పాండవుల వృత్తినిర్ణయం11

              ‘వేగ జాముగలుగ వెడ నిద్ర పొంది ఎప్పుడో నేను మేల్కొనేది. కాని రాజ్యభార కార్యయుక్తి అబ్జనయన! నాకు ఆహార నిద్రలకు నెడయు’- భోజనానికి, పడుకోడానికి కూడా ఊపిరి సలిపేటంత సమయం లేదు. ఇటువంటి ఆమెను గురించి పాపం ఏమని చెప్పాడు? ‘ఇది కడు ముద్దరాలు పనులేమియుఁ జేయఁగ నేర దెంతయున్’- ఏమియు చేయగ నేరరాదని ద్రౌపదిపై పాపం ఆయనకున్న ప్రేమతో ఈమె ఎక్కడకు వెళుతుంది? ఏం సేవ చేసుకుంటుంది అనుకున్నాడు. ఆ ద్రౌపదిని పాపం ఈమె ఎట్లా సేవ చేస్తుంది అని బాధ పడ్డాడు.

ద్రౌపది ప్రసాధన కళానైపుణ్యం...

           ‘అనిన అతని చిత్తంబునకు వెనుఁబాటంతయును బాయు వెరవు కలిమి ఎల్లను తెలియునట్లగా’- అపుడు సత్యభామకు సర్వమూ తెలిసేవిధంగా చెప్పినట్లు ‘సైరంధ్రీ వేషంబునఁ జేరుదు నంతఃపురంబు చెంతకు నన్నా భూరమణుదేవి యెంతయు గారవమునఁ బిలువనంపఁగా వినయమునన్’- నేను అక్కడికి వెళతాను కానీ సూటిగా ఆమె ఇంటికి పోను. నన్ను చూసి ఆమే పిలిపించుకోవాలి. మానధనులు అన్నారు కదా! అభిమానముతో అక్కడ సైరంధ్రీవేషంలో ఆ పరిసర ప్రాంతాలలో తిరుగుతుంటే నన్నుచూసి ఆ సుదేష్ణాదేవి తనంత తానై పిలిపించుకోవాలి. ‘కని కొలువు సేసికొని మాలిని నాఁ జని’- మాలిని అనే పేరుతో ఉండి, ‘సాధ్వి యిది’- అందరూ చూసి ఇది సాధ్వి అనుకొని ఈమెను చూస్తే అందరికీ పవిత్రమైన భావం రావాలి. ‘మలీమసవృత్తంబున పొంతఁబోవ దెన్నఁడు’- ఏదో చిన్న చిన్న పనులు నీచమైన వాటికి పోదు. ‘అను వ్రేఁకదనంబు’- గౌరవం ఈ మాట ఎక్కడనుంచి వచ్చింది? ఇది ఆయన రేఖండీ! ఆ రేఖతో వెలిగిపోతున్నాడు. సౌందర్యరేఖ, వైభవరేఖ, సంపదరేఖ ఆ రేఖ రేఖయై వ్రేక అయ్యింది. ఆ వ్రేకయే గౌరవం. ‘వ్రేఁకదనంబు దోఁచునట్లు చరింతున్’- ఆ గౌరవం కలిగేట్టు మెలగుతాను. అద్భుతమైన సౌందర్యపోషకురాలు ద్రౌపది.

        ఎన్ని విధాలుగా సౌందర్య పోషణ చేస్తానని చెప్పిందంటే ‘కలపంబు లభినవ గంధంబులుగఁ గూర్చి తనువున నలఁదుదుఁ ననువు అనువు?గాఁగ’- అంటే ఆమె సుగంధద్రవ్యాలను, ముఖలేపనాలను, పరిమళభరితములైన వానిని -‘అభినవ గంధంబులు’- ఎప్పటికీ నిలిచే సువాసనలతో కూడినవానిని స్వీకరించి, ‘మృగమదపంకంబు’- కస్తురిని తీసుకుని -‘మృదువుగా సారించి’- మెరుపులు వచ్చే తిలకములు ఎన్ని విధాలుగ తీర్చవచ్చునో అన్ని విధాలుగా ‘తిలకంబు వెట్టుదుఁ జెలువు మిగులఁ’- ఒక్కోసారి ఒక్కో విధమైన తిలకం తీరుస్తాను. -‘పువ్వులు బహు విధంబులఁ గట్టి’- అంటే ఒక విధంగా కాదు, ఒకసారి చక్రాకారం, శంఖాకారం ఇంకోసారి ధను రాకారంలో వివిధ రకాలుగా ‘పుష్పములు బహు విధంబులఁ గట్టి ముడి కొక్క భంగిగా’- ఒక్కొక్క ముడికి ఒక్కొక్క విధంగా కేశములను తీసి ‘ఎత్తులు పట్టి’- అంటే ఆ కేశాలంకరణ ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఉన్న మేకప్ కళాకారులందరూ కూడా తలలు వంచుకోవాలి. ఆవిధంగా వివిధములుగా ముడులు కట్టి, ‘హారముల్ మెఱయ నొయ్యారంబుగాఁ గ్రుచ్చి, యందంబు వింతగా నలవరింతు’- ఆ పూలను తీసుకుని హారాలు గ్రుచ్చి వింత అందం వచ్చేట్టు అలంకరిస్తాను. ‘వివిధ శిల్పములఁ బ్రవీణ నై’- మళ్ళీ శిల్పం వచ్చింది. ‘శిల్పం కర్మ కళాదికమ్’ అని చెప్పుకున్నాం. ‘శీల ఉపధారణే’ శీల - ఉపధారణ అంటే అభ్యాసం - ధరించి ఉండటం ఎప్పుడు? అభ్యాసం - నిరంతరాభ్యాసం మానసికంగా, భౌతికంగా ఉండాలి.

                        ‘అనభ్యాసే విషం శాస్త్రం’ ‘అజీర్ణే భోజనం విషం’ అజీర్ణానికి భోజనం విషం అభ్యాసం లేకపోతే శాస్త్రమే విషమైపోతుంది. కాబట్టి నిరంతరమైన అభ్యాసం ఉండాలి. ‘సభావిషం దరిద్రస్య’ దారిద్ర్యం ఉన్న వాడిని తీసికెళ్ళి సభలో కూర్చోపెడితే పాపం అదే వాడికి విషమైపోతుంది. ‘వృద్ధస్య తరుణీ విషం’ వయసు మీరిన వృద్ధుడికి యౌవనంలో ఉన్న స్త్రీ విషం. ఆ శిల్పంలో కళలో కౌశలం ఉండేది కాబట్టి వివిధ శిల్పముల అనేక విధములైన పనులలో నేను ప్రవీణనై -‘మఱియును వలయు పనుల వెంట మెలఁగ నేర్తు’- వీటినే కాకుండా ఇంకా ఏమైనా చేయాలన్నా అంతఃపురస్త్రీలకు తోడుగా చేస్తాను. -‘మత్స్యరాజమహిషి మనమున మక్కువ నెలకొనంగ నిట్లు గొలువ నేర్తు’- ఈ పనులు చేస్తాను నేను. వీళ్ళందరినీ 

Player
>>