ద్రౌపది పరాభవం3

పూసుకున్నట్లుగా, ‘దిక్కులు నాలుగు ఒక్కచోటికి తెచ్చి పిసికి పిండలి చేసి పిడుచగొనఁగ’ - నాలుగు దిక్కులనూ ఒకచోట చేర్చి పిండి చేసి ముద్దగా చేసేటట్టుగా.

తే.           మిగిలి బ్రహ్మాండ భాండంబు పగుల వ్రేయ
               నప్పళించుచుఁ బ్రళయ కాలానలమున
               గండరించిన రూపంబు కరణి భీముఁ
               డతి భయంకరాకారత నతిశయిల్లె.                              (విరాట. 2-134)

               ‘మిగిలి బ్రహ్మాండ భాండంబు పగుల వ్రేయ నప్పళించుచుఁ బ్రళయ కాలానలమున గండరించిన రూపంబు కరణి భీముడు అతి భయంకరాకార’ - ప్రళయభయంకర ఆకార విశేషంతో భీముడు క్రోధాగ్నితో ప్రజ్వరిల్లాడు.

               ‘ఇట్లు పేర్చిన కోపావేగంబున అవిచారిత సమయ వర్తనుండై వృకోదరుండు కీచకుని కీటడగింపన్ చూచి’ - ఆ కోపంలో కీచకుని ఆ క్షణమే చంపేయాలన్నంత ఆవేశం కలిగింది. ‘అని తత్సంబంధ బద్ధుండును ఆజ్ఞాపరిపాలకుండును’ - కీచకునితో ఉన్న సంబంధముచేత కట్టుబడిన వాడు ‘కావున మత్స్యపతి తన అలుకలోని వానిని కా దలచి’ - కాబట్టి మత్స్యపతి కూడా తన కోపానికి కారకుడే అని తలచి, ‘అని అచ్చేరువ నున్నత వృక్షంబు నిరీక్షించి యాననంబు పల్లటిల్ల ధర్మ తనయుం గనుంగొనిన’ - దగ్గర్లో ఉన్న చెట్టును ఆయుధంగా చేకొనదలచి, అట్టి స్థితిలో కూడా ఒక్కసారి అన్నగారి ముఖం వైపు చూశాడు. ‘చూసిన అతను తన నయనాకారంబున వారించి’ - యుధిష్ఠిరుడు - చెదరని ధైర్యం తో నిలబడేవాడు కాబట్టే ధర్మరాజుకు ఆ పేరు. ధర్మరాజుకు కూడా కోపం వచ్చింది. ఆ కోపంవలన నుదుటిమీద స్వేదబిందువులు అగ్నికణాలుగా వ్యాపించి ఉన్నాయి. కానీ అణచుకోవలసిన పరిస్థితి. భీముణ్ణి నియమించాలి. కోపంతో ఊగిపోతున్న భీముడు నియమాన్ని అతిక్రమించి పొరపాటు చేస్తే ఆ పొరపాటు ఫలితంగా మళ్ళీ అందరూ బాధపడవలసివస్తుంది. కాబట్టి భీముణ్ణి చూచి ‘ఇది సమయం కాదు’ అన్నట్లుగా సైగ చేశాడు.

ధర్మరాజు విచక్షణ..

   ద్రౌపది రావడం, ఆ వెంటే కీచకుడు తరుముతూ రావడం, ఆమెను పడత్రోయడం, ఆ దృశ్యాన్ని చూసినంతనే భీముడు ఉద్రేకంతో ఊగిపోవడం, ఆ పై ధర్మరాజువైపు చూడటం, ధర్మరాజు కనుసైగ చేసి ఆపటం - ఇవన్నీ క్షణకాలంలో జరిగిపోయిన విశేషాలు.

మ.  వలలుండెక్కడఁ జూచె నొండెడ నసేవ్య క్ష్మాజముల్ వుట్టవే 
      ఫలితంబై వరశాఖ లొప్పగ ననల్ప ప్రీతి సంధించుచున్      
      విలసచ్ఛాయ నుపాశ్రితప్రతతికిన్ విశ్రాంతి గావింపఁగా     
      గలయీ భూజము వంటకట్టియలకై ఖండింపఁగా నేటికిన్.    (విరాట. 2-136)

                        ఎవరికి ఏ విధంగా అవగతమవ్వాలో అదే విధంగా చెప్పాలి, కాని గోప్యంగా ఉండాలి. అందుకే ధర్మరాజు భీముని నిలువరించి - ‘వలలుం డెక్కడ చూచె’ - వలలుడు ఎక్కడ చూచాడు? ‘ఒండెడ’- ఇంకొకచోట, ‘అసేవ్య క్ష్మాజముల్ పుట్టవే?’ - ఎవరూ ఆశ్రయించని వృక్షములు ఉండవా? ఇది నలుగురికీ ఊతమిస్తున్న చెట్టుఏది? భీముడు పట్టుకున్న చెట్టునుగురించి కాదు, విరాటరాజునుద్దేశించి అన్యాపదేశంగా చెబుతున్నాడు. ఆ రాజును ఆశ్రయించుకుని ఎంతోమంది ఉన్నారు. ఆ రాజును - ‘తన యలుకలోని వానిగా’- తలచాడు కదా భీముడు, అందుకని చెబుతున్నాడు. ‘అసేవ్యక్ష్మాజము’ ఎవరు? కీచకుడు. అతడికి భయపడి వీళ్ళు మిన్నకున్నారు. ఆ కీచకునితో సంబంధ బద్ధుడైనందువల్ల విరాటుడి మీద వైరం పెంచుకుంటే చాలా 

Player
>>