పాండవుల వృత్తినిర్ణయం13

ధర్మరాజా! అది నా పని. ఇంకా నీకు చెప్పాలా? నేను ఎవరి సాన్నిహిత్యంలో. సాంగత్యంలో ఉంటానంటే, సైరంధ్రికి ఇంకో నిర్వచనం కూడా చెప్తానని అంది. ‘శీరం ధారయతీతి శీరంధ్రా’ శీరం అంటే చీర. ఆ శీరే మన తెలుగులో చీర అయింది. మహారాణులు మాట్లాడేటప్పుడు తెరచాటు చేసుకుని దాని వెనక కూర్చొని ముఖం చాటు చేసుకుని మాట్లాడుతుంటారు. అది శీరం. ‘శీరం ధారయతీతి శీరంధ్రా’ ఆ శీరంధ్రా, ఆ మహారాణుల దగ్గర ఉండేది సైరంధ్రి. ‘కావున ఉచితములగు నా కావెంటం గొలిచి తిరుగునప్పుడు, మితభాషా విరచనమును, వ్రతసంభావనమును గౌరవంబుఁ బాపభయంబున్’- ఆ వృత్తిలో మెలగునప్పుడు తగిన నియమాలు అన్నీ వుంటాయి. నీవేమీ భయపడ నవసరంలేదు. ‘అని చెప్పిన విని అగు బొమ్మని కైకొని’- ఇంక వద్దు. ఏదో పొరపాటుగా అన్నాను అంతే. అంతవరకు మాట జారాను. ‘అగు బొమ్మని కైకొని’- అనుకొని ‘ధర్మతనయుఁ డందఱమును నిట్లనపాయత వర్తిల్లుద మని తమ్ములతోడ నిశ్చయంబుగఁ బలికెన్’- ఇలా అందరమూ ‘అనపాయత తోడ వర్తిల్లుదము’ ఏ అపాయము లేక ప్రవర్తించెదమని తమ్ములతో నిశ్చయంగా ధర్మనందనుడు పలికాడు. 

Player
>>