పాండవుల ప్రయాణం5

కాబట్టి, ముందుధర్మరాజువెళ్ళాడు, భీముడువెళ్ళాడు.తరువాతద్రౌపదిఅంతఃపురం వైపుకువెళ్ళింది. ద్రౌపది తరువాత సహదేవుడు,- ఇంచుమించు సాయం సమయం - మేతకు వెళ్ళిన పశువులు తిరిగివచ్చే వేళకు గోపాలకునిగా వెళ్ళాడు. తరువాత, సాయం సమయంలో చీకటి పడక ముందు అర్జునుడు వెళ్ళాడు. చీకటి పడినాక సైనిక శిక్షణానంతరం అశ్వాలను అశ్వశాలకు చేర్చే సమయంలో నకులుడు వచ్చాడు. అర్జునుడు సాయంత్రము రావటంలోఒకఔచిత్యముఉంది. ఎందుకంటే అర్జునుడు బృహన్నల వేషధారి. నాట్యాచార్యుడిగా అక్కడికి వెళ్తాను, ఉత్తరకునాట్యంనేర్పిస్తానుఅని చెప్పాడు కదా!మరి నాట్యశాస్త్రాన్నినేర్పించాలి అని వెళ్ళినప్పుడు ఆకళా ప్రదర్శనము జరిగే సమయము సాయంత్రం కాబట్టి ఆ కోలాహలము జరిగేప్రాంతంలో వెళితే, సముచితముగా ఉంటుందని భావించినట్లు ఔచిత్యముగా మనము అర్థం చేసుకోవచ్చు.

Player
>>