అశ్వత్థామార్జునుల యుద్ధము1

అర్జునాశ్వత్థామల సమరం

          ‘ఈమెయి నిజజనకు భుజోద్దామబలము దోడుతోడఁ దఱుఁగుటయు’- తండ్రిగారి బలము క్షీణిస్తున్నది, అర్జునుడు విజృంభిస్తున్నాడు. ఈ విషయాన్ని అశ్వత్థామ గమనించాడు. ‘రథస్తోమంబుఁ దాను నశ్వత్థామ వెసం దాఁకెఁ’ వెంటనే అశ్వత్థామ యుద్ధంలోకి వచ్చాడు. ద్రోణాచార్యులు కొంచెం అలసటతో పక్కకు వైదొలగారు.

          అశ్వత్థామ అర్జునునితో తీవ్రంగా యుద్ధం చేస్తున్నప్పుడు, అశ్వత్థామ కూడా ‘ఇవ్విధంబున ధనుంజయుండేయు వేగంబున నేయు టయు ద్రోణుతనయు తూణీరంబులు శరశూన్యంబులయ్యెఁ దనతూణీరంబు’-. అర్జునుడివి అక్షయతూణీరాలు. అవి తరిగిపోకుండా వస్తుంటాయి. మిగతావాళ్ళు తిరిగి తెచ్చుకోవాలి. అశ్వత్థామ పొదిలో ఉండే బాణములు అయిపోయాయి. ఒట్టి విల్లుతో ఏం చేయలేడు. ‘అక్షయ బాణంబు లగుటం జేసి యంతకంతకు నతి శయిల్లు పెల్లున నేయుచు నధికుండగు నప్పాండవమధ్యముం గనుంగొని కృపాచార్యుండు చెంగటం దల మీఱిన’. అశ్వత్థామ స్థితిని చూసిన కృపాచార్యుడు వెంటనే అర్జునుని ఎదుర్కొన్నాడు.

కృపాచార్యునితో కూడా ఈ విధంగా అర్జునుడు అలవిమీరిన పరాక్రమంతో యుద్ధం సాగించాడు. కృపాచార్యుడు చూపించిన ధనుర్విద్యా వైశిష్ట్యము కూడా ఏ మాత్రం తగ్గకుండా ఉంది. ఎందుకంటే కృపాచార్యుడు ఈశ్వరాంశసంభూతుడు. అతని తండ్రి శరద్వంతుడనే ఋషి వేదాలను చదువుకోకుండా ధనుర్వేదాలను మటుకు ఆరాధించి, అభ్యసించి, కొడుకుకు ధనుర్విద్య నేర్పించాడు.

Player
>>