ఇటీవలి వ్యాఖ్యలు

ఇంకా...

స్వపరిచయం

పూజ్య గురువులు శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ గారు వ్యాఖ్యానించిన శ్రీ మన్మహాభారతం అంతర్జాలంలోను, పుస్తకరూపంలోను ప్రకటించిన వారు "భారత ధర్మ ప్రచార పరిషత్" అనే సంస్థ. ఈ కార్యక్రమానికి ఆర్ధిక ప్రపత్తి కల్పించినది "పుచ్చా లలిత & రమణ ఛారిటబుల్ ట్రస్ట్". పుచ్చా లలిత, పుచ్చా వెంకట రమణ గార్లు ఈ సంస్థకు ధర్మకర్తలు. వీరు "ITM" విద్యా సంస్థల వ్యవస్థాపకులు, వివిధ నాట్య, సంగీత, సారస్వత, సామాజిక సంస్థలకు మహారాజ పోషకులు.

ముంబైలో పూజ్య గురువులు శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ గారు 2009 లో ప్రారంభించిన శ్రీ మన్మహాభారత ధారావాహిక వ్యాఖ్యాన ప్రసంగాలు ITM విద్యాసంస్థలకు వ్యవస్థాపకులైన శ్రీ పుచ్చా రమణగారింట్లో నిరాఘాటంగా ౨౦౧౬ వరకు కొనసాగింది.  ఈ వ్యాఖ్యానామృతాన్ని జనులందరూ ఆస్వాదించాలనే సదుద్దేశంతో వీటిని రికార్డింగ్ చేయించాము. ఈ వ్యాఖ్యాన ఖండికలను ముంబయిలో క్రమబద్ధీకరించి వెబ్ సైట్లో ఎక్కిస్తున్నాము. ఈ ప్రయత్నంలో మాకు సహకరిస్తున్న వారు ముంబయిలో సౌండ్ ఎడిటర్ శ్రీ సమీర్ ఖోలే గారు, హైదరాబాద్‌లో వెబ్ కన్సల్టెన్ట్ శ్రీ రమణ రంజన్ గారు.

ఈ వ్యాఖ్యానాలు చదువుకోవడానికి వీలుగా భాగ్యనగరంలో డా.శలాక లలిత గారి ఆధ్వర్యం లో "శ్రవణ ప్రతిలేఖనం" చేయించాము. శ్రీమతులు శ్రీకళ, పద్మ, హరిత, దుర్గ, శ్రీదేవి - వీరందరూ శ్రీ సురేంద్రనాథ్ గారి వ్యాఖ్యానం విని, టైపు(ట్రాన్స్క్రైబ్) చేసి, సవరింపులు చేసి, వ్యాఖ్యానకర్త ఉదాహరించిన పద్యాలూ, శ్లోకాలూ, లిఖిత ప్రతిలో జోడించారు. ఆ పైన డా.లలిత గారు, తరువాత శ్రీ సురేంద్రనాథ్ గారు, చివరగా డా.శలాక రఘునాథ శర్మ గారు వీటిని సవరించి ప్రామాణికమైన వ్యాఖ్యన ప్రతిలేఖన ప్రతి నిర్మించారు. వీరందరి శ్రమకు ప్రతిరూపమే విరాట పర్వము, ఉద్యోగ పర్వము 5 సంపుటములుగా వెలువడ్డాయి. తక్కిన పర్వాలను ముద్రించే కృషి జరుగుతోంది.
 
నిత్యజీవితంలో ఉపయోగపడే ఎన్నో జ్ఞానదీపికలు ఈ వ్యాఖ్యానాలలో ఉన్నాయి. ఆ కాంతులు మీ జీవితాల్లో వెలుగులు నింపితే మా ప్రయత్నానికి సార్థకత లభించినట్లే!

కొత్త నిక్షేపాలు

Player
>>