కీచకవధకు ప్రణాళిక 1

కీచకవధకు ప్రణాళిక

 

కీచకుని వృత్తాంతముః

     ఈ కీచకుడు ఎవడు? ఎక్కడినుంచి వచ్చాడు? వీడి పుట్టు పూర్వోత్తరాలేమిటి? కొన్ని ప్రతుల్లో ఈ విషయం వివరంగా కనబడుతుంది. సంస్కృత మహాభారతంలో కూడా కొన్ని సంశోధితప్రతుల్లో ‘జనమేజయుడు వైశంపాయనుడిని ఈ కీచకుడు ఎవరని అడుగుతాడు.

శ్లో.          ‘కస్య వంశే సముద్భూత స్స చ దుర్లలితో మునే
              బలోన్మత్తః కథం చాసీత్ శాల్యో మాత్స్య స్స కీచకః’

       ఆ కీచకుడు మత్స్యనగరానికి, పాండవులమీద అపరిమితమైన గౌరవాదరాభిమానములు కలిగిన విరాటరాజుకు ఏవిధంగా వాడు సంబంధి? ఈ కీచకుల వ్యవహారం ఏమిటి? వైశంపాయనుడు ‘త్వ దుక్తో య మనుప్రశ్నః కురూణాం’- అని కీచకుల వ్యవహారం వివరించాడు. పరశురాముడు ఇరవై ఏడుసార్లు క్షత్రియులను అందరిని మట్టుబెట్టి, క్షత్రియజాతిని రూపుమాపటంతో క్షత్రియజాతి నశించిపోయింది. క్షత్రియులు తిరిగి క్షేత్రబీజప్రాధాన్యధర్మాన్ని సంతరించుకుని ఉత్తములైన బ్రాహ్మణులు, క్షత్రియ కన్యలకు సంతతి కలిగించారు. ఇది అనులోమం. ఆవిధంగా క్షత్రియులు బ్రాహ్మణ కన్యలను వివాహం చేసుకుంటే ప్రతిలోమం. ‘బ్రాహ్మణ్యాం క్షత్రియా జ్జాతః’ - ఆ విధంగా బ్రాహ్మణస్త్రీకి క్షత్రియులవలన ‘సూతో భవతి పార్థివ’ - జన్మించినవాడు సూతుడు. రథాన్ని నడిపే వృత్తిని అవలంబించారు కాబట్టి సూతులయ్యారు. ‘ప్రాతిలోమ్యేవ జాతానాం’ - ప్రతిలోమపద్ధతిలో జన్మించినప్పటికీ, ‘స హ్యేకో ద్విజ ఏవ తు’ - క్షత్రియులలో కూడా ద్విజత్వం ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ ద్విజులుగానే ఉన్నారు వైశ్యులకన్నా ఒక మెట్టు ఎక్కువ. క్షత్రియులకన్నా ఒక మెట్టు తక్కువ. బ్రాహ్మణత్వం కూడా వారిలో ఉంది. ‘రథకార మి తీమం హి క్రియాయుక్తి’ - రథం నడిపే వృత్తి వీరిది. ‘క్షత్రియాత్ అవరం వైశ్యాత్’ ‘తేషాం తు సూతవిషయః సూతానాం నామతః కృతః ఉపజీవ్య చ యత్ క్షేత్రం లబ్ధం సూతేన యత్ పురా’ - మొదటితరం వంశస్థులు ఇచ్చిన భూమికి, వీళ్ళ బలపరాక్రమాలను జోడించి క్రమక్రమంగా రాజ్యాన్ని విస్తరింపజేసుకుని వాళ్ళకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసుకున్నారు. కాలక్రమేణా కొంతమంది రాజులు వాళ్ళతో సంబంధం చేసుకోవటం జరిగింది. ఇక్కడకు మొగలాయులు వచ్చినప్పుడు మొగలు దండయాత్రలు జరిగినప్పుడు రాజపుత్రస్త్రీల సంబంధ బాంధవ్యాలిటువంటివే.

            కాబట్టి చారిత్రకధర్మాన్ని అనుసరించి క్షత్రియులు వాళ్ళలో వాళ్ళు సంబంధాలను చేసుకోవటం జరిగింది. ‘పుత్రా స్తస్య కురుశ్రేష్ఠ మాలవ్వాం జజ్ఞిరే తదా తేషాం అతిబలో జ్యేష్ఠః’ - అలా ప్రధానమైన వారిలో కేకయుడనే వానికి మాలవదేశ రాజకన్యకు ప్రబలులైన కీచకులు జన్మించారు. వారిలో జ్యేష్ఠుడు ఈ కీచకుడు. ‘ద్వితీయాం యాంతు మాళవ్యాం’ -మరొక మాళవ రాజకన్యకకే, ‘చిత్రా హ్యవరజా భవతు’,- చిత్ర అనే పేరుగల కూతురు జన్మించింది. ‘సుదేష్ణా ఇతి వై ప్రాహుః’ - ఆమెనే సుదేష్ణ అనే పేరుతో విరాటరాజుకు ఇచ్చారు. ‘సురథాయాం మృతాయాం తు కౌసల్యాం శ్వేత మాతరి,- ఆ విరాటుడి ప్రథమ కళత్రం, కోసలరాజకన్యక సురథ మరణించగా, ‘తాం విరాటస్య మాత్స్యస్య కేకయః ప్రదదౌ ముదా’ - భార్య పోయిన మత్స్యరాజుకు సుదేష్ణను ఇచ్చి వివాహం చేశారు. ఆవిధంగా వీళ్ళకు సంబంధం ఏర్పడింది. ‘మాతృష్వసృ సుతాం రాజన్ కీచక స్తా మనిందితామ్, సదా పరిచరన్ ప్రీత్యా విరాటే న్యవసత్ సుఖీ’ - కీచకుడు తన తల్లిచెల్లెలి కూతురైన సుదేష్ణను అభిమానంతో సేవించుకుంటూ విరాటనగరంలో ఉండిపోయాడు.

         ఈ కీచకుడు చాలా బలవంతుడు, శస్త్రాస్త్రయుక్తిసంపన్నుడు. వాడి బలంతో చుట్టుపక్కల రాజ్యాలన్నింటిని 

Player
>>