కీచకవధకు ప్రణాళిక 9

దాన వచ్చి యడ్డపడె నేని, నీవ పెంపారు కరుణ కాచితేని’- భీముడు తన సహజస్వభావాన్ని చూపుతున్నాడు, ఆ ధర్మరాజు తానే వచ్చి అడ్డుపడినా, నువ్వే కరుణతో క్షమించినా, ‘గాచితేని నాచేఁ బడుఁ గీచకుండు’ - నేనా కీచకుడిని బ్రతకనివ్వను. ‘వానిదెసం జింత యావంత వలవ దమ్మాటలు విడువు మని’ - ఇక నీవు వాడిగురించి ఆలోచించ వద్దు.  

      ద్రౌపది మనసుకు ఊరట కలిగించాలని భీముడు, ‘ఎంతో మంది ఎన్నో బాధలు పడ్డారు కదా! ‘చ్యవనుని వాంఛకు సంయాతినందన యిడముల గుడువదె యడవిలోన’ - సుకన్య కథ విన్నావు కదా! అరణ్యవాసం చేస్తున్నప్పుడు మార్కండేయుడు వచ్చి చెప్పగ విన్నాం కదా! అవన్నీ గుర్తుకు తెచ్చుకో. ‘దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని సైంధవ ప్రముఖంబగు దుష్టలోకంబు నధోలోకంబున కనుచు నంతకు మదీయాంతరంగంబు చింతాభరభుగ్నంబు నవమాన పంకమగ్నంబును, గోపోద్విగ్నంబునునై వేగిరపడుచున్నయది’ - దుర్యోధనాదులను అధోలోకానికి పంపేవరకు నా మనసు కుదుటపడదు’. ‘ధార్తరాష్ట్రులకుం గాలావసానంబైన యట్లు సమయకాలావసానంబయ్యె’ - వాళ్ళకు కాలం దాపురించినట్లు మన ప్రతిజ్ఞ కూడా పరిసమాప్తి అయ్యే సమయం ఆసన్నమైంది. అజ్ఞాతవాసానికి ఇంక మూడు వారాలు మాత్రమే గడువు ఉన్నది’. ‘అజ్ఞాతవాసంబు జొచ్చి పదునొకండు నెలలు సని పండ్రెండవనెల వర్తిల్లుచున్నయది,’- చివరి దశలో ఉన్నాము, ‘దీని కొఱంతఁ దీరిన నీదు వంతయుం దీఱు నూరడిల్లు’- ‘ఇప్పుడు కీచకుడు. రేపు ఆ కౌరవులు నశించుట తథ్యం’.

     ‘సింహబలుండు నిన్ను పరిభవించి మై మైతోన యునికిం జేసి’- ఆ కీచకుడు నిన్ను పరాభవించి ఇంకా జీవించి ఉన్నందుకు బాధ పడవద్దు. ‘ఎల్లియుం జెనకవచ్చు నీవుం గ్రమంబున నొడంబడుట భావించుకొని’- నీవు నెమ్మదిగా వాడి మాటలు విన్నట్లుగా నటించు, ‘నర్తనశాల సంకేత ప్రదేశంబుగా జెప్పి యొంటిమెయిం జనుదేర నియమింపుము’- ‘ఒక్కడే నర్తనశాలకు వచ్చేట్లుగా నమ్మించి ఒప్పించు. వాడు తన అనుచరబృందముతో అమాత్య బృందముతో రాకూడదు’. ‘వాడు వచ్చిన ఆ సొబగుని తెగఁ జూచి నీకుం జూపి నీ చిత్తంబు వడసెద’- ఆ సొబగుని - ఆ సొగసుకారుని, ఇప్పటి భాషలో చెప్పాలంటే ఆ ‘షోకిల్లా’ను చంపి, నీకు కనులారా చూపించి నీకు మనఃశ్శాంతిని కలుగజేస్తాను’. ‘ఇత్తెరంగు తప్ప నొండు విధంబుగా గర్జంబు కాదు’- ఇది తప్ప వేరేమార్గం లేదు. వాడు రాత్రి నీకోసం ఎప్పుడైతే రహస్యంగా వస్తాడో అప్పుడు ఎవ్వరికీ తెలియకుండా ఆ పని పూర్తిచేయడానికి అవకాశము ఉంటుంది. -’నిశ్చయంబు’- తప్పదు. ‘ఇట్లు చేయువార మిమ్మాటవలనం దప్పవు కాని’- ఈ మాటలు వృథా కావు. నీకు మాట ఇస్తున్నాను. తాత్కాలికంగా వాడిని నీ మాటలకు ప్రలోభపడునట్లు చేసి అక్కడకు వచ్చేటట్లు చేయి, కాని. ‘వేగుచున్న యది’- తెల్లవారుతున్నది. ‘జనులు మేలుకాంచి మనల గాంచిరేని వంచన బయలుఁ బడినన్ కార్యంబు తప్పు’- ఎవరైనా మనలను గమనిస్తే మన పని చెడిపోతుంది. ‘కీచకవధంబునకున్ బూనిన నా మనోరథంబు తుదిముట్టవలయు’- కీచకుని సంహారంకోసం నిర్ణయించుకున్న నా కోరిక తీరాలి. ‘నిజశయనస్థానంబునకుం బొమ్మని శయ్యాతలంబు విడిచి అత్తరుణిన్ తరిమి’ - ద్రౌపదిని తన స్థానానికి వెళ్ళమని, ‘తరిమి’ - అంటే ఆమె వెనుక కొంచెం దూరం అనుసరించాడు.

      ‘కొన్ని యడుగు లనిచి మరలి మారుతాత్మజుండు కలుషాత్ముం డగుచు సెజ్జకు వచ్చె అచ్చెలువయు తన నిద్రించు నెడకుం బోయి పర్యంకభాగంబునం దనువు వైచి’- ఆ భీముడు కీచకునిపై క్రోధంతో తన శయ్యపై చేరగా, ఆమె కూడా తన శయ్యపై శరీరాన్ని పడవేసింది, ఎంత ఉద్విగ్నస్థితిలో ఉన్నదో చూడండి. ఆ ‘మేను వైచి’ అనే మాట ఇంత పెద్ద వచనానికి ప్రాణంవంటిది. ఆంతసేపు భీముడు చెప్పినా ఆమె మనసు కుదుటపడలేదు. ‘మేను వైచి అంకిలి దీరని డెందంబుతో’ - సాంత్వన చిక్కలేదు. ఇంకా కలవరపడుతున్నది. ‘కొందలంబుతోడి నిశ్చయంబున నిద్రం బొరయని’- ఆ దిగులుతోనే -’కనుదోయి మొగిడ్చి యుండె’- ఆమె కళ్ళు మూసుకున్నది కానీ నిద్ర రావటం లేదు.

             మూలంలో భీముడు ద్రౌపదితో ఈ విధంగా చెబుతాడు. ‘సంధార్య మనసా రోషం’ - మనస్సులో రోషము నిలువరించుకొని ‘దివారాత్రం వినిష్వసన్’ - ఉదయము రాత్రి ఎలాగో ఊపిరి, జీవం నిలబడుతున్నదంటే ‘మహాసేవ 

Player
>>