కీచక వధ2

         కీచకుడు వచ్చాడు. అక్కడ భీముడున్నాడని తెలియదు. ‘సింగంబున్న గుహా నికేతమునకున్ శీఘ్రంబునన్ జొచ్చు మాతంగంబు’ సింహం ఉన్న గుహలోనికి మదించిన ఒక ఏనుగు ప్రవేశిస్తున్నట్టు గా, కీచకుడు సామాన్యుడు కాదు కదా! మహా బలశాలి. కీచకుడి చరిత్రను తలచుకున్నప్పుడు ఈ విరాటదేశానికి సంపాదించిన రాజ్యసంపదంతా అతడి భుజస్కంధాలపై స్థాపితమైనది అని చదువుకున్నాం. కాబట్టి, వృకోదరుడైన భీముడు సింహంలాగ నర్తనశాల అంతర్భాగంలో ఉన్నాడు. మదోన్మత్తుడైన కీచకుడు ఏనుగులాగా ఆ నర్తనశాల ప్రవేశం చేశాడు. సైరంధ్రి రూపంలో ఉన్న భీముని కనుగొని, కీచకుడు మల్ల చరచుకుని తన ప్రతాపం చెప్పుకున్నాడు. ‘నాదు రూపంబు మనంబునఁ జిక్కిన తరుణి దక్కొరు నేల సరకుసేయు?’,- నా రూపం మనసారా చూసిన ఏ స్త్రీ అయినా మరెవరినీ లెక్కచేయదు అంటూ తన గుణాలన్నీ చెప్పుకున్నాడు. నా సంగతి నీకు తెలియదు కాబట్టి నీవు ఒక్కెతవే ఈ విధంగా నాయందు ప్రవర్తిస్తున్నావు కాని ఇంకెవరైనా ఇట్లా చేసిన వాళ్ళున్నారా అని ఎగతాళిగా అన్నాడు. భీముడు, “నిన్ను నీవే పొగుడుకుంటున్నావు, బాగుంది. కాని నా సంగతి నీకు తెలియదు కదా! ‘నాదు రూపంబు మనంబునఁ జిక్కిన తరుణి దక్కొరు నేల సరకుసేయు?,'- అని నువ్వన్నావు బాగుంది. ‘నా పోల్కి యాఁడుదాని వెదకియు,’- నా లాంటి ఆడది ప్రపంచమంతా వెదకినా కూడా, -‘ఎయ్యెడనైన నీకుఁ బడయవచ్చునె,'- నీకు లభించదు కదా! ‘నా యొడలు సేర్చినప్పుడ నీ యొడలెట్లగునొ? దాని నీ వెఱిఁగెదు,’- 'నా శరీరాన్ని నీ శరీరం కలసినప్పుడు కదా! నీకు అసలు విషయం తెలిసేది' అని ద్రౌపదికి వినిపించేలా చెప్పాడు.

      అటు తరువాత భయంకరమైన యుద్ధం జరిగింది. జరిగినప్పుడు ఇద్దరూ జాగ్రత్తగానే ఉన్నారు. కీచకుడు మాటిమాటికి దెబ్బలు తింటున్నాడు. అయినా కూడా -‘తన యగపాటొరు లెఱుఁగుదురని,’- తనకు జరిగే అవమానము, తన దుశ్చేష్ట ఇతరులకు తెలిసి ఇంకా పరాభవం జరుగుతుందేమో అనే భయంతో కీచకుడు, -‘సమయభంగ మగునని భీముండు,’- తమ అజ్ఞాతవాసం భంగపడుతుందేమో అని భీముడు మల్లయుద్ధంలో సహజంగా చేసే హుంకారాది ధ్వనులను, పరస్పరోద్రేకపూర్వకమైన తిరస్కార వాక్కులను చేయకుండా యుద్ధంచేసుకున్నారు. ఎంత తీవ్రమైన బాధాసన్నివేశాలైనా కూడా ఒక్క శబ్దం చెయ్యలేదు. అలాంటి సమయంలో కీచకుడి బలం నశించిపోయింది. భీముడు విజృంభించి, వీడిని ఎలా చంపాలా అని చేతులు నలుపుకున్నాడు. అందరికంటే జుగుప్సాకరమైన దశని కీచకుడికి సంప్రాప్తింప చేయదలచుకున్నాడు. ‘వికృతపుఁ జావు సంప మది వేడుక పుట్టె’,- వికృతంగా చంపాలనే వేడుక పుట్టింది. వాడిని పట్టుకున్నాడు. ‘మస్తకమును పీనదీర్ఘభుజశాఖలు పాదయుగంబు మేనిలోనికి చొర నుగ్గుగా తుఱిమి,’- ఒక సంచిలో బట్టలు పట్టకపోతే కుక్కి కూరి ఎలా పెడతారో అలా శిరస్సు, చేతులు తర్వాత పాదాలు అన్నిటినీ కూడా మధ్యలో ఉన్న ఉదర భాగం లోపలికి దూర్చేశాడు. ‘దూర్చి నించిన క్రంతల తిత్తియైన,’- వీడి శరీరానికి ఏర్పడిన రంధ్రాలేవైతే ఉన్నాయో ఈ అవయవాలతోనే అవి మూసుకుపోయాయి. అక్కడినుంచీ ఎంతో రక్తం స్రవించింది. ‘నించిన క్రంతల తిత్తియైన కీచకు ధరణీస్థలిం జదిపి’ చక్కని ముద్దగా చేసె ‘తుష్టుడై’, ‘దుష్టుడై’,- రెండు విధాలుగా చదువుకోగల అవకాశం. ‘తుష్టుడై’,- ద్రౌపదికి జురిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నానని సంతోషంతో కీచకుడిని సంహరించాడు. ‘దుష్టుడై’,- దోషస్వభావప్రకటన పటిష్ఠుడై,- కీచకుని చంపినా ఇలా ఇంత జుగుప్సావహంగా ‘ఇది తల, ఇవి యంగములని’ వేరుపడనీక ‘నించిన క్రంతల తిత్తి’ చేసి ఘోరమైన రీతిలో చంపాలా? తామస గుణాన్ని తారస్థాయికి తీసుకునిపోయి తామసప్రవృత్తి బయటపడే విధంగా కీచకుడి వధ చేసి ఇక్కడ మాత్రం భీముడు దుష్టుడయ్యాడు.

                        ద్రౌపదిని పిలిచాడు. చిమ్మచీకటి, అర్ధరాత్రి. వీడు ఉన్న స్థితి కనపడదు. అందుకని అగ్నిని తీసుకొచ్చాడు. ‘అనలము వేగ బట్టి’ వెలిగించి కొంచెం ప్రకాశవంతంగా చేసి, ‘ఇదిగో వీడే ఇక్కడ పడి ఉన్నాడు’ అని ఆమెకు చూపాడు. ఆమెకు అర్థం కాలేదు. కీచకుడు ఎక్కడున్నాడు అని వెదకింది. ఆ శయనం పైన ఉన్న దిండు, పరుపులేమన్నా కింద పడిపోయాయేమో అనుకున్నది. ఆ పదార్థాన్నే ‘ఇదిగో వీడే’ అని చూపాడు. ఆమెకు భయము, జుగుప్స, దానితో సంతోషం, ఉత్సాహం అన్నీ కలిగి వాడిని చూసి ఆఖరికి ముక్కు మీద వేలు వేసుకుని దీనికోసమా ఇంత చేసుకున్నావు? ఇప్పుడైనా సుఖంగా ఉండు అని అన్నది. భీముడు ఆమెను చూసి, -‘చింతాశల్యము వాసెనే? భుజబలోత్సేకంబు నీకెక్కెనే? శాంతిం బొందెనె రోషపావకుఁడు?,’- నీలోని 

Player
>>