమైనది ‘హరిహరంబగు రూపము దాల్చి’- ఈ హరిహరంబగు రూపము ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానంగా అద్వైతంలోకి వెళ్ళిపోయాడాయన. వ్యాసుల వారి గురించి చెప్తూ,

 శా.         విద్వత్సంస్తవనీయ భవ్యకవితావేశుండు, విజ్ఞాన సం

     
   పద్విఖ్యాతుఁడు సంయమిప్రకర సంభావ్యానుభావుండు, గృ

       
   ష్ణద్వైపాయనుఁ డర్థి లోకహితనిష్ఠం బూని కావించె ధ

   
   ర్మాద్వైతస్థితి భారతాఖ్యమగు లేఖ్యంబైన యామ్నాయమున్.             (విరాట.1-3)

   అని ప్రస్తుతించాడు. ఇక్కడ హరిహరంబగు రూపము, పరబ్రహ్మతత్వము ఒకటే. చైతన్యస్వరూపము. ఆ చైతన్యస్వరూపానికి ఆకారం ఏమిటి? అది సాకారం కాదు. నిరాకారం కాదు. సకల విధములైన ఊహలకు రసోచితమైన ప్రాకారం ఆ చైతన్యం. ఆ చైతన్యాన్ని అనుభూతిలోనికి తెచ్చుకోవడమంటే సామాన్యమా? సాధ్యమా? వేదాంత పరిభాషలో ఉదాహరణపూర్వకంగా తటస్థలక్షణం అని, స్వరూపలక్షణం అని అనుకున్నాం. కాబట్టి ఈ చైతన్యస్వరూపము ఏమిటయ్యా! అంటే హరిహరంబగు రూపము. స్వరూప లక్షణం. ‘హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశ్శివాయ అని పల్కెడు భక్తజనంబు’ – ఆ రూపాన్ని దగ్గరనుంచీ చూస్తున్న విష్ణుభక్తులకు విష్ణువుగా, శివభక్తులకు శివుడిగా కనపడుతోంది. అలాంటి చైతన్యస్వరూపాన్ని భావించి ‘పల్కెడు భక్తజనంబు వైదికధ్యాయితకు’. అక్కడ భద్రాయితము, ఇక్కడ వైదికధ్యాయిత. ధ్యాయిత అంటే ధ్యానానికి పరమస్థానమైనది. ధ్యానానికి ఏదైతే ఉత్కృష్టమైన కేంద్రస్థానము అయిందో అది వైదికధ్యాయిత. ‘ఇచ్చ మెచ్చు పరతత్వము’ ఆయన సాధించినది పరతత్వము. ఆ చైతన్యాన్ని గురించి ఆ పరతత్వాన్ని ‘కొల్చెద నిష్టసిద్ధికిన్’. ఈయన ఇష్టసిద్ధి ఏమిటి? మళ్ళీ ధర్మసంస్థాపనమే!

ఇక్కడ ఉన్న ఈ భేదాలను పోగొట్టి, పక్కదారి పడుతున్న మతసంప్రదాయాలను మళ్ళీ చక్కగా నిలపడమే కాకుండా, పెడత్రోవలు పడుతున్న తెలుగుసరస్వతికి ఒక సంపూర్ణమైన, సమగ్రమైన మార్గాన్ని నిర్దేశించాలనే సంకల్పంతో ‘ఆంధ్రావళి మోదముం బొరయునట్లుగ’ అనుకున్నాడు. అని సకల బ్రహ్మ ప్రార్ధనంబు చేసి, నన్నయగారు ‘హరిహర హిరణ్యగర్భపద్మోమావాణీ సుతులన్ నుతియించి తత్ప్రసాద సమాసాదిత’ అని చెప్పుకుంటే, తాను ‘తత్సకల బ్రహ్మప్రార్థనంబు చేసి తత్ప్రసాద ఆసాదిత’ అని, వారి ప్రసాదంచేత సంపాదించుకున్న ‘కవిత్వతత్వనిరతిచే అనుభవ ఆనంద భరిత అంతఃకరణుండు నిరతిశయ అనుభవ’ 

Player
>>