ద్రౌపది పరాభవం6

బరమాద్భుతంబు సేయు పరిశ్రమంబు తాల్చి’ –ఆమె భర్తలు ఎటువంటివాళ్ళు? -“నిఖిల ధర్మాధర్మనిపుణంబులైన శుద్ధ అంతరంగంబుల అతిశయిల్లి’ – ధర్మాధర్మవిచక్షణ కలిగినవారు. శుద్ధమైన అంతరంగము ఉన్నవారు. శిష్టరక్షణ దుష్టశిక్షణలే ధ్యేయంగా కలవారు. క్షత్రియధర్మాన్ని సంపూర్ణంగా అవలంబించిన వ్రతసంపన్నులు. ‘సకల శస్త్రాస్త్రసంచయంబుల పరమాద్భుతంబు చేయు పరిశ్రమంబు తాల్చి’ - అన్ని విధములైన ఆయుధములను ప్రయోగించడం తెలిసినవారు, ‘దుర్దమ ప్రతిభట మర్దన క్రీడమైఁ జతురులు” - అణచరాని శత్రువులు ఎదురొస్తే వారిని మర్దించగలిగిన సామర్థ్యం కలిగిన వారు,  -’ఎందు నుతికి నెక్కి’– కీర్తి పొందిన,-’గంధర్వులు ఏవురు’ - ఐదుగురు గంధర్వులు, నా భర్తలు,-’నన్ను ఇట్టులొకఁడు వఱుపంగ’,- ఒక్కడు వచ్చి నన్ను ఈ విధంగా అవమానిస్తే, -’ఊరక ఒదిగి చూడ ఆచ్చెరువు గాదె’– ఊరకుండుట ఆశ్చర్యంగా ఉన్నది. నన్ను రక్షిస్తున్న ఆ గంధర్వులు అయిదుమంది ఏదో ఒక పనికి మాలినవాడు ఒక్కడు వచ్చి ఈవిధంగా పరాభవిస్తే చూస్తున్నారు, ‘ఎవ్వరి యాండ్రు రింక పరిభవంబునఁ బొందక బ్రదుకువారు’ - ఐదుగురు భర్తలు ఉన్న నా రక్షణే ఇలా ఉంటే ఇంక ఎవ్వరికి రక్షణ ఉంటుంది?

క.         ఈ నరపతి యాస్థానము

            లో నొక్కరుఁడైన ధర్మలోపభయమునం

            బూని తగవైన వెడ పలు          

            కైనను పలుకంగఁ జాలఁడయ్యెను నకటా                             (విరాట. 2-141)

               ఒక్కడు కూడా మాట్లాడలేదు. అందరూ వినోదం చూస్తున్నట్లు ఊరికే చూస్తున్నారు. ‘విషాదకరమైన సన్నివేశాన్ని వినోదప్రాయంగా వేడుక చూస్తున్నారా?’  సభాపర్వంలో కూడా ఈ విధంగానే అడిగింది ద్రౌపది. ఇక్కడ భర్తల గురించి చెప్పింది. ‘ఇందఱుఁ జూడగా నిచట నిమ్మెయి నన్నుఁ, బతివ్రతా గుణాస్పందిత వర్తనన్, బరమసాధ్వి, ననిందిత శీలఁ, గీచకుం డెందును నెట్టి యంగనల నెవ్వరు జేయనియట్లు సేయఁగాఁ” - చరిత్రను ఒకసారి పునశ్చరణం చేసుకుంటే నాకు జరిగిన పరాభవం ఎప్పుడూ, ఏ స్త్రీకీ, ఎటువంటి దుష్టచరిత్రాత్ముడివల్లనైనా కలిగినట్లు లేదు. “గొందఱకైన నిప్డు కృపకుం దఱి గాదటె? యేమి సెప్పుదున్” - కొందరికి కూడా అంతఃకరణంలో జాలి కొంచెమైనా లేదా! ‘ఐనను మత్య్సదేశమున యాజ్ఞ కితం డొడయండు కాన’ - ఇది మత్స్యసామ్రాజ్యం. దీనికి ‘ఒడయడు’ - రాజు ‘కాన నాకీ నరనాథుఁ దూరదగు’ - కాబట్టి ప్రజలకు కష్టం వస్తే దానికి బాధ్యత వహించవలసినవాడు ప్రభువే. కాబట్టి ఇతన్నే నేను తప్పుబడతాను. ‘ఎయ్యది యేని నధర్మ మెవ్వ రెందైన నొనర్చినం బ్రభువు లారసి దండన మాచరింతురు’. - రాజు తన ప్రజలలో ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే న్యాయాన్యాయవిచారణ చేసి ధర్మాన్ని స్థాపించి దోషులను దండించాలి. ‘ఇచ్చో ననుఁ దన్ను కీచకుని చూచియు నూరక యున్కి పాడియే’ – ఇప్పుడిలా నన్ను పరాభవిస్తున్న కీచకుని ఉపేక్షించటం న్యాయమా? రాజధర్మమా?

నన్నయభట్టు పద్యవిద్య

               ఇక్కడ ఒక్కసారి మనం సభాపర్వ సందర్భం గుర్తు చేసుకోవాలి. ఈ విరాటరాజు సభలో ఇప్పుడు ఆమె విజృంభించి ఆనాడు కురుసభలో అడిగిన ద్రౌపదిలాగ అడగలేదు. మాయజూదం నాటి ఆ సభలో అందరికి ఈమె ద్రౌపది గానే తెలుసు. ఆరోజు కూడా చెప్పుకొన్నది “అవ్విధంబున నొప్పి” తిక్కనగారి తెలుగు, నన్నయగారి తెలుగు పక్కన పక్కన పెట్టుకుని చూస్తే, ‘అవ్విధంబున నొప్పి’ - “ఆ విధంగా జన్మించి” ఆమె ఎలా జన్మించింది?  “కులపవిత్ర సితేతరోత్పల కోమలామల వర్ణ ఉత్పల సుగంధి లసన్మహోత్పలనేత్ర” మూడు ఉత్పల పదాలు వాడారు నన్నయగారు. ఉత్పలమంటే ఏమిటి ‘ఊర్ధ్వం పతతి గచ్ఛతి ఇతి ఉత్పలః’ - పైకి ప్రజ్వలించి వికసించేటువంటిది ఉత్పలం. అంటే ఎన్ని అవమానములు కలిగినా ఆత్మాభిమానంతో, ఆత్మవిశ్వాసంతో పైకే లేస్తూ ఉంటుంది. అది ఉత్పలం. ఆమె శీలాన్ని అక్కడ మూడుసార్లు ఉత్పలమయినట్లు వర్ణించారు. విచిత్ర మేమిటంటే మనం ఈ పద్యాన్ని అన్వయించుకుని చూస్తే 

Player
>>