కృతినిర్మాణ ప్రస్తావన8
జననమరణచక్రబంధాల్లోనుంచి తీసి, మళ్ళీ ఆ చట్రంలో తిరుగకుండా రక్షించమని -‘ఉపలాలితుండగు డింభకుండు’- చిన్నపిల్లవానిని దగ్గరకు తీసుకుని లాలిస్తుంటే తన స్తోమత తెలియక కోరికలు కోరినట్లుగా నాకది కావాలి, ఇది కావాలి అని, -‘తన కొలంది యెరుంగక’- తన అర్హత తెలుసుకోలేక, -‘మహా పదార్ధంబు వేడు విధంబున’- ‘వాడి కొలది యెంత? ‘బ్రహ్మానంద స్ధితిన్ గోరి’- బ్రహ్మానందస్థితిని కోరుతూ, -‘సర్వ అంగ ఆలింగిత మహీతలంబగు నమస్కారం’- సర్వ అంగములచేత ఆలింగనం, అంటే భూమ్మీద పడుకునేటప్పటికి ఇక్కడి శిరస్సు నుంచి పాదముల వరకు భూమిని అంటని శరీరభాగం లేదు. -సర్వావయవములచేత ఆలింగనం చేయబడిన భూమి- సాష్టాంగనమస్కారం చేసి, అజ్జగన్నాథుండు, ‘జనన మరణాదులైన సంసార దురితములకు అగపడకుండంగ తొలగు తెరగు కనువెలుంగు నీకిచ్చితి’- జనన మరణ చక్రానికి విముక్తి అనేది కర్మవశమైనది కాబట్టి నీవు సమాధానము చెప్పాలి అక్కడ. అప్పటికి తిక్కనగారికి కూడా తెలుసది. లేకపోతే నిక్షేపించుకుని ఉండేవాడు. కానీ యదార్థం తెలిసిన మహనీయతపోమూర్తి కాబట్టి ఆ వాక్కు ఎలా వచ్చిందంటే, ఆయన చెప్పాడు ‘జననమరణాదులైన సంసార దురితములకు’, ఈ జనన మరణమనేది ఉంటే దుఃఖం ఉండనే ఉంటుంది.
శ్లో. జన్మ దుఃఖం, జరాదుఃఖం
జాయా దుఃఖం పునః పునః
జాయా అని ఆంటే స్త్రీకే అన్వయించుకోవలసిన అవసరం లేదు. పురుషులకూ ఉపయోగించుకోవచ్చు. భర్తృ దుఃఖం పునః పునః అన్నా ఏమీ తప్పు లేదు.
శ్లో. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః
సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత! (ఆది శంకరాచార్య)
అని చెప్పారు. ‘అట్టి జనన మరణ సంసార దురితములకు అగపడకుండంగ తొలంగు తెరవు’ దానివలన నీవు చలించకుండా ఉండగలిగే మనస్థైర్యం నీకిచ్చి, ‘కనువెలుంగు నే నిచ్చితి ననిన లేచి నిలిచి సంతోషము ఎదనిండ నెలవు కొనగ మేలు కాంచి’ ఆ నిశ్చయం కలిగేసరికి కనులు తెరిచి చూశాడు.
క. ఎలమియు నచ్చెరువును సరి
నెలసి పొదలు మానసమున నెంతయుఁబ్రొ ద్దేఁ
గలలోనఁ గన్న చందము,
దలఁచుచు నుండితిని భక్తి తాత్పర్యమునన్ (విరాట. 1-25)
ఆశ్చర్యానందాలతో ఆ ‘కల’నే భక్తితాత్పర్యములతో తలచుకొంటూ ఇది నిజమా? కలయో వైష్ణవమాయయో? కలే అనుకుంటే తన తండ్రిగారు రావడం, చెప్పడం, కృతిపతిత్వ నిశ్చయం, చకచకా జరిగిపోయాయి. తదనంతరంబ
ఉ. ఇట్టి పదంబు గాంచి పరమేశ్వరునిం గృతినాథుఁ జేసి యే
పట్టునఁ బూజ్యమూర్తి యగు భారత సంహితఁ జెప్పఁగంటి; నా
పుట్టుఁ గృతార్థతం బొరసెఁ బుణ్యచరిత్రుఁడ నైతి; నవ్విభుం
గట్టెదఁ బట్ట మప్రతిమ కావ్య కవిత్వ మహావిభూతికిన్ (విరాట 1-27)
నాకు వచ్చిన ఆలోచనా విధానానికి, దానికి అనుగుణంగా కనపడిన ఈ పరతత్వరూపమైన ధర్మాద్వైతస్థితికి, అంటే వేదవ్యాసమహర్షి భారతములో నిక్షేపించిన ధర్మస్థితికి ఆలంబనమై ఊతగా ఉన్నదేదో ఆ శక్తి కలిగి, ‘భారత సంహిత చెప్పగంటి నా