ధర్మజుని అరణ్యవాస జ్ఞాపకాలు4

                   ఇవన్నీ కళ్ళ ముందు తిరిగాయి ధర్మరాజుకు, పాండవులకు. ఈ జ్ఞాపకాలతో ‘ఏమయ్యా మళ్ళీ మేము సుఖించే రోజు వస్తుందా’ అని డగ్గుత్తిక పెట్టుకుంటే, ధౌమ్యుడు ‘ధర్మ నిరూపకత్వమున, ధైర్యమునన్, మహనీయవృత్తి సత్కర్మ విధిజ్ఞతన్, చతురతామహిమన్, ధృఢబుద్ధి నెవ్వడున్ ధర్మజు పాటిగా’- ఎన్ని గుణాలున్నాయయ్యా నీలో.ధర్మనిరూపకత్వం, ధైర్యం, మహనీయ వృత్తి, సత్కర్మ విధిజ్ఞత, చతురతా మహిమ, ధృఢబుద్ధి కలిగిన నీవు అధైర్య పడడ మెందుకు? ‘ధర్మజు పాటిగా రనగ ధాత్రి ప్రసిద్ధుడవైనయట్టి నీ పేర్మికి ఈడె దుర్దశ పెల్లునకున్ దురపిల్లుటారయన్’. ‘దేవతలకైన ఒక్కొక్కచో వలయున కాదె శత్రుసూదన’. ‘దేవతలు కూడా సమయం కొరకు కాచుకుని ఉండాలి. కాబట్టి ఇప్పుడు నీకు శోకించవలసిన పని లేదు, అంతాబాగానే జరుగుతుంది’ అని ఆశ్వాసించగా, ‘అనవుడు అప్పలుకులు విని తనచిత్తము గలక దేరి ధర్మతనూజుండు అనుజన్ముల దెసచూచిన, అనిలసుతుండు’ ఒక్కసారి తమ్ముళ్ళనిచూసి మనకింకేం ఫరవాలేదు, ధైర్యంగా ఈకఠోరమైన అజ్ఞాతవాసాన్ని మనం దాటుకుని వెళతాము’ అని ఆత్మవిశ్వాసంతో వాళ్ళవైపు చూశాడు.

Player
>>