కీచక వధ7
ఉ. అంగజరాగమత్తుఁడగు నన్నకు నిమ్మెయినైనఁ బ్రీతిసే
యంగలవార మీ జఱభి యాతని తోడన తీఱుఁగాక యం
చుం గొనిపోయి దైన్యమున సూతునిపీనుఁగు మీఁదఁ బాండు
పుత్రాంగనఁబెట్టి, కట్టిరి దయా పరివర్జిత చిత్తవృత్తులై (విరాట. 3-17)
‘అంగజరాగమత్తుఁడగు నన్నకు’ - ఈమెను చూసి ఈమె మీద వాంఛతో తపించిపోయిన మా అన్నకు, ‘ఇమ్మెయినైనఁ బ్రీతిసేయంగలవారము’ - అన్నగారి శరీరంతో ఈసైరంధ్రి శరీరాన్ని చుట్టిపెడితే అప్పుడయినా వాడి ఆత్మ శాంతిస్తుంది అని, వాడి కళేబరానికి ద్రౌపదిశరీరాన్ని కట్టి తీసుకుని పోయారు.