కృతినిర్మాణ ప్రస్తావన4

క.            అని రచనా కౌతుకమున,
               మన మలరగ ‘నీ ప్రబంధ మండలి కధినా         
               థునిగా నే పురుషునిఁ బే      
               ర్కొనువాఁడనొ’ యను తలంపు గూరిన మదితోన్                (విరాట. 1-8)

               ‘ఈ ప్రబంధమండలికి’- ఈ పదునైదుపర్వాలను ఈయన పురాణమని పిలువలేదు. ప్రబంధ మండలి అన్నారు. ప్రకృష్టముగా తీర్చదగిన బంధముకలిగిన దానికి, ‘అధినాథునిగా ఏ పురుషుని పేర్కొనువాడనో’- దీనికెవరు అధినాథుడు? నన్నయగారికి రాజరాజనరేంద్రుడు కృతిభర్త. తన కావ్యాన్ని ఎవరికి అంకిత మివ్వాలి? ‘అను తలంపు కూరినమదితో’- ఇంచుక నిద్రించుసమయంబున ‘మజ్జనకుండు’,- తండ్రిగారు కలలోకొచ్చారు, ‘మజ్జనకుండు, సమ్మాన్య గౌతమగోత్ర మహితుండు, భాస్కర మంత్రి తనయుఁ డన్నమాంబాపతి, యనఘులు కేతన, మల్లన సిద్ధనామాత్యవరుల కూరిమి తమ్ముండు’- చూశారా! సాహిత్యంలో ఎంత మార్పు వచ్చిందో. నన్నయగారు తన తల్లితండ్రుల పేర్లు, ఊరు దేనినీ ప్రస్తావించలేదు. తిక్కన కాలానికి వచ్చేప్పటికి ఇది అవసరం అయింది. చారిత్రక దృష్టి కొంచెం పెంపొందిందన్న మాట. అందుకని వంశచరిత్రను చెప్పుకునే సంప్రదాయం ఆరంభమయ్యింది.

సీ.           మజ్జనకుండు, సమ్మాన్య గౌతమగోత్ర మహితుండు, భాస్కర మంత్రి తనయుఁ
               డన్నమాంబాపతి, యనఘులు కేతన; మల్లన సిద్ధనామాత్యవరుల
               కూరిమి తమ్ముండు, గుంటూరి విభుఁడు కొమ్మన దండనాథుండు, మధుర కీర్తి
               విస్తర స్ఫారుఁడాపస్తంబసూత్ర పవిత్రశీలుఁడు సాంగవేదవేది
తే.           యర్థిఁ గల వచ్చి వాత్సల్య మతిశయిల్ల;
               నస్మదీయ ప్రణామంబు లాదరించి
               తుష్టి దీవించి, కరుణార్ద్ర దృష్టిఁ జూచి,
               యెలమి నిట్లని యానతి యిచ్చె నాకు                             (విరాట. 1-10)

    మన ఆత్మకు నాలుగు అవస్థలున్నాయి. ‘సోయమాత్మా చతుష్పాత్’. ఈ ఆత్మకు నాలుగు అవస్థలుంటాయి. చతుష్పాత్ అంటే నాలుగు పాదాలున్న ఆవో, గుర్రమో కాదు. ఆత్మకున్న నాలుగు అవస్థలు. జాగృత్, సుషుప్తి, స్వప్నావస్ధలు మూడు, చైతన్యం నాలుగవది. స్వప్నావస్ధలో కూడా ఆత్మ ప్రకాశమానంగానే ఉంటుంది. అటువంటి స్వప్నావస్థలో నమస్కరించగా ‘కరుణార్ద్ర దృష్టి జూచి ఎలమి ఇట్లని ఆనతి నిచ్చె’ ఇలా చేయమని ఆదేశించారు.

శ్లో.          ‘కిమస్థి మాలాం కిము కౌస్తుభం వా 
 
               పరిష్క్రియాయాం బహుమన్యసే త్వమ్
               కిం కాలకూటః కిము వా యశోదా      
         
               స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే’                                   (విరాట. 1-11)

            ‘అని నీవు తొల్లి రచియించిన పద్యంబు’- తిక్కనగారు తన చిన్నతనంలో భక్తి తాత్పర్యంతో వ్రాసుకున్న పద్యం. ఈశ్వరుడు, విష్ణువు అని భేదభావంతో వైరాన్ని పెంచుకుంటున్న శైవ, వైష్ణవ భక్తులను చూసి, ఈ విలాసము ఏమిటి అని విస్మయంతో ఆయన కంటికి కనిపిస్తున్న రూపాన్ని చూస్తే అంతా ఏకమై కనపడుతున్నది. శైవ, వైష్ణవాలు రెండిటికీ ఏకీభూతమైన చైతన్యస్వరూప పరమాత్మతత్వనిర్దేశ సాక్షాత్కారాన్ని ఉద్దేశించి, ఏమిటి నీ వ్యవహారం?  ‘కిం అస్ధిమాలాం’?  ఎముకలతో కూడిన మాలయా? ఈశ్వరుడు అదేకదా ధరించేది. కాదా! ‘కిం కౌస్తుభం వా’? లేకపోతే కౌస్తుభమణియా? విష్ణువైతే కౌస్తుభమూ, శివుడివైతే 

Player
>>