ద్రౌపది పరాభవం2

ఇంత మహోత్కృష్టమైన ‘కులపవిత్ర సితేతరోత్పల పత్రనేత్ర రాజసూ యావబృథంబు’ నందు స్నానము చేసి పరమ పవిత్రమైనది, అంత పవిత్రమైన ఈ యాజ్ఞసేని ఒక మహాసామ్రాజ్ఞి, నాలుగు దిక్కులూ జయించుకొని పాండవులు తెచ్చిన కానుకలతో వెలుగొందిన ఆమెను కీచకాధముడు సభలో అందరూ చూస్తుండగా తోయగా కింద పడింది.

ద్రౌపదీ పరాభవం - భీమసేనుని ఆవేశం

   ‘అట్టి యెడ పాంచాలీ రక్షకుండైన ‘పాంచాలికి రక్షణగా వచ్చిన రాక్షసుడి ప్రభావంతో   కీచకుడు కూడా తూలి పడిపోయాడు. సభలో ఎవరున్నారా? అని ఒక్కసారి చూశాడు. సభలో అందరూ పరివేష్టితులై ఉన్నారు. విరాటుడు కొలువు చేస్తున్నాడు. పెద్దలు అందరితో పాటుగా సామాన్య జనం ఉన్నారు. ఒక స్త్రీ పరిగెత్తి రావడం, సింహబలుడు వెన్నంటి రావడం, వడిసి పట్టుకోవడం, ఆ స్త్రీని తోయడం, తాను క్రిందపడిపోవడం, లేచి ఆమె కేశపాశాన్ని పట్టుకోబోవడం ‘ఒడుపు తప్పిన మహా నాగంబువోలె ‘ ఈ దృశ్యాన్ని అందరూ చూశారు. శాంతమూర్తి ధర్మరాజు రాజు ప్రక్కనే ఉన్నాడు. ఆ ప్రక్కనే ఏదో పని ఉండటం వల్ల భీమసేనుడు కూడా ఆ సమయంలో కొలువులోనే ఉన్నాడు.

        ‘కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల’ - తన భార్యకు జరిగిన పరాభవాన్ని చూసిన సందర్భంలో భీమసేనునికి కలిగిన ఆ కోపాన్ని క్రమపరిణామదశలో చూపి భయదస్ఫురణా పరిణద్ధమూర్తిని ఆవిష్కరించే విధంగా తిక్కనగారు చేసినట్టి సమాస పదకల్పనము అత్యద్భుతం. ‘కనుగొని’ - చూశాడు. నాలుగు అక్షరాలు. ‘కోపవేగమున’ ఆ కోపంలో వేగం - ఆరు అక్షరాలు. ఆ కోపం మనసులో ఏ విధంగా పెరిగిపోతున్నదో చూపించారు తిక్కన. ‘కన్నుల నిప్పులు రాల’ ఎనిమిది అక్షరాలు. రెండు రెండు చొప్పున పెరుగుతున్నాయి. ‘కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల అంగముల్ కనలగ సాంద్ర ఘర్మసలిలంబులు గ్రమ్మ’ - పది. ‘నితాంత దంత పీడన రట దాస్యరంగ వికట భ్రుకుటీ చటుల ప్రవృత్త నర్తన ఘటనాప్రకార భయదస్ఫురణా పరిణద్ధమూర్తియై’ అక్కడనుంచి కళ్ళలో కోపాగ్ని జ్వాలలు రగులుతుండగా, నిస్సహాయస్థితి వలన కలిగిన కోపం కనుక స్వేదబిందువులు క్రమ్మగా ఒక్కసారిగా లేచాడు.

చ.           కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల నంగ ము
               ల్గనరఁగ సాంద్ర ఘర్మ సలిలంబులు గ్రమ్మ, నితాంతదంతపీ
               డనరట దాస్యరంగ వికటభ్రుకుటీచటుల ప్రవృత్త న
               ర్తన ఘటనా ప్రకార భయదస్ఫురణా పరిణద్ధమూర్తియై.      (విరాట. 2-133)

రౌద్రరసానికి పరాకాష్ఠగా ఈ పద్యాన్ని తిక్కనగారు మలిచారు.

సీ.           నేలయు నింగియు దాళముల్ గాఁ జేసి యేపున రేగి వాయించి యాడఁ,
               గులపర్వతంబులు గూల్చి యొండొంటితోఁ దాకంగ వీఁకమై దన్ని యాడ,
               నేడు సాగరములు నిక్కడక్కడ బెట్టి పలుచని రొంపి మై నలఁదికొనఁగ
               దిక్కులు నాలుగు ఒక్కచోటికిఁ దెచ్చి పిసికి పిండలి చేసి పిడుచగొసఁగ,         

           అపరిమిత శక్తి సామర్ధ్యాలు ఉన్న వాళ్ళు అవమానాన్ని చూస్తూ భరిస్తూ ఎందుకుండాలి? ‘నేలయు నింగియు దాళముల్ గా జేసి ఏపున రేగి వాయించి యాడ గుల పర్వతంబులు కూల్చి యొండొంటితో తాకంగ వీకమై తన్ని యాడ’ - కులపర్వతాలను తీసుకుని వాటితో బంతాట ఆడు కునేవాడిలా ‘ఏడు సాగరములు ఇక్కడక్కడ బెట్టి’ - ఆ సప్తసముద్రాలను తీసుకుని ఇక్కడి సముద్రం అక్కడ, అక్కడి సముద్రం ఇక్కడ మార్చి వాటి వెనుక మిగిలిపోయిన పంకాన్ని శరీరానికి 

Player
>>