కీచకవధకు ప్రణాళిక 6

మది ప్రీతికి నీడగువృత్తి పేరునుం పుట్టును మాలి’ - ఉన్నత వంశములో, పాండవాగ్రజునిగా జన్మించి ఆ మహనీయమైన వంశం ఔన్నత్యాన్ని పేరును కూడా తలపక, ఇప్పుడు ఉన్న, ‘బ్రుంగుడుపాటున,’- ఇటువంటి దీనస్థితిని చూచి ‘నాకు ఎట్టు మనంబు పట్టు ధృతి,’- ‘నా మనసు వికలం కాక ఎలా వుంటుంది’. నీ విషయం చూస్తే బకాసురుడిని,హిడింబాసురుడిని, కిమ్మీరుడిని, జరాసంధుడిని నీ భుజబల పరాక్రమంతో నిర్జించావు. అటువంటి నీవు దాస్యవృత్తిలో ఉంటే నాకెలా ఉంటుంది?

తే.           ‘బక హిడింబ కిమ్మీరుల బాహుబలము
               నా జరాసంధు నుదగ్ర దర్పాతిశయము
               లోకభీకరములు విజయాకరములు
               నైన నీ కరములకు లోనయ్యెఁ గాదె’                             (విరాట. 2-194)

       మరి అర్జునుడు ఎటువంటివాడు? ‘మగలకు మేటియైన బలమర్దననందనుఁ బేడిఁ జేయగాఁ దగునె విధాత నీకు’ దేవతలకు సహాయముగా వెళ్ళి నివాత కవచులనే రాక్షసులను సంహరించి వచ్చినటువంటి వాడు. అంతటి ఇంద్ర తనయునికి విధాత ఈ పేడిరూపాన్ని ఎలా కల్పించాడు? ఆ నకులుడు ఎటువంటివాడు? ‘తనయొ ప్పెదురఁ గన్నఁ దగిలి యెవ్వరికైన మలఁగి క్రమ్మఱఁ జూడవలయువాఁడు’ - ఎవరైనా ఒకసారి చూస్తే మళ్ళీ తిరిగి చూడాలనిపించే అందగాడు నకులుడు. అంతటి సుకుమార సౌందర్యమూర్తి అయిన నకులుడు ‘ఒరులకు అశ్వశిక్షకుడు’ ఇక్కడ అశ్వశాలలో గుర్రాల శిక్షణలో కాలం గడుపుతున్నాడు. ‘ఆ రూపం బవికార మా భుజబలం బత్యంత నిర్గర్వ, మా శూరత్వంబు దయారసానుగత, మా శుంభత్ర్కియాజ్ఞానము.’- మహా సుకుమారుడు సహదేవుడు ఆవుల కాపరి యైనాడు.

           భీముడు ఎప్పుడైతే ఆప్యాయవచనాలు పలకటం ప్రారంభించాడో ద్రౌపది తన ఆవేదనను అణచుకోలేకపోయింది - సంవత్సరంనుంచి పాపం ఆమాత్రం పలకరింపుకు కూడా ఆమె ముఖం వాచిపోయి ఉంది. భర్తలు ఆందరు సన్నిహితంగానే తిరుగుతున్నారు గాని ఆత్మీయంగా పలకరించుకునే అవకాశం రాలేదు. భీముడు ‘మనం ఇటువంటి పరిస్థితిలో ఉన్నాము గదా!’ అని గుర్తుచేయటంతోనే ఒక్కసారి ఆ ఉద్వేగాన్ని ఆపుకోలేక, ‘నాగురించి మాత్రమే మీరు బాధ పడుతున్నారు. మీ అందరి గురించిన ఆవేదనతో నా మనసు ఎంత రగిలిపోతోందో నీకు అర్థమౌతున్నదా? ఆ ధర్మరాజు, ఆ అర్జునుడు - ఎటువంటి వీరుడికి ఆ పేడి ఆకారము వచ్చింది. నకులుడు గుర్రాలశాలలో ఉన్నాడు.” సహదేవుడు ‘సుకుమారుడతడు గోపాలక వృత్తి వహించి అడవులన్ క్రమ్మరుచున్కి’ - ఉదయం లేస్తే ఆ ఆవులమందనంతా తీసుకొని గోపాలకులతోపాటు అరణ్యానికి వెళ్ళి వాటిని మేపుకొని రావాలి. ఈ సహదేవుడు ఎటువంటివాడు? ధర్మరాజు రాజసూయయాగము చేస్తున్నప్పుడు, శ్రీకృష్ణుని ఔన్నత్యానికి ఆయనకు ప్రథమపూజను చేయదలచినప్పుడు, ఆ నిర్ణయాన్ని సమర్థించిన బుద్ధిమంతుడు. శిశుపాలుడు ఆ నిర్ణయాన్ని గర్హిస్తే, ‘ధర్మరాజు నిర్ణయానికి ఎవడైనా ఎదురు తిరిగితే నా వామ పాదంబు వాళ్ళ శిరమున పెడతా’నని ప్రతిజ్ఞ చేసి నిలిచినవాడు. ఆ సహదేవునికి ఎటువంటి అవస్థ వచ్చింది?

          అని ‘ఏనును మీరుఁ గానలకు నేగునెడ’- నేనింకో విషయము చెప్పాలి. మనం ఆ రోజు జూదంలో ఓడిపోయి అరణ్యావాసాలకు వెళ్తున్నప్పుడు అత్తగారు చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. పన్నెండుసంవత్సరాలు, పదమూడవ సంవత్సరం కూడా అయిపోవస్తోంది. వెనకటి మాటైనా సరే! ఈ రోజు నా చెవుల్లో రింగుమని నా మనసులో శూలంలా గుచ్చుకొని నన్ను బాధపెడుతూనే ఉంది. ‘ఏనును మీరు కానలకు నేగు నెడన్’- మనం అరణ్యవాసానికి బయలుదేరి నప్పుడు, ‘ననుఁ జేరి ఎంతయున్ దీనత దోప కుంతి’- నావద్దకు ఎంతో దైన్యంతో కుంతీదేవి నా దగ్గరకు వచ్చి, సహదేవుడిని, -’ఇల్లడబెట్టి’- అప్పగించి, అమ్మా ‘నిను నమ్మి చాల విషమంబగు ఇవ్వనవాస మీతడున్ పూనగ నియ్యకొంటి’- భయంకరమైన అరణ్యవాసానికి సుకుమారుడైన వీనిని నువ్వున్నావన్న ధైర్యంతో సమాధానపరుచుకున్నాను’. ధర్మరాజు, భీముడు, అర్జునుడు కుంతీదేవి పుత్రులు. మాద్రీదేవి సంతానం నకులుడు, సహదేవుడు. అటువంటిది తన కుమారులను గురించి చెప్పక సహదేవుని 

Player
>>