ధౌమ్యుని ఓదార్పు8

              తని వెణ్ణింగ్ ఉక్కట్రాదు తన్నంక మలర్ ముగత్తిల్ వనవెన్           
               కదలెత్త నీరనగ కలయెన్ రలయై వైత్తు వినియ 
               వెగల్ వింజయర్ మగళిర్ యామినీ సైక్కుం కాంపోగి యనవణ్   
               శిలయుం కరైందురుగ వెలమిన్ కోదై యదుగణాత్

               అది సంస్కృతంలో ఎలా ధ్వనించింది? తెలుగుభాషలో మాధుర్యం సంస్కృతం నుంచి తెచ్చుకున్నదే కదా!

శ్లో.          తదనువదన రాకాతారకానాథకాంతే  
               నిహితమైతచేలా నిస్త్రపం సా రురోధ  
               కిసలయమృదురాజత్కిన్నరీ పాణి వీణా          
               సరసరవసుధాంచత్సార పూరానుకారా

               ఇదీ భాషలోని మాధుర్యం.‘మోహాపదేశ తమో ముద్రితములైన కనుదమ్ముల హిమాంబు లునుపరాదు’- గిరికాదేవి కనులు పద్మాల్లాగా ఉన్నాయి. ఆ పద్మాలమీద మంచు పడితే ఎలా? పద్మాలు వికసించాలి అంటే సూర్యుడు రావాలి. మంచును తీసుకువచ్చేది శీతకిరణుడైన చంద్రుడు. చంద్రుడి దగ్గర నుంచి జాలువారే మంచు కిరణాలతో ఆమెకు చల్లదనాన్ని కలిగించాలంటే ఆ కళ్ళేమౌతాయి?  మూతపడే ఉంటాయి. ఆయన ఊహ చూడండి. ఆ ఊహకల్పన తెలుగులో, ‘మోహాపదేశ తమో ముద్రితములైన కనుదమ్ముల హిమాంబు లునుపరాదు’ తమిళంలో, ‘మరుత్తడు మోగన్ వెఱ్ఱి మీరన్ మలైజాళ్ మురైవుడు వీజిమరై ముగజితదాలి’. సంస్కృతంలో, ‘మోహధ్వాంత సనిద్ర దృఙ్మలినయో ముచ్చం హిమాంభః కథమ్’. భాషకున్న మర్యాద, మాధుర్యం అటువంటిది. అదే ‘భవదాజ్ఞా దృఢబంధ సంయమిత’ పద్య వినిర్మాణ శిల్ప గాంభీర్యం. ఆ పదబంధము, భీమసేనుడి ఆవేశాలోచనావిచారస్ఫోరక సన్నివేశ సాక్షాత్కారం ఇంకొక చోట రాదు.

అజ్ఞాతవాస సమాలోచనము

               ‘అనిన విని ధర్మనందనుండు తెలివొందిన మొగంబు తోడ శిరఃకంపంబు సేసె’- నీవు చెప్పేది నిజమే నాయనా! నేను కాదనను. ‘అట్టి సమయంబున నవ్విప్రులందఱు నొక్కమొగిన’- ఈ బ్రాహ్మణు లందరూ లేచి ‘మీ తలంపునకు దైవం బనుకూలంబు గావుత మని పాండుపుత్రుల దీవించి పునర్దర్శనం బయ్యెడు మనుచు వీడ్కొని’- మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిరస్తు అని ‘నిజస్థానంబులకుం జనిరి’. నిజస్థానము అని సంస్కృతంలో చెప్పిన వెంటనే చూడండి చమత్కారం. ‘తదనంతరంబ బాహ్య పరివారంబెల్లను సముచిత ప్రకారంబున వీడుకోలు వడసి తమ తమ పొందుపట్లకుం బోయిరి’. నిజస్థానమునకు అచ్చతెలుగు ‘పొందుపట్లు’ తమకు ఎక్కడ పొందు ఉంటుందో అక్కడకు. తాము పొందిన ప్రదేశాలకు వారు వెళ్ళారు. పోయిన, మిగిలిన ఈ ఏడు మంది, ఐదుమంది పాండవులు, ద్రౌపది, ధౌమ్యాచార్యుడు.

                        ‘తమ్ములు ధౌమ్యుఁడున్ సతియుఁదా నరదంబులతోడఁ గ్రోశమాత్ర మ్మొక చోటికల్లఁ జని’ వాళ్ళు వెళ్ళిపోయినాక వీళ్ళను తీసుకుని ఒక క్రోసెడు దూరం వెళ్ళారు. ‘ధర్మతనూభవుఁ డందు నాఁటిరేయి’ ఆ రోజు రాత్రి, ‘ఇమ్ముల సల్పి’ సరే వీళ్ళందరి ఆశీర్వాదము పొంది, రేపు చేయవలసిన కార్యక్రమం నెరవేర్చాలి కదా అని ఆలోచించి,‘వేగుటయు’ తెల్లవారింది. ‘ఈప్సితకార్యము సేయఁగా విచారమ్మున నున్నచో’తెలతెలవారుతోంది. అంటే పూర్తిగా సూర్యోదయం కూడా కాలేదు. ధౌమ్యాచార్యులవారు అనుష్ఠానానికి ఏ నదీప్రాంతానికో వెళ్ళిపోయారు. తమ్ముళ్ళు ఉన్నారు. ధర్మరాజు మేల్కొన్నాడు. సూర్యుడి తొలికిరణాలు, ఆ సంధ్యారాగరుచులు ఇంకా భూమి పైకి ప్రసరించలేదు.

Player
>>