సుధేష్ణ ఓదార్పు2

      ‘అట్టి యెడ సుదేష్ణ చేయునది లేక నివ్వెఱఁ గంది యుండెఁ దక్కటి యంగనలునుఁ గీచకుని నీచత్వంబు దలంచి వాని చేటున కొడంబడిరి,’- సుదేష్ణ ఏమీ చేయలేక భయంతో నిలువగా, ఆమె పరివారం ‘సరే వీడింతే! మనం నిమిత్తమాత్రులం, కీచకుడు చేసినదానికి అనుభవించాల్సిందే!’ అనుకున్నారు. ‘పరిభవానల సంతప్తయైన పాంచాలి నిజశయన స్థానంబునకుం జని తల్పంబుపై మేను వైచి యపాంగంబులం దొరంగు కన్నీరు చెవుల కొలంకులు నిండ నెవ్వగలు నివ్వటిలం దలపోయుచుండి.’ - ‘పరాభవాగ్నితో దహించుకుపోతున్న ద్రౌపది తన ప్రదేశానికి వెళ్ళి, తల్పంపై శరీరాన్ని పడవేసి, కనుగొలుకుల చివరినుండి స్రవిస్తున్న కన్నీటి ధారలు చెవులచివరలను తడుపుతుంటే దుఃఖితురాలై విషణ్ణవదనంతో దీర్ఘాలోచనలో మునిగిపోయింది.

Player
>>