ధౌమ్యుని ఓదార్పు12

శ్లో.          ‘త్యాగాయ సంభృతార్థానాం, సత్యాయ మితభాషిణాం,      
         
               యశసే విజిగీషూణాం, ప్రజాయై గృహమేధినామ్’.         (కాళిదాసు-రఘువంశం)

               ‘త్యాగాయ సంభృతార్థానాం’ త్యాగం చేయడానికే ధనాన్ని సంపాదించటం, ‘సత్యాయ మితభాషిణాం’ సత్యవాక్యత కొరకు తక్కువగా మాట్లాడటం. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడితే అబద్ధాలే దొర్లుతాయి. ‘ప్రజాయై గృహమేధినాం’- వివాహం చేసుకునేది సంతానం కోసమే. ‘యశసే విజిగీషూణాం’, దండయాత్రలకు వెళ్ళి,  యుద్ధాలు చేసి, రాజ్యాలను జయించి సామ్రాజ్యాన్ని ‘యశసే’- కీర్తి కోసం సుస్థిరం చేశారు. అలాగే ఇక్కడ ధర్మరాజు కూడా కీర్తి ధన ఆర్జన క్రీడనంబు, ఆయన -‘క్రీడనంబు కలిగి జనులనేలఁగాని యెన్నండును నొరులఁ గొల్చి’- జనులను పరిపాలించడానికి సమర్థుడే కాని ‘ఎన్నండును నొరులఁ గొల్చి తిరుగ వెరవు లేని యట్టి నీవు’- చాలా బాధ కలుగుతోంది. అరణ్యవాసం వంటి కష్టపరిస్థితులో కూడా మీ సామ్రాజ్య సార్వభౌమ ధురంధరత్వానికి ఎంత మాత్రము భంగం కలగలేదు. మేమందరం మీ కనుసన్నలలోనే ఉన్నాము. అరణ్యవాసంలో కూడా కిరీటం లేదనే మాటే కాని సామ్రాజ్యాధికారంలో ఉన్న సమస్త సామంతులతో సేవింపబడుతూ ప్రభు మర్యాదలతోనే రోజులు గడచాయి. ‘నీవు విరటు నెట్టి చందంబున ననుసరించు వాఁడ వధిప చెపుమ!’- ఇటువంటి నీవు విరాటమహారాజును ఎలా కొలువగలవు?

శా.          సా రమ్యా నగరీ మహాన్స నృపతిః సామంత చక్రం చ తత్
         
               పార్శ్వే తస్య చ సా విదగ్ధ పరిషత్తాశ్చంద్ర బింబాననాః 
 
               ఉద్వృత్తః స చ రాజపుత్ర నివహస్తే వందిన స్తాః కథాః
  
               సర్వం యస్య వశాదగా త్స్మృతిపథం కాలాయ తస్మై నమః                                                                                                         (భర్తృహరి-సుభాషితత్రిశతి)

               భర్తృహరి కాలం గురించి చెబుతూ ఈవిధంగా అంటాడు.

‘సా రమ్యా నగరీ’- ఓ మనోహరమైన నగరం ఉండేది. అంటే ఇప్పుడు లేదు. ‘ఉండేది’. ‘మహాన్ స నృపతిః’- ఎంతో గొప్ప మహారాజు. ‘సామంత చక్రం చ తత్’- ఆయన సామంతులు కూడా అంత సమర్థులే. ‘తత్ పార్శ్వే’- ఆయనను చుట్టుముట్టి ఉండేవాళ్ళు, ‘తస్య చ సా విదగ్ధ పరిషత్’- ఆ పండితసభలో ఎన్నో సభాకార్యక్రమాలు, సమావేశాలు, సమారోహాలు జరిగేవి, ‘సా చంద్ర బింబాననాః’- అక్కడ  చంద్రముఖులవంటి శృంగార రసాధిదేవతలు, విలాసినీ నృత్యక్రీడాకారిణులు ఉండేవారు.  ‘ఉద్వృత్తః స రాజ పుత్ర నివహః’- ఆయన సంతానం ఎంతో తేజస్సుతో వెలిగేవారు, ‘తే వందినః’- ఆయనను నిత్యము పొగిడే వంది మాగధులు, ‘ఆః కథా సర్వమ్’- ఆ విశిష్టత అంతా ఏమైపోయింది? ‘సర్వం యస్య వశాత్ అగాత్’- ఎవరి వశానికి లోబడి అవన్నీ గతించిపోయాయి. అప్పుడుండేదండీ అని భూతకాల విషయంగా మార్చిన ‘కాలాయ తస్మై నమః’- అట్టి కాలమా! నీకు నమస్కారం. అంటూ కాలానికి ఓ పెద్ద నమస్కారం పెట్టాడు.

               ఎటువంటి రాముడు? ఆ రాజ్యమెటువంటిది? మనం చదువుకుంటూ ఊహించుకోవలసినదే. చరిత్రకారులు, ‘ఒక్క రాయి కనపడలేదు, దాని మీద ఒక్క అక్షరం లేదు, లేకపోతే శిలాశాసనం లేదు’ అంటూ ఉన్నవి లేనివి ప్రమాణాలను చూపి చారిత్రక దృష్టితో నిరూపించవచ్చు గాక! కాని ఆర్ద్రతతో, హృదయదృష్టితో చూస్తే అప్పటి వైభవాన్ని ఊహించుకోగలం. ఎటువంటి ధర్మరాజు? ఎటువంటి పరిపాలకుడు? కాలవైపరీత్యంచేత

               ఇట్టి పరిస్థితి కలిగింది కదా! ‘అనినన్’- పరస్పరము ఈ అన్నదమ్ములకు ఒకరి మీద ఒకరికి ఉన్న అనురాగంచేత కాని ప్రేమబంధంచేత కాని ధర్మరాజుకు ఎప్పుడు ఏ ఇబ్బందులు రాకుండా వాళ్ళు చూసుకున్నారు. అరణ్యవాసంలో ధర్మరాజును ఎప్పుడు భీమార్జున నకుల సహదేవులు సేవించుకుంటూ ఉండేవారు. తనంతట తానుగా ఏ పనీ చేయలేదు. తమ్ములు చేయనివ్వలేదు. 

Player
>>