పాండవుల వృత్తినిర్ణయం4

అవధానంలో గరగరగా ....

               ఒకసారి తిరుపతి వేంకట కవులను అవధానంలో పకోడిని వర్ణించమని అడిగారు. అప్పుడు పకోడి మీద వారి పద్యం.  

చ.        కరకరలాడు కొంచెమగు కారము గల్గుఁ బలాండు వాసనా
           హర మగుఁ గొత్తిమీరయును నల్లము గన్పడు నచ్చటచ్చటన్
           ధరను బకోడిఁ బోలెడు పదార్థము లేదని తద్రసజ్ఞు లా
           దరమునఁ బల్కుచుందు రది తాదృశమే యగు నంచుఁ దోఁచెడిన్.

పలాండు అంటే ఉల్లిపాయలు. ఆ వుల్లి వాసన అంతగా తెలియకుండా కొత్తిమీర అల్లం అక్కడక్కడ. 

ఇంకొక అవధానంలో ‘అయ్యా! అక్కడ చంపకమాల వృత్తంలో చెప్పారు మాకు ఉత్సాహం రావాలి, ఉత్సాహవృత్తములో చెప్ప’మని అడిగారు. ‘శెనగపిండి ఉల్లిపాయ చిన్ని మిరపకాయలున్’ అంటూ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు మొదలుపెట్టారు.

ఉత్సాహ.    సెనగపిండి యుల్లిపాయ, చిన్నిమిర్పకాయలున్
               జొనిపి యందు నల్లమింత చొనిపి ముద్ద జేసియున్
               అనలతప్తమైన నేతి యందు వైచి వేచినన్
               జను పకోడి యనెడు పేర జక్కనైన ఖాద్యమై!

               తిరుపతిశాస్త్రిగారు, ‘ఏమిటీ ఈ పద్యాలు అంటే’, ‘నీకెందుకు ఊరికే ఉండు తాళమేసి చెప్తాను కదా!’ అంటూ మోహనరాగంలో పద్యం పాడారు ఆయన.

ఆరు రసంబులన్ ....

                        భీముడు కూడా ‘గరగరగా కూడు కూర అన్నీ చేసి పెడతాను’, ‘చిత్తమునకు వచ్చిన చందమున నొనర్చి నేర్చి మెలగుదు కరము వినీతి మెఱసి’- అయ్యా నాస్వభావం ఉగ్రమైనప్పటికి కూడా బుద్ధిగా ఉంటాను’. ‘ఆరు రసంబులం జవులయందలి క్రొత్తలు పుట్ట’- మనకు ప్రధానంగా ఉన్నవి ఆరు రసాలు. ఆ షడ్రుచులను తెచ్చి విశ్వనాధ సత్యనారాయణగారికి తగిలించారు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రిగారు. ‘కించిత్తిక్త కషాయ షాడబ రస క్షేపాతి రేకాతి వాక్సంచార ప్రచయావకాశములలో కవ్యుద్ఘ’. నవరసాలున్నాయి. శాంతము, శోకము, కరుణ, భయానకం, బీభత్సం, వీరం, శృంగారము, హాస్యము, అద్భుతము. ఇవి రసాలు కాదట విశ్వనాధ సత్యనారాయణగారి పద్యాలలో. కించిత్తిక్త - కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని మంట పుట్టించేటట్లు ఉంటాయి. ఆరు ప్రధానమైన రుచులలో మధురం ఒకటి.  తీయగా ఉండే పదార్థం మధురం. ఆయుర్వేద వైద్య శాస్త్ర ప్రకారం తీపి తింటే వాతము ఉండదట. ‘మధ్నాతి వాతం ఇతి మధురం’ అని వ్యుత్పత్తి చెప్పుకున్నారు. ‘మంధ విలోడనే’- దాన్ని తింటే వాతాన్ని క్షీణింపజేస్తుంది. అందుకని మనకు భోజనం చేసేటప్పుడు తీపిపదార్ధం లేకుండా తినకూడదన్న సంప్రదాయం ఉంది. అన్నీ ఆకులలో వడ్డించినపుడు పాయసంవంటి పదార్థంతో మొదలుపెట్టి భోజనం చేస్తాం. కొంతమందికి తేనె కూడా వేసుకునే అలవాటు ఉంటుంది. దాని తరువాత ‘తిక్తం’- చేదు. అది యెందుకంటే ‘తేజయతి శ్లేష్మం’ కఫంవంటి దాన్ని పోగొట్టాలి అంటే, కరక్కాయ రాచిపెడితే దగ్గు పోతుంది. లవణం-ఉప్పు. లవణం ఏమి చేస్తుంది?! ‘లునాతి వాతం జాడ్యం’. వాయు సంబంధమైన జాడ్యం ఏదైనా వస్తే దాన్ని తొలగించడానికి ఉప్పు 

Player
>>