కవిత్రయ భారతం

వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి అనేది మన తెలుగువారి నానుడి. మహాభారతానికి తెలుగుదేశంలో ఉన్న ప్రసిద్డికాని, ప్రచారంకాని మరెక్కడా లేదనడం అతిశయోక్తి కాదు.అంతగా మహాభారతం మన తెలుగువారి జీవితాల్లో పెనవేసుకుపోయింది. కాదు కాదు అలా చేశారు మన కవిత్రయం నన్నయ, తిక్కన, ఎఱ్ఱాప్రగడలు. పంచమ వేదంగా కీర్తింపబడేటట్లుగా వేదవ్యాసుల వారు మహాభారతాన్ని సంస్కృతంలో రచించారు. ఆ మహా భారతాంధ్రీకరణతో తెలుగులో కావ్యరచనకు శ్రీకారం చుట్టి తెలుగువారికి కవితాభిక్ష పెట్టినవారు ఆది కవి నన్నయ అయితే, ముందున్నది శ్రవ్య కావ్యమో, లేక దృశ్యకావ్యమో అన్న అనుభూతిని కలిగించేటట్లు కావ్యానికి నాటకీయతను జోడించిన వారు కవిబ్రహ్మ తిక్కన. నన్నయ, తిక్కన రచించిన రెండు నవరత్నహార భాగాలను తన అరణ్యపర్వ శేషం అనే మణితో సంధానించి సమగ్రమైన భారతామృతాన్ని తెలుగువారు ఆస్వాదించే అదృష్టాన్ని మనకు ప్రసాదించారు ప్రబంధ పరమేశ్వరుడు ఎఱ్ఱన.

రండి, నన్నయ ప్రసన్న కథా కలితార్థయుక్తిని, తిక్కన రసాభ్యుచిత బంధాన్ని, ఎఱ్ఱన సూక్తి వైచిత్రిని ఆస్వాదించండి!

కొత్త నిక్షేపాలు

Player
>>