కృతినిర్మాణ ప్రస్తావన5

అస్థిమాలా? ఈ నీరూపానికి పరమార్థం ఏమిటి? ‘పరిష్క్రియాయాం’ అంటే అలంకరించుకోవడం. కాబట్టి నీకున్న అలంకారాల్లో నీకు ఆ ఎముకల మాలనా లేకపోతే కౌస్తుభ మణిహారమా? ఏది నీకు ఇష్టమైనది? ‘బహుమన్యసే త్వమ్’ నువ్వు ఏది గొప్పగా అనుకుంటావు? ‘కిం కాలకూటః’ నీకు ఆహారం ఏం కావాలి? నీకు నచ్చినది ఏమిటి? కాలకూటవిషమా? ‘కిం వా యశోదా స్తన్యం’ యశోద చనుబాలా? అమృతోపమానమై శిశువుకు జీవాన్నిచ్చి శరీరాన్ని పెంపొందింపజేసే క్షీరమా? ‘పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి' ఎవరు? ఆ పరతత్త్వం. అన్నట్లుగా’. ‘తవ స్వాదు’ నీకు ఏది రుచిస్తుంది? ప్రభో! ‘వద’ నాకు చెప్పు. తిక్కన ఎంత గాఢంగా, చమత్కారంగా భావించాడో? ఈ ఒక్క భావనతోనే పరతత్త్వానికి తిక్కన గురించి అర్ధమై, ‘అని నీవుతొల్లి రచించిన పద్యంబు గాఢాదరంబున అవధరించి, భక్తవత్సలుడైన హరిహరనాథుడు దయాళుండై యునికింజేసి, నిన్నున్ కృతార్థునిం జేయ కార్యార్థియై’- నిన్ను కృతార్థుని చేయాలి అనే సంకల్పంతో పని కట్టుకుని ‘నాకలోక నివాసియైన నాకు’- ఆ తండ్రిగారు తిక్కనకు చెప్తున్నారు, నేను స్వర్గంలో ధ్యానమగ్నుడనై ఉన్నప్పుడు ఆ హరిహరతత్త్వరూపం నాకు దర్శన మిచ్చి, ‘తన దివ్య చిత్తంబునన్ గల అక్కారుణ్యంబు తెఱంగు యెరుంగునట్టి శక్తిని’- అద్భుతమైన వాక్యనిర్మాణం, వాక్యప్రయోగం. తన దివ్యమైన మనస్సులోని దయను తెలుసుకునే శక్తిని ఆయన ఈయనకు ఇచ్చాడట. అంటే నిద్రాణమైన శక్తిని జాగృతం చేసి తనంతట తానుగా ఆకర్షించి పిలిపించుకున్నాడు. భగవంతుడు మనకు సుఖాన్ని, దుఃఖాన్ని రెండింటినీ ఇచ్చినట్లు తోస్తున్నా, ఆ కరుణను గ్రహించడానికి ఒక అర్హత అవసరం. అప్పుడు ఆ కారుణ్యాన్ని గ్రహించే శక్తి వస్తుంది. ఆ శక్తిని ‘ప్రసాదించి’, ‘నన్ను ఆకర్షించి’, పిలిపించుకున్నాడు దగ్గరికి ‘కొలిపించుకొని’, ఇక్కడ చెప్తున్న దేమిటి? ఆకర్షించి, కొమ్మనామాత్యుడు ధ్యానంలో కూర్చుంటే, ఆ ధ్యానసమాధినిష్ఠలో అగుపించి, కొలిపించుకుని ‘వీడె విజయం చేయుచున్నవాడు’- ఇదిగో వస్తున్నాడు చూడు. ఆ హరిహరనాథస్వరూపమే సాక్షాత్తు ఆకారాన్ని దాల్చి, ‘నీవు రచించే ప్రబంధమండలికి, అధినాథుడిగా నిలవాలనే ఉద్దేశ్యంతో వస్తున్నాడు గమనించమని ‘చూపుటయు’ చూడగానే, ‘సవిశేష సంభ్రమ సంభరిత హృదయుండనై అవ్వలను కలయం కనుంగొనునప్పుడు’- ఆయనది సహజమైన నాటకీయరచన కాబట్టి దృశ్యమానమైన రూపాన్ని ఇలా వర్ణిస్తున్నాడు.

సీ.           కరుణారసము వొంగి తొరఁగెడు చాడ్పున, శశిరేఖ నమృతంబు జాలువాఱ
  
               హరినీలపాత్రిక సురభిచందన మున్న, గతి నాభి ధవళపంకజము మెఱయ
    
               గుఱియైన చెలువున నెఱసిన లోక ర, క్షణమనంగ గళంబు చాయ దోఁపఁ
   
               బ్రథమాద్రిఁ దోఁతెంచు భానుబింబము నా ను రమ్మునఁ గౌస్తుభరత్న మొప్ప

తే.           సురనదియును గాళిందియు బెరసినట్టి
           
               కాంతిపూరంబు శోభిల్లు శాంతమూర్తి

               నా మనంబు నానంద మగ్నముగఁ జేయ; 
     
               నెలమి సన్నిధి సేసె సర్వేశ్వరుండు                            (విరాట. 1-12)           

                        ‘కరుణారసము పొంగి తొరగెడు చాడ్పున శశిరేఖ అమృతంబు జాలువార’- ఆ హృదయంలో నిబిడీకృతమైన కారుణ్యరసధారాస్రవంతిపూరమంతా వెలుపలికి స్రవించే మార్గమా అన్నట్లు శిరస్సుపైని చంద్రుడి నుంచి జాలువారుతున్నది. చంద్రకిరణము ఆభరణంగా ఉంది. ‘హరినీల పాత్రిక సురభి చందన మున్న గతి నాభి ధవళ పంకజము మెరయ’- ధవళపంకజము ఆయన బొడ్డులో కనపడింది. నాభియందు పద్మం ఉన్న మూర్తి ఎవడు? విష్ణువు.  పైనేమో ఆ చంద్రరేఖ, నాభియందు ధవళపంకజం. ఆ పంకజం మెరుస్తోంది. ‘గుఱియైన చెలువున నెరసిన లోక రక్షణమనంగ గళంబు ఛాయ దోప’- కంఠంపై నల్లగా కనపడుతున్నది. ఆ కంఠంలో నల్లగా ఉండే గురియైన చెలువున నెరసిన లోకరక్షణ మనంగ’- జగత్తులకు మంగళకరమైన నిధానమా అన్నట్లుగా గళంలో ఛాయ, నల్లనితనం కనపడింది. ‘ప్రథమాద్రి తోతెంచు భాను బింబమునాన్ 

Player
>>