విరాట పర్వము1
ఈ భాగంలోని ముఖ్యాంశాలు: తిక్కన కవితా వైశిష్ట్యం, విరాట పర్వం ప్రాముఖ్యత, కావ్య సంప్రదాయాలు, తిక్కన కాలం నాటి శైవ వైష్ణవ వైషమ్యాలు మతభేదాలు తిక్కనలో నిర్వచనోత్తర రామాయణ రచనా కాలం నుంచి భారత రచనా కాలానికి కలిగిన మానసిక పరిపక్వత, తిక్కన వ్యక్తిత్వం, పూర్వ కవి స్తుతి, హరిహరనాథ తత్త్వం, తిక్కన స్వప్న వృత్తాంతం, షష్ట్యంతములు, విరాటపర్వంలో తిక్కన ప్రదర్శించిన నాటకీయత, రసపోషణ, కథానుగమన ఔచిత్యనిర్వహణ.
ఈ భాగంలోని ముఖ్యాంశాలు: భారత కథా ప్రారంభం, ధర్మరాజు తమ కష్టాలు తలచుకొని నిర్వేదం పొందుట, తిక్కన ప్రబంధ రచనా ధోరణి, ధౌమ్యుడు ధర్మజుని ఓదార్చుట, భీముని సాంత్వన వాక్యములు, సాహిత్య వివేచన-వసు చరిత్ర, అజ్ఞాతవాస మెచట సలపవలెనో యని ధర్మరాజు అర్జునునితో చర్చించుట , అర్జునుడు అనుకూల ప్రదేశములు తెలిపి ధర్మజుని గురించి చింతించుట, ధర్మరాజు వ్యక్తిత్వం, కాల మహిమ, పాండవుల అజ్ఞాతవాస వృత్తి నిర్ణయం, ప్రాస్తావిక సాహిత్య వివేచన, తిరుపతి వేంకటకవుల అవధాన విశేషాలు.
ఈ భాగంలోని ముఖ్యాంశాలు: ధౌమ్యుడు పాండవులకు సేవాధర్మాన్ని ఉపదేశించుట, పాండవులు తమ ఆయుధాలను శమీవృక్షంపై నిక్షేపించుకొనుట, వరుసగా ధర్మజుడు, భీముడు, ద్రౌపది(సుదేష్ణ వద్ద), నకులుడు, సహదేవుడు, అర్జునుడు విరాటుని కొలువులో కుదురుకొనుట, నాట్య సంప్రదాయ విశేషాలు, తిక్కన వర్ణనమందలి ఔచిత్యం, విరాటుని పుత్రికా వాత్సల్యం.
ఈ భాగంలోని ముఖ్యాంశాలు: పాండవులు విరాటుని కొలువులో కుదురుకొనుట, జీమూతమల్లునితో భీముని మల్ల యుద్ధం, మల్లయుద్ధ విశేషాలు
ఈ భాగంలోని ముఖ్యాంశాలు: సుదేష్ణ తమ్ముడగు కీచకుడు సైరంధ్రీ వేషములోనున్న ద్రౌపదిని చూచి మోహించుట, తన పొందు కోరిన కీచకుని ద్రౌపది హెచ్చరించుట, సుదేష్ణ ఆదేశమున కీచకునింటికి ద్రౌపది మదిర తెచ్చుటకు పోవుట, ద్రౌపది పరాభవం, భీమసేనుని ఆగ్రహం, ధర్మజుని వివేకం, సుదేష్ణ ఓదార్పు.
ఈ భాగంలోని ముఖ్యాంశాలు: ద్రౌపది ఆవేదన, ధర్మజుని ఔన్నత్యం, ద్రౌపది ప్రతీకార వాంఛ, కీచక వధకు ప్రణాళిక, ద్రౌపది కీచకుని నర్తనశాలకు రమ్మని చెప్పుట, కీచక వధ, ఉపకీచకుల ప్రతీకారయత్నం, ఉపకీచక సంహారం, విరాటుని భయం, ద్రౌపది మనోల్లాసం, సుదేష్ణ శోకం.
ఈ భాగంలోని ముఖ్యాంశాలు: వేగులు తమకు పాండవులు ఎక్కడా కానరాలేదని సుయోధనునకు విన్నవించుట, సుయోధనుడు కీచకుని మరణవార్తను గూర్చి విని పాండవులు మత్స్యరాజ్యంలో ఉండవచ్చునని ఊహించి ద్విముఖ వ్యూహం పన్నుట, సుశర్మ దక్షిణగోగ్రహణం చేయుట, విరాటుడు అర్జునుడు మినహా తక్కిన పాండవుల సహాయంతో సుశర్మను ఓడించుట
ఈ భాగంలోని ముఖ్యాంశాలు: సుయోధనుడు కౌరవ ప్రముఖులను తోడ్కొని ఉత్తరగోగ్రహణము చేయుట, ఉత్తర కుమారుడు బృహన్నల రూపములోనున్న అర్జునుని సారథిగా చేసికొని యుద్ధమునకు తరలుట, అశేష కౌరవ సేనా వాహినిని చూచి ఉత్తరుడు భీతి చెందుట, అర్జునుడు తన నిజరూపం ఉత్తరునకు చూపి ఉత్తరునికి అభయమిచ్చుట, అర్జునుని దశనామాల వివరణ, పార్థుని రాకపై, అజ్ఞాతవాసకాలసమాప్తిపై కౌరవసేనలో వాదోపవాదాలు, కావ్యగుణప్రస్తావన
ఈ భాగంలోని ముఖ్యాంశాలు: అర్జునుడు ఆచార్య ద్రోణుని వ్యూహం ఛేదించి పశులను మరల్చి, భీష్మ,ద్రోణ,కర్ణ,దుర్యోధనాది కురు వీరులతో పోరు సల్పి వారిని ఓడించుట, మోహనాస్త్రంతో యుద్ధపరిసమాప్తి కావించి వారి తలపాగాలు గ్రహించి వెనుకకు మళ్ళుట.
ఈ భాగంలోని ముఖ్యాంశాలు: విరాటుడు ఒంటిగా కౌరవసేనపై యుద్ధమునకు వెళ్ళిన ఉత్తరుని గురించి చింతించుట, ఉత్తరుని విజయ వార్త విని సంతోషించుట, విజయము బృహన్నల వలన సిద్ధించెనన్న ధర్మరాజు మాటలకు కోపించి ధర్మజునిపై సారె గొనివేయుట, ఉత్తరుడు యుద్ధ విశేషాలు తెలుపుట, అనంతరం పాండవులు సమావేశమై తమను తాము బయల్పరుచు విధానము గూర్చి చర్చించుట.