పాండవుల వృత్తినిర్ణయం6

       ‘లాగువేగంబు వెలసి చలంబు నెఱపి మల్లుతనమున మెప్పింతు మనుజవిభుని’- ఆ రాజును మెప్పిస్తాను. ‘పెక్కండ్ర నొక్కపోరను నుక్కఱ భంజింతు’- వంటల వరకు బాగుంది. కర్రలు విరుస్తాను అన్నాడు బాగానే ఉంది. ఇపుడు ‘పెక్కండ్ర ఒక్కపోరను నుక్కఱ భజింతు’- అనగానే ధర్మరాజు ఓ చూపు చూసేసరికి వెంటనే ‘చంపుటుడుగుదు’- చంపను, భయపడవద్దు చంపకుండా, ‘రాజున్ దక్కటి చూపఱు లెంతయున్ వెక్కసపడ’- వాళ్ళందరూ ఆశ్చర్యపడేట్టుగా వాళ్ళని చిత్రవిచిత్రములైన పద్ధతులలో గెలుస్తాను కానీ, చంపను.

చ.           అదియును గాక కోలుపులి నైనను గారెనుపోతు నైన ను  
              న్మదకరి నైన నుగ్రమృగనాధుని నైనను గిట్టి ముట్టి బె      
              ట్టిదముగఁ గాలఁ గేలను గడిందిమగంటిమి యుల్లసిల్లఁ బ           
              ట్టుదు నడఁగంగ మాత్స్యుడు గడున్ వెఱంగందుచు బిచ్చలింపఁగన్. (విరాట. 1-83)

మహాసింహాన్ని తీసుకుని వచ్చినా రెండు కాళ్లమధ్యలో దాన్ని పట్టేస్తాను. దానిమీద కూర్చుని, చూడండి కదులుతుందా లేదా అని భీముడిని ఊహించుకోవాలి. విరాటమహారాజు వాహ్యాళికి ఉదయం తోటలో తిరుగుతూ ఉండగా మృగశాలలోని క్రూరమృగం ఉన్నట్టుండి వెలుపలికి వచ్చింది. అయ్యో! ఇది అంతఃపురంలోనికి పోతుందేమో అనుకుంటూ ఉండగానే, చెట్టుమీదకి దేనికి ఎక్కాడో దభాలున దూకాడు. ఆ దూకడం కూడా ఎలా, ఆ సింహం తన కాళ్ళమధ్యకు వచ్చేట్లు దూకాడు. ఆ సింహం ఈయన మోకాళ్ళ మధ్యలో ఇరుక్కునిపోయింది. ఇంకెక్కడికి పోతుంది, వెళ్ళండి రాజా! అంటాడట. ‘పిచ్చలింపగన్’ తన పరాక్రమాన్ని ప్రశంసించగా అని ఇట్లు నానాప్రకారంబుల నతని ‘మనంబు పడయుచు వలలుండను సమాఖ్య వహింతు’.

      ఇక్కడ తెలుగులో వలలుడైనాడు. సంస్కృతంలో వల్లవుడైనాడు. ‘వల్లవః నామధేయః’ వల్లవుడు అనటానికి కారణం ‘సూపకారా స్తు వల్లవః’ అని వ్యుత్పత్తి.  సూపకారుడంటే వంటలవాడు. వల్లవుడు ఒకటే. వల్ల అనే ధాతువుకి ప్రియాన్ని ఇచ్చేవాడు, సంతోషం కలిగించేవాడు అని అర్థం. ఎందులో ‘వల్లంతి భోక్తు ప్రీతి మృత్యువాదయతి’ భోజనానికి కూర్చున్న వాళ్ల మనసులకు బాగా తృప్తి కలిగించేవాడు వల్లవుడు. చేయాలనుకున్న వృత్తి అదే కదా. అందుకని అదే పేరు పెట్టుకుంటానన్నాడు.

అర్జునుడు - బృహన్నల

అని సమ్మతించి ‘బీభత్సు వీక్షించి’ అయిపోయింది భీముడి పని నిర్ణయం అయిపోయింది. ఇక అర్జునుడి వైపు చూశాడు. ఈ అర్జునుడు ఎటువంటివాడు. 

ఉ.           ఖాండవ మేర్చె దేవతలుఁ గానని యీశ్వరుఁ గాంచె దోర్బలో         
              ద్దండమహాసురప్రతతిదర్ప మడంచి ప్రియం బొనర్చి యా 
              ఖండలు డున్న గద్దియసగంబున నుండె మహానుభావుఁ డీ
              తం డొక మర్త్యుఁ జేరి యనుదాత్తత నెమ్మెయిఁ గొల్చువాడొకో   (విరాట. 1-85)

                        స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రునితో సగం సింహాసనంమీద కూర్చుని, ఆ వైభవాన్ని అనుభవించి వచ్చిన అర్జునుడు, సాధారణ రాజు కొలువులో ఎలా గడపగలడు? అను మాటలు విని ‘సంక్రందన నందనుఁ డిట్లనియె’. నిజమే అర్జునుని వంటి సౌందర్యవంతుడు, పరాక్రమవంతుడు అందులో వీళ్ళందరిలో అందరూ తెల్లగా ఉంటే అర్జునుడు, ద్రౌపది మాత్రమే నల్లగా ఉన్నది. ఆ నల్లగా ఉన్నప్పటికీ ఎక్కడికెళ్ళినా పట్టిచ్చే రూపురేఖలున్నాయి ఎలా? అంటే ఇట్లనియె, ఏం భయపడనవసరంలేదు. 

Player
>>