కీచకవధకు ప్రణాళిక 3

గల్గెనే’ - ‘సభలో జరిగిన పరాభవాన్ని కళ్ళారా చూశావు ఇంతలో మరిచావు’. -’అది వినం బనిలే దటు గాక యున్న రూపెఱిఁగియు నేన చెప్పవిన నిష్టము గల్గుట’,- ‘అదేమీ వినదగిన వినోదంకాదు. జరిగిన పరాభవాన్ని  ప్రత్యక్షంగా చూసి కూడా నీలో చల్లారిన ఆ క్రోధాగ్నిని మళ్ళీ ప్రజ్వలింపచేయటానికి నా ముఖతః ఆ అవమానాలన్నీ చెప్పించుకోవాలని నీకంత కోరికగా ఉన్నదా?’‘ఇష్టము గల్గుట చాల లెస్స’ - నీ ఆలోచన బాగున్నది. ‘యత్తెఱ గెఱిఁగించెదన్ వినుము తెల్లముగా మొదలింటనుండియున్’. ఇక్కడ తిక్కనగారి రసాభ్యుదయోల్లాస కథనా శిల్పానికి, సంక్షిప్తీకరణశక్తికి నిదర్శనమీ సందర్భం. 

   కీచకుడివలన కలిగిన అవమానాన్ని ద్రౌపది రెండు పద్యాల్లో పూర్తిగా చెప్పింది. ‘అధిపు మఱంది సింహబలు డప్పకు మ్రొక్కఁగవచ్చి’,- అక్కను నమస్కరించడానికి వచ్చి, ‘నన్ను నత్యధిక మనోజ రాగమతియై కనుఁగొంచుఁ గడంగి యెన్నియేన్ విధములఁ బల్కి నాకుఁ దన విన్నను వెల్లను జూపి’- నన్ను కాముకతతో చూస్తూ, యెన్నో విధాలుగా మాట్లాడుతూ, ‘మానధనవిహీనతం జెనకినం గడు నేవము పుట్టి యయ్యెడన్’ - అభిమానవిహీనుడై నాకు ఏవగింపు కలుగజేశాడు. ‘విడియం బలుకఁగ వెండియు నుడుగక కీచకుఁడు మన్మథోన్మాదము తన్నడరిన న్ననడుగుటకుం దొడరిన’,- మన్మథునివలన కలిగిన ఆ ఉన్మాదంతో నన్ను కోరటానికి ప్రయత్నిస్తే, ‘కోపించి వానితో నేనిట్లంటిన్’- కోపోద్రేకంతో నేను అప్పుడు కీచకునితో ఈ విధంగా చెప్పాను.

శా.    దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర

        ద్గర్వాంధ ప్రతివీర నిర్మథనవిద్యాపారగుల్ మత్పతుల్
        గీర్వాణాకృతు లేవురిప్డు నిను దోర్లీలన్ వెసన్ గిట్టి గం
        ధర్వుల్ మానముఁబ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిం గీచకా!      (విరాట. 2-172) 

            ‘అనిన విని కొన్ని ప్రల్లదంబులు పలికిన’,- ‘అయినా వాడు కొన్ని ప్రగల్భాలు పలికితే’, ‘ఏనును పదంపడి’,- నేను తరువాత ‘పాపాత్మయైన సుదేష్ణ తనకు మదిరారసంబు తేరం గీచకనివాసంబునకు నన్నుం బనిచిన’ - ‘ఆ కీచకుని అక్క సుదేష్ణ నన్ను మదిరకొఱకు అతని ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించింది’.- ‘పోవుట కొడంబడక యెన్ని సెప్పిన నన్నింటికి నన్ని సెప్పి నిర్బంధించినం’ - ‘నేను చెప్పిన అభ్యంతరాలన్నిటికీ తగిన సమాధానాలు చెప్పి నన్ను బలవంత పెడితే’, ‘పెనంగ నొల్లక నా మనంబున నన్నెవ్వరికి నేమి సేయవచ్చునని’ - ‘ఆమెతో వాదించడం ఇష్టం లేక, గత్యంతరం లేక’, ‘నా మనంబున’ - ‘నా మనస్సులో’. ‘మీలావు నచ్చి’-, ‘మీ బలం తలచుకుని, మీరుండగా నన్నెవరూ ఏమీ చేయలేరని నిశ్చయించుకుని’, ‘సూతు నింటికి సురకుం బోయిన’- ‘ఆ కీచకుని ఇంటికి మదిర కోసం వెళ్ళాను.’ ద్రౌపదికి తన భర్తలపైన విశ్వాసం, అది గంభీరంగా సాభిప్రాయంగా భీముడికి వ్యక్తం చేసింది. -’కొన్ని వెడమాటలాడుచు నన్ను నతఁడు సెట్టపట్టినం’, - ‘ఏవో పనికిమాలిన మాటలు పలుకుతూ నన్ను పట్టుకోవటానికి ప్రయత్నించిన కీచకుని, - ‘ద్రోచి వెసం జన్న’, త్రోసి పారిపోతుండగా ‘వెనకొనుటయును మీ యున్నెడకు ఏనపుడు సంభ్రమోపేతగతిన్’,- ‘వాడు నన్ను వెంబడిస్తే భయంతో మీరు ఉన్న చోటికి వచ్చాను’. -’పాఱుదెంచిన నక్కులపాంసనుండు కోప మడరంగ వెనుకన కూడముట్టె,’- అయినా వదలక ఆ కీచకాధముడు నన్ను తరుముకొని వచ్చాడు. ‘అట ఎరుంగుదు నీవు’,- ‘అక్కడ ఏమైందో నువ్వూ, నీకు తెలిసిన విషయమే’, -’మీయన్న పెద్దతనముఁ జూచితివి’- ‘మీ అన్నగారి పెద్దతనము నువ్వు కూడా చూశావు’. -’ఏమందు ననిలతనయ’,- ‘ఇంక నేను ఏమంటాను?’. -“అక్కట! యాఁడుకూయును నాలకూయును ” - ‘ఆవుల ఆక్రందనను, ఆడువారి ఆక్రందనను విన్నపుడు’, -’లాతివారి కైన నరయవలయు ననిన’ - ‘ఇతరులు శత్రువులైనా సరే ఆదుకోవాలి అంటే,’ -’నన్నుఁ గీచకుండు దన్నంగ నెట్టులు చూడనేర్చె ధర్మసూను డపుడు,’-’ధర్మం అలాంటిది అయితే, నన్ను, ద్రౌపదిని, ధర్మపత్నిని, ధర్మజుడు భార్యగా చూడనక్కరలేదు. కనీసం ఒక అనాధ అయిన స్త్రీని ఒక అధముడు వచ్చి నిండుసభలో పరాభవిస్తుంటే కంకభట్టు స్థానంలో ఉన్న ఆ ధర్మసూనుడు

Player
>>