పాండవుల ప్రయాణం4

         

  అయితే ఇక్కడ పాండవులందరుఇది శతవృద్ధ మా జనని యిప్పుడు మృత్యువుఁ బొందెఅని కుంతీదేవి బ్రతికి ఉండగానే తమ తల్లి మరణించిందని చెప్పడంలో సమంజసం ఏమిటి? అసత్య దోషము ఆపాదించవచ్చు కదా అనే శంక కలగవచ్చు. కాని ఆపద్ధర్మసూత్రాలను అనుసరించి ఇది శతవృద్ధ మాజనని అని ఆయుధాలకు వర్తిస్తే, శమీవృక్షము రక్షిస్తుంది అనే భావాన్ని మనసులోకి తెచ్చుకొని శంకని పరిహరించుకొని ముందుకు వెళ్ళవచ్చు. అయితే మహర్షి మూలంలో ఏమన్నారంటే, ‘శరీరం మృత స్యైకం సమబధ్నం పాండవాః’ - ఆయుధాలను మూటగట్టి దానితోబాటు ఒక శవాన్ని కూడ జతచేసి కట్టారు. శవదుర్గంధంచేతఎవరూ శమీవృక్ష ప్రాంతానికి రారు అనే విశ్వాసముతో పని చేసారు. అయితే వీళ్ళు చేస్తున్న పనిని అక్కడ ఉన్న గోపాలకులు గొల్లలు చూస్తుంటారు కాబట్టి వీళ్ళు,‘అసీతి శతవర్షేయం మాతా నః ఇతి వాదినఃనూటఎనబది సంవత్సరాలు వయసు కలిగిన ఇది, ‘అయం మాతా నఃమాకు తల్లిఇతి వాదినః విధంగా అనుకుంటూ వెళ్ళారు. అయితే ఇతిఅన్నచోట వ్యాకరణము ఉంది కాబట్టి దాన్ని అనుసరించుకొని నః అనేదే సార్థకమైనది అయినప్పటికి కూడా, శబ్దోచ్ఛారణ చేతఅసీతి శతవర్షేయం మాతా ఇది కాదు అనే వ్యతిరేకార్థస్ఫురణ సంభాషణవల్ల, శబ్దంవల్ల ఉచ్ఛారణవల్ల వచ్చినది కాబట్టి ఇక్కడ అనుకుంటున్నది నూట ఎనబది ఏండ్ల వయసు కలిగిన మా తల్లిగారని అనుకుంటున్నారేమో కాదు అనే స్ఫురణ కలిగేలా ఉందని కూడా అనుకోవచ్చు.

               తరువాత ధర్మరాజు అందరిని పిలిచి ఇలా అన్నాడు, ‘అజ్ఞాతవాస కాలంబునన్ తమ రహస్య వ్యవహారంబునకు అనువుగా నేవుర పేళ్ళునుతమ ఐదుగురికి సంకేతనామాలు ఏర్పరచుకున్నారు. అజ్ఞాతవాసము చేసే సందర్భములో ఒకరిని ఒకరు పిలుచుకోవలసిన అవసరము ఎప్పుడైనా కలిగితే, సహజంగా వీళ్ళకు ఉన్న పేర్లను కాని, సేవావృత్తిలో వీళ్ళు స్వీకరించిన కంకవలలాది పేర్లను గాని వాడకుండా ఒక సంకేతనామము జయ, జయంత, విజయ, జయత్సేన, జయద్బలులనే పేర్లను వాడుకోవచ్చు. ధర్మజ భీమసేన అర్జున నకుల సహదేవులు అయిదుపేర్లను సంకేతనామాలుగా పెట్టుకొని బయలుదేరారు. అందరు కలసికట్టుగా వెళ్ళకూడదు. ఎవరి తరువాత ఎవరు వెళ్ళాలి?

            తెలుగుభారతంలో తిక్కనగారు ఒకరి తరువాత ఒకరు వెళ్ళినట్టుగానే వివరించారు. ముందు ధర్మరాజు, తరువాత భీముడు, తరువాత అర్జునుడు, తరువాత నకులుడు తరువాత సహదేవుడు, చిట్టచివరిలో ద్రౌపది వెళ్ళింది. అంటే వీళ్ళు సమయనిర్ణయం చేసుకొని వెళ్ళేసరికి కూడా బహుశా ఉదయం తొమ్మిది, పదిగంటల ప్రాంతంలో విరాటరాజు సభ కొలువుదీరి ఉన్నప్పుడు, ధర్మరాజు వెళ్ళి ఉండవచ్చు, తరువాత కొంతసేపటికి భీముడు, తరువాత అర్జునుడు ఇలా వరుసగా అయిదుగురు అన్నదమ్ములు ముందు వెళ్ళి చిట్టచివరిగా ద్రౌపది వచ్చేసరికి సాయంసమయం అయి ఉండవచ్చు. ఇది ఒక పద్ధతి. అయితే మరి తిక్కనగారు అనుసరించిన ప్రతి ఎలాంటిదో, ఆయన చమత్కారపు ఊహ ఏమిటో తెలియదు కాని సంస్కృత భారతములో మాత్రము క్రమము వేరుగా ఉంది. ధర్మరాజు ముందు వెళ్ళాడు, తరువాత భీముడు, తరువాత ద్రౌపది, తరువాత  సహదేవుడు. తరువాత అర్జునుడు, చిట్టచివరిగా నకులుడు వెళ్ళాడు. దీన్నిబట్టి ఏమవుతుంది అంటే, సభ ప్రారంభించే సమయానికి ధర్మరాజు వెళ్ళారు కంకభట్టుగా, ఆయన గౌరవింపదగినవాడు, రాజుకు ఆంతరంగికుడుగా మెలుగుతానన్నాడు కాబట్టి సభ ప్రారంభ సమయానికే వెళితే, కార్యక్రమము శుభంగా జరుగుతుందని అప్పుడు వెళ్ళాడు. ఆయన వెళ్ళిన కొద్దిసేపటికి భీముడు వెళ్ళాడు. అంటే రోజు దైనందినకార్యక్రమములు మొదలైయ్యే పది పదకొండుగంటల ప్రాంతంలో భీముడు వెళ్ళి ఉండవచ్చు. ఇద్దరు పురుషులు విడివిడిగా వెళ్ళారు. ఒకరేమో రాజు ఆంతరంగికుడిగా, బ్రహ్మవేత్తగా, బ్రహ్మజ్ఞానిగా కంకభట్టు వేషంలో ధర్మరాజు వెళ్ళాడు. భీముడు దానికి సంపూర్ణంగా వ్యతిరేకమైన వంటలవాడి వేషంలోబానసీడుఅన్నారు. వంటలవాడిరూపంలో వెళ్ళాడు. వీళ్ళిద్దరి తరువాత, మధ్యాహ్నసమయము కావస్తూ ఉండవచ్చు బహుశా, అప్పుడు ద్రౌపదివెళ్ళింది. దీనిలోఔచిత్యముఉంది. ఎందుకంటే మాధ్యాహ్నిక సమయానికి ద్రౌపది వెళితే, అందరుమగవారు, అయిదుమందిమగవాళ్లుఒకేసారిసభాప్రవేశంచేసి, వెంటనే ద్రౌపదివస్తే అనుమానమురాదా? లేకుంటే, సమయాన్ని అనుసరించుకొని ఎటువంటి సమయములో ఎవరు విరాటరాజు కొలువులోకి వెళ్ళాలి అనేది కూడ ఒక ఆలోచన ఉంటుంది కదా! అందుకని రాజనగరులో నుంచి అందరు వెళ్ళవలసి వచ్చింది 

Player
>>