కృతినిర్మాణ ప్రస్తావన6

ఉరమ్మున కౌస్తుభరత్న మొప్ప’- అని కొంచెం చూస్తే కౌస్తుభరత్నము కనపడింది. ప్రసన్నమధురమైన ముఖం. ఆ ముఖంపై హృదయంలోని కారుణ్యరసమంతా శశిరేఖ నుంచి జాలువారుతూ ఉందా అన్నట్లుగా ఉంది. వినయంతో పాదాలకు నమస్కరిద్దాం అని వంగబోతే పద్మం కనపడింది. చంద్రబింబాన్ని చూసి ఈశ్వరుడనుకున్నాను. ఇప్పుడు విష్ణువనుకోవాలా అని మళ్ళీ తేరిపార చూస్తే కంఠంలో నలుపు. ఆ నలుపు లోకాలను రక్షించే ఛాయ. ఇంతలో కొద్దిగా క్రిందివైపుగా కౌస్తుభమణి. ఆ స్వరూపము ‘సురనదియును కాళిందియు బెరసినట్టి కాంతిపూరంబు శోభిల్లు శాంతమూర్తి’ సురనది, కాళింది. తిక్కన, తన తాతగారు ‘యమునద్గంగము, కృష్ణభూమదిలము’4 అని వ్రాసుకున్న పద్యాన్ని భావించాడేమో ననిపిస్తుంది.

               కాళింది అంటే యమునానది. కాళియమర్దనము జరిగింది. యమునానది నల్లనిది. సురనది గంగ తెల్లనిది. ఆ రెండు కలసినట్లుగా, శివుడు తెల్లనివాడు, విష్ణువు నల్లనివాడు వీరిరువురూ భాసిస్తున్నారు. ‘అట్టి శాంతమూర్తి నా మనంబును ఆనందమగ్నముగ జేయ నెలమి సన్నిధి జేసె సర్వేశ్వరుండు’- ఆ సర్వేశ్వరుడు స్వయంగా నావద్దకు వచ్చాడు ‘ఏనును భక్తిమయంబగు సాష్టాంగదండప్రణామంబు ఆచరించి’- సాష్టాంగంగా నమస్కరించి, ‘కొండొక తొలంగి వినయావనతుండనై లలాట ఉపరిభాగంబున అంజలిపుటంబు ఘటించి నయనంబులు, అవయవంబులును ప్రమదబాష్పసలిల విలులితంబులును పులకపటలపరికలితంబులునుంగా’- శరీరం పులకరిస్తుండగా చూసి, ‘అంతంత నడిచిన అద్దేవుండు అనుకంపాతిశయంబున’- అనుకంప అంటే దయ. దయ అతిశయించగా తన దక్షిణ నేత్రమును, ‘సుధారోచియకా నను వింత లేక చూచి’- తన దక్షిణ నేత్రంతో చూశాడు. కుడికంటితో చూశాడు. ఈయన హరిహరరూపం కదా! ఆ సర్వేశ్వరుడికి రెండు కన్నులు సూర్యచంద్రులు. అందుకని దక్షిణనేత్రమైన చంద్రుని వెన్నెలకిరణాలతో చూశాడు. ‘వదనమున దరహాసరసము తళుకొత్తంగన్’- తన రచనావిధానము రసాభ్యుచిత బంధము, నానారసాభ్యుదయోల్లాసి అని చెప్పుకున్నాడు కదా! ప్రతిదీ వీరికి రసప్రాయమే. నాట్యశాస్త్రంలో చర్చించిన రస ప్రకరణంలో దయారసమనేది లేదు.

ఉ.           వైదిక మార్గ నిష్ఠమగు వర్తనముం దగ నిర్వహించుచున్
   
               భేదము లేని భక్తి మతి నిర్మల వృత్తిఁగఁ జేయుచుండు మ
 
               త్పాద నిరంతర స్మరణ తత్పర భావము కల్మి, నాత్మ స
    
               మ్మోదముఁ బొందఁ గావ్యరసముం గొనియాడుచు నుండు దెప్పుడున్                                                                                                                (విరాట. 1-15)

               మళ్ళీ కావ్యరసము. కావ్యరసమంటే సాక్షాత్కారమై ఉండేది. అందును ‘పారాశర్యుని కృతియై’ దానిలో కూడా వేదవ్యాసవిరచిత ‘భారతమను పేర బరగు పంచమ వేదంబు ఆరాధ్యము జనులకు తద్గౌరవ మూహించి’- గౌరవము అంటే ఎదుటివారిని గౌరవించటం. గురుత్వం యొక్క భావము గౌరవము. గురుత్వము అంటే సంశయాలు కలిగినప్పుడు ఆ సంశయ విఛ్చేదన కార్యమైన జ్ఞానాన్ని ప్రసాదింపగలిగిన శక్తి గురుత్వశక్తి. ‘తద్గౌరవమూహించి’- భారతంలో ఉన్న ఆ సామర్థ్యాన్ని తెలుసుకుని, ‘నీవు అఖండిత భక్తిన్ తెనుగు బాస వినిర్మింప దివురుటయ’, వినిర్మింప తివురుట అంటే అనువాదము కాదు. క్రొత్తగా తెనుగుభాషలో అదే కథను స్వకపోలకల్పనలతో చెప్పడం.

ఆనాడు వైశంపాయనుడు వ్యాసులవారు చెప్పిన సంస్కృతభాషలోని భారతకథను ప్రచారం చేస్తే, దానినే తెలుగున వినిర్మించి, మరొక సృష్టి చేయవలెనని సంకల్పించాడు. కనుకనే ‘తన కావించిన సృష్టి తక్కొరులన్ చేతన్ కాదు’ అన్న కీర్తికి తావలమైనాడు. -‘వినిర్మింపదొరగుటయు భవ్య పురుషార్థ తరు పక్వ ఫలము కాదె’- పురుషార్థము అనే వృక్షపు పండిన ఫలము. ‘దీనికెడనియ్యకొని వేడ్కనూని కృతిపతిత్వము అర్ధించి వచ్చితిని’- నీ భారత రచన పురుషార్థపక్వఫలం’. ఆ ఫలాన్ని అర్థిస్తున్న పరమాత్మ సాక్షాత్కారం చేసుకున్న మహాకవి అయ్యాడు తిక్కన. ‘అనిన అద్దివ్య వచనామృతంబు నా యుల్లంబున వెల్లిగొనిన’- నా కృతికి అధినాధుడు కావాలని సంకల్పిస్తే భగవంతుడే ఎదురయ్యాడని సంతోషంతో పునఃపునఃప్రణామంబులు ఆచరించి - నమస్కరించి సాక్షాత్తు పరతత్వమే వచ్చి కృతిపతిత్వము అర్థిస్తే దీనికింతకన్నా సార్థకత ఏం కావాలి? అనుకుని పునఃపునః 

Player
>>