ద్రౌపది పరాభవం5

     మరి ‘ఇందుబింబము మీఁది కందు చందంబున గురులు నెమ్మొగమున నెరసియుండ’,-ఎలా? ఇందుబింబం తెల్లగా ఉంటుంది. ద్రౌపది నల్లగా ఉంది. నల్లగా ఉన్న ద్రౌపది ముఖంమీద వ్యాపించిన కురులు కందు లాగ ఎలా ఉంటాయి? మన తిక్కనగారు గదా! కొంత ఆలోచించాలి. మహాకవి వాణి అలా వచ్చింది. ‘కురులు’ అన్నాడు కాని ‘నల్లని కురులు’ అనలేదు కదా! ఆ మహాకవి వాణిలో పొరపాటు జరగదు గదా! విరాటనగరం చేరే సమయానికి పాండవుల వయసు ఎంత?

ఇభపట్టణంబున కేగునాటికి ధర్మరాజు పదారు వర్షముల వాడు
వాయుజుండు పదేనువత్సరంబులవాడు, పదునాలుగేండ్లు వివ్వచ్చునకున
పరికింప కవలకు పదుమూడు వర్షముల్ జననీ సమేతులై సౌఖ్యముండి
విద్యలు నేర్చిరి వెసఁ బదుమూడేండ్లు లక్కయింటారు నెలలు వసించి
రిరవుగా నార్నెల లేకచక్రము నందు నేడాది ద్రుపదునే యింట నున్కి
ఐదు వత్సరములు యౌవరాజ్యంబున నిరువది మూడేండ్లు నింద్రపురిని
వనము నజ్ఞాతంబు చనె పదుమూడేండ్లు నటమీద ముప్పది యారునేండ్లు
రాజ్యాభిషేకంబు రాజులెల్లను గొల్వ ధర్మంబుతో మించి ధాత్రి ప్రోవు
శ్రీకృష్ణు కృపకల్మి సిద్ధసంకల్పత నష్టోత్తరశత హాయనము లుర్వి
జెలగి పట్టంబు తుద పరీక్షితునకొసగి
సోదరులు సతి జతగూడి సొరిది దివికి
నరిగి వేడుక స్వర్గ సౌఖ్యంబు గనిరి
పాండవులు వారి యశముర్వి నిండి వెలసె

       దీనిని బట్టి అప్పటికి ద్రౌపది కొంచెం అపరావస్థలో ఉన్న స్త్రీ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పటికే సంతానం కలిగి వయస్సు పైబడిన పరిస్థితిలో ఉంది. కాబట్టి ‘ఇందుబింబముమీది కందు చందంబున కురులు నెమ్మొగమున నెరసియుండ’,- పూర్ణేందుమనోహర సుందర వదనారవిందం మీద కనపడీ కనపడక, అక్కడక్కడా మెరుస్తున్న నెరసిన కురులు, వ్యతిరేకార్థంలో చంద్రునిమీద ఉన్నట్లుగా అని చమత్కారం!

       మరి అటువంటి ద్రౌపదిని కీచకుడు కోరాడా? వయోధర్మ పరిణామదశ అయినా, ద్రౌపది శరీరగత సౌందర్యరేఖావైభవం తగ్గలేదు. కీచకుడు తీవ్రమైన కాముకుడు. ఆమెలో వాడు చూస్తున్నదదే. ఆ విషయం ద్రౌపదిని గురించిన కీచకుని భావనలో విస్తృతంగా వర్ణింపబడింది. పెచ్చుమీరిన విచ్చలవిడితనంతో రెచ్చిపోయి, మదగర్వంతో, నిరంతర కామ చింతనతో నిండిపోయిన వానికి వయసుతో నిమిత్తంలేదు.

             ‘సర్వజనవంద్యయైన పాంచాలి సింహబలునిచే నివ్విధంబున భంగపాటు తనకు వచ్చిన నెంతయు దైన్యమొంది యవ్విరాటుని సభఁజేర నరిగి నిలిచి’ – ఇటువంటి దైన్యస్థితిలో ఉన్న ద్రౌపది లేచి నిలుచుంది. రాజసభను చూచింది. ‘పంబిన కోపము’ – ఉద్వేగం వల్ల వస్తున్న కోపము, ‘సమయభంగభయంబును’ - పొరపాటున మాట తూలితే సమయభంగం అయిపోతుందనే భయం, రెండూ ‘నగ్గలించి యుల్లంబు పెనంగొనగఁ’ – కలగలసి ఏం మాట్లాడాలో తెలియక ఆమె కలవరపడింది. ‘పతులం దగ సభ్యులఁ జూచు మాడ్కి’- పతులను, అక్కడ ఉన్న ఇద్దరు భర్తలు - ధర్మరాజు, భీముడు, వారి వైపు చూసింది. సభాసదులందరినీ చూసినట్లుగానే వాళ్ళవైపు కూడా చూసింది. కాని ఆమె కన్నుల్లో వెలువడిన తీక్ష్ణత్వము, నైశిత్యము వాళ్ళిద్దరికీ అర్థమై ఉంటుంది. ‘సభ్యుల రూక్షంబగు చూడ్కి ఆ ద్రుపదు కన్నియ సూచి సభాజన ప్రతానంబును మత్స్యనాథుడు వినంగ నెలుంగు చలింప నిట్లనున్’- ఒక్కసారి మత్స్యనాథుని చూచి గొంతు గద్గదికమైపోగా ‘నిఖిలధర్మాధర్మ నిపుణంబులైన సుధాంతరంగంబుల అతిశయిల్లి శిష్టసంరక్షణ దుష్టనిగ్రహముల నీతి వాటింపంగ నేర్పుగల్గి సకల శస్త్రాస్త్రసంచయములఁ 

Player
>>