కీచకవధకు ప్రణాళిక 4

ఆదుకోకపోగా, నన్ను శైలూషి అని నిందించి వెళ్ళిపొమ్మని ఆదేశించాడు’.

   ‘అనిన విని యతం డిట్లనియె,’- ద్రౌపది అన్న మాటలు విని భీముడు ఇలా అన్నాడు. ‘కీచకుఁ డట్లు మీదు పరికింపక నిన్నుఁ బరాభవింపగాఁ జూచి మహోగ్రకోపవివశుండగు నన్నును జూచి,’- ‘కీచకుడు అనుచితంగా నిన్ను పరాభవించటం, దాంతో అణచుకోలేని కోపంతో వశంతప్పిన నన్ను కూడా, ‘ధైర్యహేమాచలుఁడైన ధర్మ సుతుడు’- ‘ఎటువంటి క్లిష్ట పరిస్థితిలోనూ చలింపక, మేరుపర్వతంలాగా ధర్మజుడు సుస్థిరచిత్తంతో ఉండి,’ ‘అమ్మెయి వారణ సేయకున్న,’- క్రోధాగ్నితో రగులుతున్న నన్ను కనుసన్నతో ఆపకపోయినట్లయితే, ‘నీచత వాని మత్య్సవిభునిం పరివారము నుగ్గు సేసినన్,’- ‘నేను సమయాన్ని అతిక్రమించి ఏదైనా అపరాధం చేసి ఉండే వాడిని’. ‘ఆ సంరంభంబున సమయభంగంబుగా జనంబులు మనల నెరింగిరేని,’- ‘తద్వారా మన అజ్ఞాతవాసరహస్యవర్తనం బయట పడితే, ‘ముందటి భంగిన కానలయందున చరింపగవలదె,’ మళ్ళీ ముందటిలాగ పన్నెండుఏళ్ళు అరణ్యవాసం, ఒక ఏడు అజ్ఞాతవాసం చేయవలసి వచ్చేది కదా!’. –‘నీవును నేనుం దెచ్చిన యాపదగా నిందింపరె ఎల్లవారు,’- ‘ఆ ఆపద మన తొందరపాటువలన కలిగినది అందరూ అంటారు కదా!, ‘కావున సత్యవ్రతనిష్ఠుండగు యుధిష్ఠిరుండు పొగడ్తకుం దగువాడు గాని దూరువడ నర్హుండు గాడు,’- ‘కాబట్టి మనలను ఆ పొరపాటు చేయకుండా నిగ్రహించిన ధర్మరాజు పొగడతగినవాడే కానీ నిందార్హుడు కాడు’. ‘పరిభవ కరుఁడగు కీచకు పరి మార్చుట యిప్పుడు గడవబడియెనె,’ అయినా, నిన్ను పరాభవించిన ఆ కీచకుని వదిలిపెడతామని ఎలా అనుకున్నావు?’, ‘యిమ్మెయి దురపిల్లనేల వ్రేల్మిడిఁ బొరిగొని’ - నీవు ఇంతగా బాధపడవలసిన పనిలేదు. ‘నీ మనము కలఁక పుత్తు లతాంగీ’- నీ దుఃఖాన్ని నేను నివారిస్తాను. ఇప్పటికీ సమయం మించిపోలేదు. ‘మనల నెవ్వరు ఎరుఁగ కుండునట్టి తెరంగుఁ దలపోయ వలయుఁగాక,’- కాని మనల్ని ఎవ్వరూ గుర్తించని విధంగా, గోప్యంగా, నిర్వహించవలసిన పని ఇది.’ ‘పగతు భంజించుట యెంతటి పని’ - ‘సమయభంగం కాకూడదనే ఆలోచన లేకపోతే కీచకుడి అంతు చూడడం ఎంతసేపు?’

     ద్రౌపది కూడా ఆలోచించింది. ఏదో బాధలో అన్నది కానీ ఆమెకు మాత్రం తెలియదా? ‘అన నమ్మానిని ఇట్లనియె,’- ఇలా అన్నది. ‘గొంతికి నంత వెఱవ’- ‘నేను అత్తగారికి భయపడను’, ‘మీకంత వెఱవ’ - మీకూ అంతగా భయపడను, సభలో చెప్పింది కదా! నేను నాట్యకత్తెని, జూదరియైన వాని భార్యను’ అని భయం ఉంటే ఎందుకు చెప్తుంది? ‘దైవమునకు నంత వెఱవ,’- దైవానికి కూడా అంతగా భయపడను. ‘అత్యంత కలుషాత్మ విరటుని కాంతకు నే వెఱతుఁ బనులు కావించు నెడన్,’- ‘కానీ సుదేష్ణకు సేవలు చేస్తున్నప్పుడు, ఎక్కడ అయుక్తమైన కార్యానికి నియోగిస్తుందో అని అమితంగా భయపడుతున్నాను. కాబట్టి నా భయము, క్రోధమువలన అసహాయతకు లోనై కలత చెంది నిందించాను. ఈ బలహీనస్థితిలో తిరిగి అక్కడే నేను ఇంకొన్ని రోజులు గడపాలి అంటే చాలా కష్టం’. ‘కినుకకు జాల కెంతయునుఁ గీడ్పడి నా పడు పాటు లెల్ల వమ్మునఁ గలయంగ ‘- ‘ కోపాన్ని అణచుకోలేక, నేను పడిన భంగపాట్లు ఒకదాని తరువాత ఒకటి గుర్తుకు వచ్చి మనస్సును కలచివేస్తుంటే,’ ‘ఇట్టు లొక మూర్ఖునిచేఁ దుదిబోయి కోలుపోయెనె యభిమానము ,’- ‘చివరికి ఒక మూర్ఖుడా నన్ను వచ్చి పట్టుకొన్నది? ఆ విధంగా పరాభవించినది?’  ‘అన్వగపు న నేడ్తెఱ డెందము కొందలంబుఁ బొందిన ధృతిమాలి యేఁ బలికితిన్ దగవెల్ల నెఱింగి యుండియున్,’- ‘ఆ పరాభవంతో రగులుతున్న నామనస్సును అణచుకోలేక చెప్తున్నాను. అన్నీ తెలిసినప్పటికీ ధైర్యాన్ని కోల్పోయిన స్థితిలో ఆవిధంగా పలికాను.

యుధిష్ఠిరుని ఔన్నత్యం

             ‘ఇట్టిద కాని సమస్తజన స్తవనీయుండగు పాండవాగ్రజు నిక్కంబ నిందించిన దానం గాన,’- ఆ దుఃఖావేశంతో అన్నాను. అంతేకాని జనవంద్యుడైన ధర్మరాజును నేను నిందించటంలేదు,’ ‘చనునె వేరొకని కజాతశత్రుండను పేర దిగ్విజయంబు పెంపు దాల్ప?’ ధర్మరాజు ఎటువంటివాడు? ఆయన చేసిన రాజసూయయాగం ఎటువంటిది? రాజసూయం చేసి అన్ని సామ్రాజ్యాల్ని జయించి, ఆయా రాజులను సామంతులుగా గ్రహించినా ‘అజాతశత్రువు’ అన్న పేరు వచ్చిందంటే, ధర్మరాజు శీలం ఎట్టిదో 

Player
>>